సాక్షి, విజయవాడ: ఏపీలో ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలలకు వైఎస్సార్ పేరును తొలగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 8500 కోట్లతో 17 కొత్త మెడికల్ కళాశాలలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. గత ఏడాది విజయనగరం, ఏలూరు,రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కళాశాలలను ఆయన ప్రారంభించారు. కొత్త మెడికల్ కళాశాలలకు దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. దశాబ్దాలగా ఉద్దానంలో ఉన్న కిడ్నీ సమస్యకి వైఎస్ జగన్ ప్రభుత్వంలో శాశ్వత పరిష్కారం లభించింది.
రూ. 750 కోట్లతో ఉద్దానం వాసులకి శాశ్వత మంచినీటి పథకంతో పాటు కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను కూడా వైఎస్ జగన్ సర్కార్ నిర్మించింది. ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన ఐదు మెడికల్ కళాశాలలకు చంద్రబాబు సర్కార్ అనుమతి సాధించలేకపోయింది. కానీ కొత్త మెడికల్ కళాశాలకు దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ పేరు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ జారీ చేసింది.
2023-24లో ప్రారంభమైన ఐదు, 2024-25 లో ప్రారంభం కావాల్సిన మరో ఐదు వైద్య కళాశాలలు పలాసలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, కడపలోని క్యాన్సర్ ఆసుపత్రికీ వైఎస్సార్ పేరును తొలగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment