Chandipura Virus: గుజరాత్‌, రాజస్థాన్‌లలో ప్రమాదకర వైరస్‌ కలకలం | Chandipura Virus Found In Rajasthan's Udaipur | Sakshi
Sakshi News home page

Chandipura Virus: గుజరాత్‌, రాజస్థాన్‌లలో ప్రమాదకర వైరస్‌ కలకలం

Jul 16 2024 11:30 AM | Updated on Jul 16 2024 11:42 AM

Chandipura Virus Found In Rajasthan's Udaipur

అంత్యంత ప్రమాదకర చాందిపురా వైరస్‌ ఇప్పుడు గుజరాత్‌ను దాటి రాజస్థాన్‌లోకి ప్రవేశించింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లాలో చాందిపురా వైరస్‌ కేసులు నమోదైన దరిమిలా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఉదయపూర్ జిల్లాలోని ఖేర్వారా బ్లాక్‌లోని రెండు గ్రామాలలో చాందిపురా వైరస్  కేసులు నమోదయ్యాయి. వైద్యాధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఖేర్వాడా బ్లాక్‌లోని నల్ఫాలా, అఖివాడ గ్రామాలకు చెందిన ఇద్దరు చిన్నారులు ఈ వైరస్‌ బారినపడి హిమ్మత్‌నగర్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ రెండు గ్రామాలు గుజరాత్ సరిహద్దుల్లో ఉన్నాయి. ఈ ప్రాంతానికి చెందినవారు ఉపాధి కోసం గుజరాత్ సరిహద్దు ప్రాంతాలకు వలస వెళుతుంటారు. ఈ వైరస్‌ బారినపడిన చిన్నారులలో ఒకరు మృతి చెందారని తాజా సమాచారం.

మీడియాకు అందిన వివరాల ప్రకారం గుజరాత్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ ఈ వైరస్‌ నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)కి పంపింది. చాందిపురా వైరస్‌ దోమలు, పురుగులు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది. బాధితులకు చికిత్స అందించడంలో ఆలస్యమైతే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement