దసరా దీపావళి పండగలు మన దగ్గర ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కొందరు సొంతూళ్లకు వెళితే మరికొందరు బంధువుల ఇళ్లకు వెళ్తారు. ఇక సంపన్నులైతే విదేశీ టూర్లకు వెళ్తుంటారు. అయితే ఈసారి ఇలా విదేశాలకు వెళ్తున్న వారితో ఛార్టర్ ఫ్లైట్స్‌కి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.
కోవిడ్ ఆంక్షలు
దేశీయంగా చాలా ప్రాంతాల్లో టూరిస్టులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్, ఉత్తర్‌ఖండ్, కశ్మీర్, లదాఖ్ ఇలా టూరిస్టులు ఎక్కువగా వచ్చే రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. దీంతో ఎటువంటి ఆంక్షలు లేని యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు, మాల్దీవ్స్, థాయ్‌లాండ్, రష్యా వంటి దేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఛార్టర్ ఫ్లైట్స్
విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్న సంపన్న వర్గాలు సాధారణ ప్లైట్స్ కంటే ఛార్టర్ ఫ్లైట్స్ బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆరు నుంచి ఎనిమిది సీట్ల సామర్థ్యం కలిగిన ప్రైవేట్ ఫ్లైట్స్ ఎక్కువగా బుక్ అవుతున్నాయని ప్రైవేట్ జెట్ ఆపరేటర్స్ అంటున్నారు. కోవిడ్ జాగ్రత్తల్లో భాగంగా రెగ్యులర్ ఫ్లైట్స్ కంటే ఛార్టర్ ఫ్లైట్స్ బుక్ చేసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు.
ఫుల్ డిమాండ్
విదేశీ టూర్లకు సంబంధించి ఛార్టర్ ఫ్లైట్స్‌కి గిరాకీ పెరిగింది. ఇప్పటికే అక్టోబరు నుంచి డిసెంబర్ వరకు వీకెండ్‌లకు సంబంధించి ఛార్టర్ ఫ్లైట్స్ అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. దసరా , దీపావళి పండగ సెలవు రోజుల్లో రెట్టింపు ధర చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇండియాకు వస్తున్నారు
ఇక వ్యాపారం, ఉద్యోగ పనుల నిమిత్తం దుబాయ్‌లో ఉండిపోయిన భారతీయుల్లో ఎక్కువ మంది పండగని తమ కుటుంబ సభ్యుల మధ్య చేసుకోవాలనే సెంటిమెంట్‌ని ఎక్కువగా పాటిస్తున్నారు. గతేడాది కరోనా కారణంగా పండగ జరుపుకోలేకపోయిన వారు ఈ సారి ఇండియా వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వీరు సైతం ప్రైవేటు ఫ్లైట్స్ బుక్ చేసుకుంటున్నారు. ప్రైవేట్ జెట్ ఫ్లైట్లకు జరుగుతున్న బుకింగ్స్‌లో 35 శాతం వరకు విదేశాల నుంచి ఇండియాకి వచ్చే వారికే ఉంటున్నాయని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు.
చదవండి : ‘జీ’ కప్పులో చల్లారని తుఫాను.. కొత్త చిక్కుల్లో సోని
Comments
Please login to add a commentAdd a comment