భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. కంపెనీలు తమ ఉత్పత్తులను ఎక్కువ సంఖ్యలో విక్రయించడానికి మంచి ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ అందిస్తాయి. ఈ సమయం కోసం ఎదురు చూసే చాలామంది కస్టమర్లు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఎగబడుతుంటారు. మహీంద్రా, సిట్రోయెన్, స్కోడా కంపెనీలు ఇప్పటికే ఆఫర్స్ ప్రకటించేసాయి. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలోకి మరి కొన్ని సంస్థలు చేరాయి.
ఈ ఫెస్టివల్ సీజన్‌లో హ్యుందాయ్, మారుతి సుజుకి, హోండా వంటి కార్ డీలర్లు తమ లైనప్‌లో కొన్ని ఎంపిక చేసిన కార్ల మీద ఆకర్షణీయమైన తగ్గింపులు, ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్‌లు ఉన్నాయి.
ఇదీ చదవండి: పండుగ సీజన్‌లో గొప్ప ఆఫర్స్ - కార్లు కొనటానికి ఇదే మంచి సమయం
ఏ కారుపై ఎంత వరకు బెనిఫిట్
- హ్యుందాయ్ వెర్నా - రూ. 30,000
- మారుతి సుజుకి డిజైర్ - రూ. 40,000
- హోండా అమేజ్ - రూ. 70,000
- స్కోడా స్లావియా - రూ. 75,000
- ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ - రూ. 80,000
- హోండా సిటీ - రూ. రూ. 90,000
Note: పండుగ సీజన్‌లో వాహన తయారీ సంస్థలు అందిస్తున్న డిస్కౌంట్‌లు ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవడానికి తప్పకుండా సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్‌ను సంప్రదించి తెలుసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment