సాక్షి, ముంబై: వరుస రికార్డులతో దూసుకుపోతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం కూడా మరో చరిత్రాత్మక గరిష్టాన్ని నమోదు చేసింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తాజాగా 14 లక్షల రూపాయలను దాటింది. దీంతో దేశంలో అత్యంత విలువైన కంపెనీగా తన స్థానాన్ని మరింత పదిలపర్చుకుంది. కేవలం 8 ట్రేడింగ్ సెషన్లలో లక్ష కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన ఘనతను రిలయన్స్ సాధించింది. జూలై 13 న రిలయన్స్ మార్కెట్ క్యాప్ 12 లక్షల కోట్ల రూపాయలను దాటిన మొదటి భారతీయ సంస్థగా అవతరించిన సంగతి తెలిసిందే.
ప్రధానంగా రిలయన్స్ అమెజాన్ భారీ పెట్టుబడుల పెట్టనుందన్న అంచనాలతో ఇన‍్వెస్టర్ల ఆసక్తి నెల కొంది. దీంతో తాజా కొనుగోళ్లతో రిలయన్స్ 2149 రూపాయల వద్ద మరో ఆల్‌టైం గరిష్టాన్నితాకింది.దీంతో దేశంలో అత్యంత విలువైన టాప్ కంపెనీగా ఆర్‌ఐఎల్ నిలిచింది. 8,07,419.38 కోట్లతో టీసీఎస్ రెండవ స్థానంలో , 6,11,095.46 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్‌తో హెచ్‌డీఎఫ్‌సీ మూడవ స్థానంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment