న్యూఢిల్లీ: పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు, నిత్యావసరాల ధరలు ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుత పండుగ సీజన్‌లో చాలా మటుకు కుటుంబాలు (సుమారు 60 శాతం) ఖర్చులు చేస్తున్నప్పటికీ.. కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. తమ బడ్జెట్ దాటిపోకుండా, పెట్టే ఖర్చుకు కాస్తంత ఎక్కువ విలువ దక్కేలా చూసుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి.
ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ టాప్ 10 నగరాల్లో నిర్వహించిన ‘వినియోగదారుల ధోరణులు‘ అనే సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో సుమారు 61,000 కుటుంబాలు పాల్గొన్నాయి. సర్వే ప్రకారం వినియోగదారుల సెంటిమెంట్ గణనీయంగా మెరుగుపడింది. పండుగ సీజన్‌లో ఖర్చు చేయాలని భావిస్తున్న కుటుంబాల సంఖ్య సెప్టెంబర్‌లో 60 శాతానికి చేరింది. ఈ ఏడాది మే లో ఇది 30 శాతం. గడిచిన నాలుగు నెలల్లో కోవిడ్–19 కేసులు గణనీయంగా తగ్గడం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం తదితర అంశాలు ఇందుకు కారణం.
గడిచిన 30 రోజులుగా టాప్ 10 నగరాల్లోని కుటుంబాలు.. పెరిగిపోతున్న ఇంధనాలు, నిత్యావసరాల ధరల గురించి ఆందోళన, ఈ పండుగ సీజన్‌లో షాపింగ్ చేసేటప్పుడు బడ్జెట్‌కు ప్రాధాన్యం ఇవ్వనుండటం గురించి వివిధ ఆన్‌లైన్ కమ్యూనిటీల్లో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నట్లు లోకల్‌సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపాడియా తెలిపారు. టాప్ 10 నగరాల్లోని ఏడు నగరాల ప్రజలు.. షాపింగ్ చేసేటప్పుడు బడ్జెట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామంటూ వెల్లడించినట్లు వివరించారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు.
ఆన్‌లైన్‌కు హైదరాబాదీల మొగ్గు..
టాప్ 8 నగరాల్లోని వారు తమ పండుగ షాపింగ్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో ఆర్డర్లివ్వడం లేదా లోకల్‌గా హోమ్ డెలివరీ పొందడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ముంబై, కోల్‌కతా నగరాల్లో చాలా కుటుంబాలు ప్రత్యేకంగా స్టోర్స్, మార్కెట్‌కు వెళ్లడానికే మొగ్గు చూపుతున్నాయి. కానీ హైదరాబాద్ (75 శాతం), నోయిడా (72 శాతం), పుణె (67 శాతం), చెన్నై (60 శాతం) నగరాల్లో అత్యధిక శాతం మంది స్టోర్ట్స్, హైదరాబాద్, నోయిడాకు చెందిన కుటుంబాలు .. ప్రధానంగా స్మార్ట్‌ఫోన్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లపై ఆసక్తిగా ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న హైదరాబాదీ కుటుంబాలన్నీ కూడా డ్రై ఫ్రూట్స్, సాంప్రదాయ స్వీట్లు, చాక్లెట్లు, బేకరీ ఉత్పత్తులు, దుస్తులు మొదలైనవి కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment