వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్ మేజర్ ఫ్లిప్‌కార్ట్ రాబోయే పండుగ సీజన్‌లో నిరుద్యోగులకు భారీ ఉపశమనం కలిగించనుంది. రానున్న ఫెస్టివ్ సీజన్‌లో కస్టమర్ డిమాండ్‌ను తీర్చే లక్ష్యంతో తన సప్లయ్ చెయిన్‌లో లక్షకు పైగా సీజనల్ ఉద్యోగాలను సృష్టించనుంది. ఈ మేరకు కంపెనీ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. కిరాణా డెలివరీ ప్రోగ్రామ్ ద్వారా పండుగ ఈవెంట్‌లో 40శాతం కంటే ఎక్కువ షిప్‌మెంట్‌లను డెలివరీ చేయడానికి ప్లాన్ చేస్తోందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అలాగే పండుగల సీజన్‌లో వేలాది మందికి నైపుణ్యం , శిక్షణ అవకాశాలు కల్పించినట్టు చెప్పింది.
ప్రధానంగా ఈ ఉద్యోగాలు తమ సప్లై చెయిన్‌లో ఉంటాయని కంపెనీ పేర్కొంది, ఇందులో ఫుల్‌ఫెల్‌మెంట్ సెంటర్‌లు, సార్టేషన్ సెంటర్‌లు, డెలివరీ హబ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా, లాజిస్టిక్స్‌కు సహాయం చేయడానికి డెలివరీ భాగస్వాముల జాబ్స్ కూడా ఉంటాయి. సరఫరా గొలుసులో లక్షకు పైగా కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తున్నమని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ రీకామర్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , సప్లై చెయిన్ హెడ్ హేమంత్ బద్రీ తెలిపారు. ఇందులో భాగంగా హ్యాండ్‌హెల్డ్ పరికరాలు, PoS మెషీన్‌లు, స్కానర్‌లు, వివిధ మొబైల్ యాప్స్ నిర్వహరణలో తమ సిబ్బంది శిక్షణ పొందారని కంపెనీ పేర్కొంది. (కొంపముంచుతున్న క్రెడిట్ కార్డు బకాయిలు: డిఫాల్ట్ అయితే ఏం చేయాలో తెలుసా?)
ఉద్యోగాల కల్పనతో పాటు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో అంతటా 19 లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలాన్ని జోడించాలని యోచిస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా తమ గుర్తింపును మరింత బలోపేతం చేయడం ద్వారా ఉన్నతమైన కస్టమర్ అనుభవాన్ని అందించడానికి నైపుణ్యం కలిగిన కార్యక్రమాలలో పెట్టుబడి పెట్టామని చెప్పారు. డిస్ట్రిబ్యూషన్ హబ్‌లు, పెద్ద-స్థాయి నెరవేర్పు కేంద్రాలు, టైర్-III నగరాలు, బయట కూడా మరింత బలపడనున్నామనే సంకేతాలందించారు. (జీతాల పెంపు: దిగ్గజ ఐటీ కంపెనీల ఉద్యోగులకు షాక్!)
Comments
Please login to add a commentAdd a comment