సాక్షి, ముంబై: ఫ్యాషన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ మింత్రా గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పండుగ సీజన్‌లో దాదాపు 16వేలమందికి ఉపాధికల్పించనుంది. డెలివరీ, వేర్‌హౌస్ హ్యాండ్లింగ్, లాజిస్టిక్స్‌లో వివిధ స్థానాల కోసం 16,000 ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. గత ఏడాది ఇదే కాలంలో సంస్థ దాదాపు 11,000 మందికి ఉపాధి అవకాశాలను కల్పించింది.
ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యంలోని ఈ కంపెనీ మింత్రా ప్రకటించిన ఈ 16 వేలు ఉద్యోగాలలో 10 వేల ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కాగా, 6 వేలు పరోక్షంగా ఉంటాయి. పండుగ సీజన్‌లో నియామకాల్లో ఇప్పటివరకు ఇదే అత్యధికమని మింత్రా హెచ్‌ఆర్ హెడ్ నూపూర్ నాగ్‌పాల్ తెలిపారని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. ఈ సంవత్సరం నియామకాలు సార్టింగ్, ప్యాకింగ్, పికింగ్, లోడింగ్, అన్‌లోడింగ్, డెలివరీ, రిటర్న్ ఇన్‌స్పెక్షన్ అలాగే కార్గో ఫ్లీట్ మేనేజ్‌మెంట్ ఇలా పలు విభాగాల్లో ఉంటాయి.
తాజా నివేదిక ప్రకారం ప్రస్తుత కొత్త బ్యాచ్‌లోని సప్లై చైన్ మేనేజ్‌మెంట్ సిబ్బందిలో దాదాపు సగం మందికి ఉద్యోగాల్లో కొనసాగనుండగా, కాంటాక్ట్ సెంటర్ సిబ్బంది వారి ఒప్పందం మేరకు పనిచేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment