ప్రాణాంతక చండీపురా వైరస్‌ : అసలేంటీ వైరస్‌, లక్షణాలు | Chandipura Virus Spreads Rapidly In Children Symptoms And Prevention Tips In Telugu | Sakshi
Sakshi News home page

ప్రాణాంతక చండీపురా వైరస్‌ : అసలేంటీ వైరస్‌, లక్షణాలు

Published Tue, Jul 16 2024 5:12 PM | Last Updated on Tue, Jul 16 2024 5:45 PM

Chandipura Virus spreads rapidly in children symptoms and tips

వర్షాకాలంలో వివిధ రకాల అంటువ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. తాజాగా గుజరాత్, రాజస్థాన్‌లలో ‘చండీపురా’ వైరస్ కలకలం రేపుతోంది. వేగంగా వ్యాపిస్తోన్న ఈ  వైరస్‌కారణంగా చిన్నారుల  మరణాల సంఖ్య  పెరుగుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.  గుజరాత్ లోని ఆరావళి సబర్ కాంతా జిల్లాలో ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే పలువురు చిన్నారులు మృతిచెందారు. చండీపురా వైరస్ ఎంత ప్రమాదకరమైనది?  లక్షణాలేంటి? దీని బారినుంచి పిల్లలను ఎలా రక్షించుకోవాలి?  ఈ కథనంలో తెలుసుకుందాం.

చండీపురా వైరస్ పిల్లలకు చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి సోకిన పిల్లవాడు సకాలంలో చికిత్స పొందకపోతే, అది మరణానికి కూడా దారి తీస్తుంది. ఈ వైరస్ నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

చండీపురా వైరస్  లక్షణాలు 
సాధారణం ఫ్లూతో సమానంగా ఉంటాయి లక్షణాలు. దీంతో మామూలుగా జ్వరమే అనుకోవడంతో ప్రమాదం పెరుగుతోంది. చిన్నారుల మరణాలకు కారణమవుతోంది. అధిక జ్వరం, జ్వరం వేగంగా పెరగడం. వాంతులు, విరేచనాలు , తలనొప్పి, ఒక్కోసారి తలనొప్పితో పాటు స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ జ్వరం పిల్లలకు ప్రాణాంతకంగా మారుతోంది కాబట్టి జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.

చండీపురా వైరస్ అంటే ఏమిటి?
చండీపురా వ్యాధి అనేది ఫ్లూ నుండి మెదడు జ్వరం వరకు తీవ్రమైన వ్యాధులకు కారణమయ్యే వైరస్. ఈ వైరస్  తొలి కేసులు 1965లో మహారాష్ట్రలోని చండీపురా గ్రామంలో  కనిపించింది. అందుకే దీనికి చండీపురా అని పేరు పెట్టారు. ఈ వైరస్ రాబ్డోవిరిడే కుటుంబానికి చెందిన RNA వైరస్. ఇది కీటకాలు, దోమలు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది.

ఏ వయస్సు పిల్లలకు ప్రమాదం
చండీపురా వైరస్ ఎక్కువగా 9 నెలల నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు సోకుతుంది. ఈ వైరస్ పిల్లలపై దాడి చేసినప్పుడు, సోకిన పిల్లలకి  హై ఫీవర్‌, జ్వరం, విరేచనాలు, వాంతులు, బ్రెయిన్‌ ఫీవర్‌ ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ లేదు. కనుక అప్రమత్తత  చాలా అవసరం. 

చండీపురా వైరస్‌ను ఎలా నివారించాలి?
దోమలు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది కనుగ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.  ఆహారం విషయంలో జ్రాగ్రత్త వహించాలి. చండీపురా వైరస్‌ను నివారించడానికి, దోమలు, ఈగలు , కీటకాలను నివారించడం ముఖ్యం. పిల్లలకు రాత్రిపూట పూర్తిగా  కప్పే దుస్తులు ధరించేలా జాగ్రత్తపడాలి. దోమ తెరలు వాడాలి.  దోమల నివారణ మందు వాడండి. దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలు , తలుపులు మూసి ఉంచాలి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement