Chartered Flight
-
విమానమెక్కి.. శ్రీరాముణ్ణి మొక్కి!
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంబోత్సవానికి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా రామ భక్తులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఆహ్వానాలు వెళ్లాయి. దీంతో అయోధ్యకు వెళ్లే హెలికాప్టర్, చార్టర్డ్ విమానాలకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ఈనెల 22న అయోధ్య విమానాశ్రయంలో 100 చార్టర్డ్ విమానాలు దిగుతాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తెలిపారు. లక్షమందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా. ఇప్పటికే క్యాబ్‌లు, రైళ్లు ఫుల్ ఇప్పటికే జనవరి 22 నాటికి రైల్వే టికెట్ బుకింగ్‌లు 60 శాతం మేర పెరిగాయి. అలాగే అయోధ్యలో క్యాబ్ ఆపరేటర్ల బుకింగ్‌లు 50 శాతం పెరుగుతాయని ట్రావెల్ పోర్టళ్ల అంచనా. ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా విమానయాన సంస్థలు డిసెంబర్ 30 నుంచి దేశంలోని ప్రధాన మెట్రో నగరాల నుంచి అయోధ్యకు సాధారణ విమాన సేవలను ప్రారంభించాయి. ప్రస్తుతం అయోధ్యకు రోజుకు నాలుగు విమాన సర్విస్లు నడుస్తున్నాయని, రాబోయే రోజుల్లో ఇది 20–24కు పెరుగుతుందని అయోధ్య విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే చార్టర్డ్ ఫ్లయిట్ ఆపరేటర్ల నుంచి 42 ఎంక్వయిరీలు వచ్చినట్లు చెప్పాయి. అయోధ్య విమానాశ్రయంలో విమానాల కోసం తగినంత పార్కింగ్ స్థలం లేకపోవడంతో ఈనెల 22న ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థలు ప్రయాణికులను పికప్, డ్రాప్ మాత్రమే చేయాలని, విమానాలను లక్నో, వారణాసి, ఖుషీనగర్, పాటా్న, ఢిల్లీ వంటి పొరుగు విమానాశ్రయాల్లో పార్కింగ్ చేయాలని సూచించారు. మెట్రో నగరాల నుంచి డిమాండ్ మిలియన్ ఎయిర్, క్లబ్ వన్ ఎయిర్, ఎంఏబీ ఏవియేషన్, జెట్‌సెట్‌గో వంటి ప్రైవేట్ చార్టర్డ్ విమాన సంస్థలు అయోధ్యకు విమాన సేవలను అందిస్తున్నాయి. ఈ ఏడాది చార్టర్డ్ ఫ్లయిట్లు, హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగిందని ఎయిర్ చార్టర్డ్ సంస్థ క్లబ్ వన్ ఎయిర్ సీఈఓ రాజన్ మెహ్రా తెలిపారు. తెలంగాణ, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు, అహ్మదాబాద్‌లో వైబ్రంట్ గుజరాత్ ఇన్వెస్టర్ సమిట్‌లతో ప్రైవేట్ చార్టర్డ్ ఆపరేటర్లకు గిరాకీ పెరిగిందని తెలిపారు. తాజాగా రామమందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యకమంతో చార్టర్డ్ ఫ్లయిట్ల కోసం ఎంక్వయిరీలు వస్తున్నాయన్నారు. ఇప్పటికే 12 సీట్ల జెట్ ఫాల్కన్ 2000 బుక్ అయిందని చెప్పారు. ఆలయ ప్రారంభోత్సవం రోజున చార్టర్డ్ విమానాల కోసం 25 ఎంక్వయిరీలు వచ్చాయని మరో ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ ప్రతినిధి తెలిపారు. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, పుణే, నాగ్‌పూర్ వంటి మెట్రో నగరాల నుంచి అభ్యర్థనలు వచ్చాయని చెప్పారు. సీటింగ్‌ను బట్టి చార్జీలు విమానం సైజు, సీటింగ్ సామర్థ్యాన్ని బట్టి ఈ మార్గంలో ధర రూ.10–20 లక్షలు ఉంటుందని ప్రైవేట్ ఎయిర్‌క్రాప్ట్ కంపెనీలు తెలిపాయి. అయితే చలికాలం నేపథ్యంలో పొగమంచు, తక్కువ విజిబిలిటీ కారణంగా అయోధ్యకు విమాన సర్విసులు సవాలేనని, దీంతో అయోధ్యకు ప్రైవేట్ చార్టర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల అనుమతులపై విమానాశ్రయ వర్గాల నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉందని తెలిపాయి. ప్రస్తుతం అయోధ్య విమానాశ్రయం రోజుకు 6 గంటలు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈనెల 22న ఆలయ ప్రారంబోత్సవం రోజున మాత్రం 24 గంటలు తెరిచి ఉండేలా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాట్లు చేస్తోంది. -
ఎన్నికల సందడి.. స్టార్ క్యాంపెయినర్లతో విమానాలకు డిమాండ్
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సందడి మొదలైంది. ప్రధాన పార్టీలు ప్రచారానికి సన్నద్ధమవుతున్నాయి. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు, వందల సంఖ్యలో ప్రచార సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలకు డిమాండ్ ‘టేకాఫ్’ తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చే జాతీయ పార్టీ నేతలు, స్టార్ క్యాంపెయినర్లు వీటిని అద్దెకు తీసుకునేందుకు సై అంటున్నారు. ఒత్తిడి లేకుండా, వేగవంతంగా, సౌకర్యవంతంగా ప్రయాణం చేసే వీలుతో పాటు సమయం ఆదా అవుతుండటంతో అద్దె హెలికాప్టర్లకు ఎన్నికల వేళ గిరాకీ జోరందుకుంటుంది. గంటల వ్యవధిలోనే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లి పలు ప్రచారాల్లో పాల్గొనే అవకాశం ఉండటం కూడా నేతలను గాల్లో చక్కర్లు కొట్టేలా చేస్తోంది. – సాక్షి, హైదరాబాద్ అద్దె లక్షల్లోనే... బ్లేడ్ ఇండియా, అర్బన్ ఎయిర్ మొబిలిటీ, ఇండియన్ ఫ్లై సర్విసెస్, జెట్‌సెట్‌గో వంటి కంపెనీలు హెలికాప్టర్లు, జెట్ విమానాలను అద్దెకు ఇస్తున్నాయి. ప్రైవేట్ ఏజెన్సీలతో పాటు సువిధ యాప్ ద్వారా కూడా హెలికాప్టర్లతో సహా వాహనాలను అద్దెకు తీసుకునేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా బెల్ 407, ఎయిర్‌బస్ హెచ్125, హెచ్130 వంటి హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటారు. ఇందులో అయిదుగురు ప్రయాణించవచ్చు. సాధారణంగా సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ అద్దె గంటకు రూ.1.5 లక్షల నుంచి ఉంటుంది. రెండు ఇంజిన్ల సామర్థ్యం ఉంటే రూ.2.75 లక్షల వరకు అవుతుంది. జాతీయ పార్టీల నుంచి డిమాండ్.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులు, స్టార్ క్యాంపెనర్లతో తెలంగాణలో ప్రచారం చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో అద్దె హెలికాప్టర్లు, చార్టర్డ్ ఫ్లయిట్లకు డిమాండ్ మరింత పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పోటీలో ఉన్న రాజకీయ పార్టీలు, వ్యక్తిగత రాజకీయ నాయకుల నుంచి హెలిక్టాపర్ల అద్దెకు అభ్యర్థనలు వస్తున్నాయని ఓ సంస్థ ప్రతినిధిని తెలిపారు. ఆయా పార్టీల నాయకులు కర్ణాటక, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో తమ హెలికాప్టర్లను అద్దెకు తీసుకొని ప్రచారం సాగించారని తెలిపారు. తెలంగాణలోనూ ఇరు పార్టీలు ప్రధానంగా పోటీలో ఉండటం వల్ల ఇక్కడ కూడా ఫుల్ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. డీజీసీఏ మార్గదర్శకాలు తప్పనిసరి.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్దేశించిన నిబంధనలను ఆపరేటర్లు తూ.చ. తప్పకుండా పాటించాల్సిందే. పైగా ఎన్నికల సమయంలో ప్రత్యేక మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. మంత్రులు, సీనియర్ రాజకీయ నేతలు రెండు ఇంజిన్లు ఉన్న హెలికాప్టర్ లేదా విమానంలో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. వీఐపీ విమానాలను నడిపే పైలట్లు ని ర్మిష్ట రకం విమానం లేదా హెలికాప్టర్లో నిర్దిష్ట సంఖ్యలో ఫ్లయింగ్ గంటల అనుభవాన్ని కలిగి ఉండాలి. అద్దె ఖర్చు ఎవరి ఖాతాలో.. హెలికాప్టర్ అద్దెలపై కూడా ఎన్నికల కమిషన్ నిఘా ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి, స్థానిక డిప్యూటీ కమిషనర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక స్టార్ క్యాంపెయినర్ హెలికాప్టర్‌ను ఉపయోగిస్తే అభ్యర్థి పేరు తీసుకోకుండా లేదా అభ్య ర్థితో వేదికను పంచుకోకుండా ప్రసంగాలు చేస్తే అప్పుడు ఆ ఖర్చు మొత్తం పార్టీపైనే పడుతుంది. ఒకవేళ అభ్యర్థి పేరుతో ప్రచారం చేస్తే గనుక అప్పుడు ఆ వ్యయం పార్టీ, అభ్య ర్థికి చెరి సగం పడుతుందని ఎన్నికల కమిషన్ చెబుతోంది. సొంతంగా హెలికాప్టర్లు ఉన్న వారి ప్రయాణ సమయం, అద్దెను అభ్యర్థుల ఖర్చుగా పరిగణిస్తారు. ప్రచార రథాలు సిద్ధం సాక్షి, హైదరాబాద్: ఎన్నికల షెడ్యూల్ విడుదలతో వివిధ పార్టీలకు ప్రచార వాహనాలను రూపొందించే సిబ్బందికి, వాహనాలకు, డ్రైవర్లకు ఒక్కసారిగా డిమాండ్ వచ్చింది. పార్టీల జెండాలు, బ్యానర్లను తయారు చేసే టైలర్లకు సైతం భారీ గిరాకీ వచ్చింది. ఉప్పల్, చర్లపల్లి తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రెడీమేడ్ దుస్తులను తయారు చేసే పలు కంపెనీల్లోని కుట్టుమిషన్లపైన ఇప్పుడు పార్టీల జెండాలు రెడీ అవుతున్నాయి. అంబర్పేట్ పటేల్‌నగర్, మూసారాంబాగ్ తదితర ప్రాంతాల్లోనూ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జెండాలను, బ్యానర్లను తయారు చేసే మహిళా టైలర్లకు డిమాండ్ వచ్చేసింది. తాత్కాలికంగా అయినా ఇప్పుడు ఇది ఓ కుటీర పరిశ్రమగా మారినట్లు పటేల్‌నగర్‌కు చెందిన బాలమణి తెలిపారు. రోజుకు 250 నుంచి 300 వరకు బ్యానర్లు, జెండాలు, ఇతర ప్రచార సామగ్రిని తయారు చేస్తున్నామని చెప్పారు. ప్రచార రథాలకు మేకప్.... నేతలు ప్రచార వాహనాలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రచార వాహనాల కోసం వినియోగించే టాటా, మహీంద్ర వాహనాలకు డిమాండ్ వచ్చేసింది. అభ్యర్థుల కటౌట్లు, బ్యానర్లు తదిర హంగులతో ప్రచార రథాలుగా తీర్చిదిద్దేందుకు కా ర్మికులు, టెక్నీషియన్లు రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. మూసారాంబాగ్, ఇందిరాపార్కు, తదితర ప్రాంతాల్లో ప్రచార ర«థాల తయారీ పనులు జోరుగా సాగుతున్నాయి. -
ఇంగ్లండ్ టూ వెస్టిండీస్.. బీసీసీఐ ఎంత ఖర్చు పెట్టింది అంటే..?
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం భారత జట్టు నేరుగా కరీబియన్ దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో అఖరి వన్డే ముగిశాక 16 మంది ఆటగాళ్లతో కూడిన భారత బృందం ప్రత్యేక విమానంలో మాంచెస్టర్ నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్(ట్రినిడాడ్) చేరుకుంది. అయితే ఇంగ్లండ్ నుంచి విండీస్‌కు భారత ఆటగాళ్లు వెళ్లడానికి బీసీసీఐ భారీగా ఖర్చు చేసింది. భారత ఆటగాళ్లు వెళ్లిన చార్టర్డ్ ఫ్లైట్‌కు బీసీసీఐ ఏకంగా 3.5 కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టింది. కాగా చార్టర్డ్ ఫ్లైట్‌ను బుక్ చేయడానికి గల కారణాన్ని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఆటగాళ్లతో పాటు వారి భార్యలు, సహాయక సిబ్బందితో కలిపి ఎక్కువ సంఖ్య ఉండడం వల్లే చార్టర్డ్ ఫ్లైట్ బక్ చేయాల్సి వచ్చింది అని అతడు తెలిపాడు. "మాంచెస్టర్ నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్(ట్రినిడాడ్ అండ్ టొబాగో)కు భారత ఆటగాళ్లను తీసుకెళ్లిన చార్టర్డ్ ఫ్లైట్ కోసం బీసీసీఐ రూ. 3.5 కోట్లు ఖర్చు చేసింది. భారత బృందంలో సభ్యల సంఖ్య ఎక్కవగా ఉండడంతో చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేశాం. సాధారణంగా కమర్షియల్ ఫ్లైట్‌లో ఈ ఖర్చు దాదాపు రూ. 2 కోట్లు మాత్రమే అయి ఉండేది. అయితే చార్టర్డ్ ఫ్లైట్ కోసం అదనంగా మరో 1.5 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది" అని అతడు పేర్కొన్నాడు. ఇక వెస్టిండీస్ టూర్లో భాగంగా టీమిండియా మూడు వన్డేలతో పాటు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. జూలై 22 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. చదవండి:India Vs West Indies 2022: విండీస్‌తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు, పూర్తి వివరాలు! -
ఆకాశమంత: రూ. 5600 పెట్టుబడితో.. 500 మిలియన్ల టర్నోవర్ స్థాయికి..
మనదేశంలోని విమానయాన సంస్థల్లో అత్యంత పెద్దదైన సంస్థ జెట్‌సెట్‌గో. దీనిని స్థాపించింది ఓ మహిళ. పేరు కనికా టేక్రీవాల్. పదేళ్ల కిందట స్థాపించిన ఆ సంస్థ ఇప్పుడు ఐదు వందల మిలియన్ల టర్నోవర్‌తో నడుస్తోంది. ఐదేళ్ల కిందట ఫోర్బ్స్ అండర్ థర్టీ విభాగంలో ఆసియాలో ప్రముఖ ఎంటర్ప్రెన్యూర్ కనికా టేక్రీవాల్. కనికా టేక్రీవాల్ది భోపాల్‌కు చెందిన మార్వారీ వ్యాపార కుటుంబం. ఈ కుటుంబానికి దేశవ్యాప్తంగా మారుతీ డీలర్షిప్ ఉంది. కనిక తండ్రి అనిల్ టేక్రీవాల్ ఉమ్మడి కుటుంబం భాగాలు పంచుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. తల్లి సునీత గృహిణి. కనిక ఆమె తమ్ముడు కనిష్క్... ఇదీ వాళ్ల చిన్న కుటుంబం. మంచి చదువు కోసం అనే కారణం గా సొంతూరికి 17 వందల కిలోమీటర్ల దూరాన ఉన్న ఊటీకి వచ్చి పడిందామె బాల్యం. పదవ తరగతి తర్వాత తిరిగి భోపాల్‌కి వెళ్లి పన్నెండు వరకు అక్కడే చదివింది. ఆ తర్వాత ముంబయిలోని బీడీ సోమాని ఇన్స్టిట్యూట్లో విజువల్ కమ్యూనికేషన్ అండ్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. ‘ముంబయి తనకు జీవించడం నేర్పించింది’ అంటోంది కనిక కాలేజ్ రోజులను తలుచుకుంటూ. కారు నుంచి బస్సుకు ‘‘గ్రాడ్యుయేషన్‌కి ముంబయిలో హాస్టల్లో ఉన్నప్పుడు మా నాన్న నాకు పాకెట్ మనీ చాలా తక్కువగా కచ్చితంగా లెక్కపెట్టినట్లు ఇచ్చేవారు. చేతిలో డబ్బు ఎక్కువ ఉంటే వ్యసనాలకు అలవాటు పడతానని నాన్న భయం. ఈ నేపథ్యంలో ముంబయి నగరం నాకు జీవించడం నేర్పించింది. అప్పటివరకు నేను చూసిన జీవితంలో నేను బయటకు వెళ్లడానికి ఇంట్లో నుంచి కాలు బయటపెడితే ఏ కారు అడుగుతానోనని మా డ్రైవర్లు నా చుట్టూ మూగేవాళ్లు. హాస్టల్లో ఉన్నప్పుడు ఖర్చులు తగ్గించుకోవడానికి సిటీబస్‌లో ప్రయాణించడం మొదలుపెట్టాను. నాన్న నెలకు ఒక సినిమాకు డబ్బిస్తే మేము నాలుగు సినిమాలు చూడాలి కదా మరి. అందుకే ఆ పొదుపు. కొన్నాళ్లకు అది కూడా కాదని నెలకు మూడు వందల రూపాయలకు పార్ట్‌టైమ్ వర్క్ మొదలుపెట్టాను. జీవితంలో అత్యంత సంతోషం అప్పుడు కలిగింది. సొంత సంపాదన ఇచ్చే కిక్కు అంతా ఇంతా కాదు. ఆ డబ్బును ఖర్చు చేయబుద్ధి కాలేదు. అందుకే మా అమ్మకిచ్చాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి యూకేకి వెళ్లాను. ఎంబీఏ చేస్తూ ఏరోస్పేస్ రీసోర్సెస్లో ఉద్యోగం చేశాను. క్యాన్సర్ పరీక్ష పీజీతోపాటు చదువులో పరీక్షలన్నీ పూర్తయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్లు ఎందుకో తెలియదు కానీ అమ్మానాన్నల దగ్గర ఉందామనిపించింది. నా ఎదురుగా మరో పరీక్ష ఉందని ఇండియాకి వచ్చిన తర్వాత తెలిసింది. అప్పటికే నన్ను క్యాన్సర్ పీడిస్తోంది. ట్రీట్మెంట్ సమయమంతా మోటివేషనల్ బుక్స్ చదవడానికే కేటాయించాను. లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ జీవితం నాకు స్ఫూర్తినిచ్చింది. ఒక సైక్లిస్ట్ క్యాన్సర్‌తో పోరాడి తిరిగి ట్రాక్‌లో పోటీపడడం నాకు ధైర్యాన్నిచ్చింది. నన్ను నేను దృఢంగా మార్చుకోవడానికి బాగా ఉపయోగపడింది. పన్నెండు కీమో థెరపీలు, రేడియేషన్ల తర్వాత మామూలయ్యాను. అప్పటికి నా వయసు 23. ఆ తర్వాత ఏడాది అంటే 2012లో జెట్‌సెట్‌గో ప్రారంభించాను. ఆరోగ్యరీత్యా ఇంతపెద్ద వెంచర్‌ను తలకెత్తుకోవడానికి ఎవరూ ప్రోత్సహించలేదు. ‘ఏమీ చేయకుండా ఊరుకోవడం ఇష్టం లేకపోతే బేకరీ పెట్టి కప్‌కేక్స్ చేసుకోవచ్చు కదా’ అని నిరుత్సాహపరిచిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ మనమేం చేయాలనేది మనమే నిర్ణయించుకోవాలి. ఆ అవకాశం ఇతరులకు ఇవ్వకూడదు. సామాన్యులకూ సాధ్యమే! జెట్‌సెట్‌గోలో నా తొలి పెట్టుబడి 5,600 మాత్రమే. ఆ డబ్బుతో యాప్ తయారు చేసుకున్నాను. చార్టెడ్ ఫ్లయిట్స్‌ను బుక్ చేసుకోగలిగిన యాప్ అది. రెండేళ్ల పాటు క్లయింట్ల నుంచి అడ్వాన్స్ పేమెంట్ తీసుకోవడంతోపాటు వెండర్స్ నుంచి హైర్ చేసి వ్యాపారం నిర్వహించాను. అద్దె హెలికాప్టర్లతో మొదలైన వ్యాపారం 2020కి ఎనిమిది సొంత ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 200 మంది ఉద్యోగులు, 15 కోట్ల టర్నోవర్‌కు చేరింది. ఆ తర్వాత వేగంగా పుంజుకుంది. మా సర్వీస్ ద్వారా 2020–21 ఆరువేల ఫ్లైట్లతో లక్ష మంది ప్రయాణించారు. మా క్లయింట్లలో సాధారణంగా కార్పొరేట్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులే ఉంటారు. ఢిల్లీ – ముంబయి, ముంబయి – బెంగళూరు, హైదరాబాద్ – ఢిల్లీలకు ప్రయాణించేవాళ్లు ఎక్కువ. మా క్లయింట్ అవసరాన్ని బట్టి ఆరు సీట్ల చార్టర్ ఫ్లైట్ నుంచి 18 సీట్ల ఫ్లయిట్ వరకు అందించగలుగుతాం. మెడికల్ ఎమర్జెన్సీలు కూడా ఉంటాయి. మనదేశంలో ఉన్న ప్రైవేట్ చార్టర్ కంపెనీలలో మాది బెస్ట్ ప్రైవేట్ చార్టర్. ఈ స్థాయికి చేరిన తర్వాత ముంబయిలో ఓ ప్రయోగం చేశాం. హెలికాప్టర్లో ప్రయాణించాలనే సరదా చాలామందిలో ఉంటుంది. కానీ ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లడానికి అంత ఖర్చు చేసి చార్టర్ తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చు. హెలికాప్టర్లో విహరించాలనే సరదా బలంగా ఉంటుంది. అలాంటి వాళ్ల కోసమే ఈ షటిల్ సర్వీస్ ప్రయోగం. నగరంలో ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లి రావచ్చన్నమాట. అది కూడా ఊబెర్ సర్వీస్‌లో ముంబయిలో ఒక చోట నుంచి మరో చోటికి వెళ్లి వచ్చిన ఖర్చులోనే. దూరాన్ని బట్టి కనీసం వెయ్యి నుంచి గరిష్టంగా రెండున్నర వేల రూపాయలుగా నిర్ణయించాం. మాది ఎయిర్ ట్యాక్సీ సర్వీస్ అన్నమాట. భవిష్యత్తులో ఇది బాగా పాపులర్ అవుతుందని కచ్చితంగా చెప్పగలను’’ అంటోంది కనిక. ఆ హక్కు నాకు లేదు ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను గర్వంగా చెప్పుకోగలిగిన విషయం ఏమిటంటే... కోవిడ్ సమయంలో ఉద్యోగులను తగ్గించడం కానీ, జీతాల్లో కోత విధించడం కానీ చేయలేదు. నేను మా ఉద్యోగుల కు సంస్థ లాభాల్లో భాగస్వామ్యం ఎప్పుడూ ఇవ్వలేదు. కాబట్టి మా నష్టాలను వాళ్లను కొంత పంచుకోమని అడగడం అనైతికం. యజమానిగా నేను నష్టంలో ఉన్న కారణంగా ఉద్యోగుల జీతంలో కోత విధించే హక్కు నాకు ఉండదు. – కనికా టేక్రీవాల్, జెట్‌సెట్‌గో ఫౌండర్ -
మాపైకి మరో విమానం దూసుకొచ్చింది
కోల్‌కతా: మూడు రోజుల క్రితం చార్టర్డ్ విమానంలో ప్రయాణిస్తుండగా తనకు ఎదురైన భయానక అనుభవాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఎన్నికల ప్రచారం ముగించుకొని కోల్‌కతాకు తిరిగి వస్తుండగా తమ విమానానికి ఎదురుగా మరో విమానం దూసుకొచ్చిందని చెప్పారు. తమ పైలట్ తక్షణమే అప్రమత్తమై చాకచాక్యంగా విమానాన్ని కిందకు దించడంతో పెద్ద ముప్పు తప్పిందని అన్నారు. లేకపోతే మరో 10 సెకండ్ల వ్యవధిలోనే రెండు విమానాలు ఢీకొనేవని తెలిపారు. పైలట్ సమర్థత కారణంగానే తాను ప్రాణాలతో బయటపడ్డానని వెల్లడించారు. మమత ప్రయాణిస్తున్న విమానం భారీగా కుదుపులకు లోనైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. విమానం కుదుపుల వల్ల మమతా బెనర్జీ ఛాతీ, వీపు భాగంలో గాయాలైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)ను బెంగాల్ ప్రభుత్వం కోరింది. (చదవండి: బెంగాల్ అసెంబ్లీలో హైడ్రామా) -
సీఎం మమతా బెనర్జీ విమానానికి కుదుపులు
కోల్‌కతా: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం తీవ్ర కుదుపులకు లోనుకావడంపై నివేదిక ఇవ్వాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోరింది. సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వారణాసి వెళ్లిన సీఎం మమత శుక్రవారం సాయంత్రం చార్టర్డ్ విమానంలో తిరిగి వస్తున్నారు. ఒక్కసారిగా బలమైన ఈదురుగాలులు వీయడంతో ఆ విమానం తీవ్ర కుదుపులకు లోనయింది. దీంతో పైలట్ అప్రమత్తమై సుభా‹ష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అకస్మాత్తుగా విమానం పైకి, కిందికి ఊగిసలాడటంతో మమతా బెనర్జీ వెన్నెముకకు గాయమైంది. ఈ ఘటనను బెంగాల్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోవడానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని డీజీసీఏను కోరింది. ఈ మేరకు రిపోర్టు సిద్ధం చేస్తున్నట్లు డీజీసీఏ అధికారి ఒకరు వెల్లడించారు. సీఎం మమత భద్రతపై అధికార టీఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె ప్రయాణిస్తున్న విమానాలు గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాయని, దర్యాప్తు చేపట్టాలంది. -
రెక్కలు కట్టుకుని ఎగిరేద్దాం!
-
తెలుగోళ్లు.. విమానాల్లో తెగ తిరుగుతున్నారు..
తెలుగు వాళ్లు విమాన ప్రయాణాల్లో బిజీ అయ్యారు. కరోనా పాండెమిక్ తర్వాత ప్రయాణాలకు ఛార్టర్ ఫ్లైట్స్‌ని అధికంగా వినియోగిస్తున్నారు. దీంతో బేగంపేట ఎయిర్పోర్ట్ ఫుల్ బిజీ అయ్యింది. హైదరాబాద్‌లో ఛార్టర్ ఫ్లైయిట్స్కి పెరిగిన డిమాండ్ చూసి ఏవియేషన్ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. బేగంపేట కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో ఛార్టర్ ప్లైట్స్ బిజినెస్ ఊపందుకుంది. గంటకు రూ. 1.60 లక్షల నంచి రూ. 7 లక్షల వరకు ఖర్చయ్యే ఛార్టర్ ఫ్లయింగ్కి మన వాళ్లు సై అంటున్నారు. ఖర్చుకు వెనుకాడటం లేదు. సమయం. సెక్యూరిటీకే ప్రాధాన్యం ఇస్తున్నారను. దీంతో రోజుకు సగటున 8 బుకింగ్స్ జరుగుతున్నాయి. 30 శాతం ఇక్కడే కరోనా ముందుకు పరిస్థితితో పోల్చితే హైదరాబాద్‌లో ఛార్టర్ ఫ్లయిట్స్ బిజినెస్ ఏకంగా 200 శాతం పెరిగింది. ఇతర మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులలో కూడా ఇంత డిమాండ్ లేదు. దేశంలో ఛార్టర్ ఫ్లయిట్స్ బిజినెస్‌లో 30 శాతం హైదరాబాద్ కేంద్రంగానే జరుగుతున్నాయి. టాలీవుడ్ టూర్స్ హైదరాబాద్ నగరం కేంద్రంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, సినిమా తారాలు ఇటీవల ఛార్టర్ ఫ్లయిట్ సేవలను బాగా ఉపయోగించుకుంటున్నారు. నగరం మధ్యలో బేగంపేట ఉండటంతో ఇక్కడి నుంచి సులువుగా ప్రయాణం చేయడం వీలవుతోంది. దీనికి తోడు కరోనా తర్వాత నెలకొన్న సందేహాలు సైతం ఛార్టెడ్ డిమాండ్ పెరగడానికి కారణం. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఎక్కువగా ఛార్టర్ ఫ్లయిట్స్‌ని ఉపయోగిస్తున్నారు. ఫుల్ గిరాకీ ఛార్టెడ్ విమానాలకు డిమాండ్ పెరగడంతో బేగంపేట ఎయిర్‌పోర్టులో దాదాపు 14 మినీ విమానాలు నిలిచి ఉంటున్నాయి. ఇందులో 6 సీట్ల నుంచి 13 సీట్ల కెపాసిటీ ఉన్న విమానాలు ఉన్నాయి. కనీసం 8 బుకింగ్స్ అవుతుండడంతో అందరికీ గిరాకీ దొరకుతోంది. రెగ్యులర్‌గా ఈ ట్రెండ్ మరికొద్ది కాలం కొనసాగితే రెగ్యులర్ విమానాల తరహాలో నడిపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు ఏవియేషన్ అధికారులు. మరోవైపు నగరంలో హెలి ట్యాక్సీ సేవలు అందిస్తున్న హెలికాప్టర్ సంస్థలు సైతం ఛార్టర్ ఫ్లయిట్ బిజినెస్‌లోకి రావాలని చూస్తున్నాయి. -
ఉక్రెయిన్‌లోని భారత వైద్య విద్యార్థుల అగచాట్లు! కాలినడన పోలాండ్ సరిహద్దులకి పయనం
Indian Medical Students Walk 8 km To Poland Border: ఉక్రెయిన్ రష్య యుద్ధ బీభత్సం నుంచి తప్పించుకునేందుకు వైద్యా విద్యార్థులు ప్రాణాలను అరచేత పట్టుకుని కాలినడకన పోలాండ్ సరిహద్దుల వెంబడి పయనమయ్యారు. ఈ మేరకు సరిహద్దుకు సుమారు 8 కి.మీ దూరంలో తమ కళాశాల బస్సు నుంచి దిగిన 40 మంది వైద్యా విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి పోలాండ్ సరిహద్దుకు వెళ్లారని స్థానిక మీడియా తెలిపింది. పోలాండ్ సరిహద్దుకు సుమారు 70 కి.మీ దూరంలో ఉన్న ఎల్వివ్లోని ఒక వైద్య కళాశాల విద్యార్థులు ఉక్రెయిన్ విడిచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. రష్యా బలగాలు ఇప్పటికే రాజధాని కైవ్‌లోని అడుగు పెట్టేయడమే కాక అక్కడ ఉన్న ఉక్రెయిన్ డిఫెండర్లతో పోరాడుతున్నాయి. మరో రెండు గంటల్లో నగరం రష్యా అధినంలోకి వచ్చే అవకాశం ఉందని ఉక్రెయిన పశ్చిమ పరిశీలకులు చెబుతున్నారు. దీంతో భారత వైద్య విద్యార్థుల పోలాండ్-ఉక్రెయిన్ సరిహద్దు వరకు సుదీర్ఘ నడకను సాగించారు. అంతేకాదు కొంతమంది విద్యార్థుల తాము ఉక్రెయిన్‌ని విడిచి కాలినడకన ఒక సముహంగా వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టుల కూడా పెట్టారు. ఉక్రెయిన్‌లో దాదాపు 16 వేల మంది భారతీయులు ఉన్నారు, పైగా వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. రష్యా బాంబు దాడులు, క్షిపిణి దాడుల భయంతో భూగర్భ మెట్రో స్టేషన్లు, నేల మాళిగలు వంటి షెల్టర్ల నుంచి చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఎల్వివ్, చెర్నివ్ట్సీలలో క్యాంపు కార్యాలయాలను ప్రారంభించింది. పోలాండ్‌కు వెళ్లే భారతీయ విద్యార్థులకు సహాయం చేసేందుకు ఇండియన్ ఎంబసీ మరింత మంది రష్యన్ మాట్లాడే అధికారులను ఈ క్యాంపు కార్యాలయాలకు పంపింది. విద్యార్థుల బృందం ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దుకు కూడా బయలుదేరిందని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ పొరుగు దేశాలకు చేరుకోగలిగిన భారతీయుల కోసం ప్రభుత్వం విమానాలను పంపించడమే కాక ఈ ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాదు రెండు చార్టర్డ్ విమానాలు ఈరోజు బుకారెస్ట్‌కు బయలుదేరే అవకాశం ఉందని ఒక విమానం రేపు బుడాపెస్ట్‌కు బయలుదేరుతుందని వెల్లడించారు. హంగరీ, రొమేనియాలోని సరిహద్దు చెక్ పాయింట్లకు దగ్గరగా ఉన్నవారు ముందుగా బయలుదేరాలని సూచించారు. విద్యార్థి కాంట్రాక్టర్లతో టచ్‌లో ఉండాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ విద్యార్థులను కోరింది. (చదవండి: ఉక్రెయిన్ ఉక్కు మహిళ! మా గడ్డ పై ఏం పని మీకు ?) -
చార్టర్డ్ ప్లేన్స్‌కు అనుమతివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపాదించిన ఆరు కొత్త విమానాశ్రయాల ఏర్పాటు విషయంలో తీవ్ర జాప్యం నేపథ్యంలో తొలుత చార్టర్డ్ విమానాలను నడుపుకొనేందుకు వీలుగా అనుమతులు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా అధికారులు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు ప్రతిపాదించారు. వాస్తవానికి ఏడాదిన్నర కిందటే ఈ అంశంపై ఏఏఐతో అధికారులు చర్చించారు. ఈ లోపు కన్సల్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఏఏఐ వాణిజ్య విభాగం.. టెక్నో ఫీజిబులిటీ సర్వే నిర్వహించేందుకు సిద్ధం కావటంతో ఆ అంశం మరుగున పడింది. దాదాపు రెండు నెలల కింద ఆ నివేదిక వచ్చింది. దాని ప్రకారం విమానాశ్రయాల నిర్మాణానికి భారీగా ఖర్చు కానుందని స్పష్టం చేసింది. దీంతో వీలైనంత వరకు ఖర్చు తగ్గించేలా కొన్ని అడ్డంకులను దూరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో మళ్లీ సర్వే చేయాల్సి రావటంతో కొత్త విమానాశ్రయాల అంశం కొలిక్కి రాలేదు. దీంతో భవిష్యత్తులో వాటిని పెద్ద విమానాలు నడుపుకొనేందుకు వీలుగా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తూనే.. తొలుత చిన్నపాటి రన్వేలు నిర్మించి చార్టర్డ్ విమానాలను నడిపేందుకు అనుమతులు ఇవ్వాలని తాజాగా కోరింది. వరంగల్ ఒక్కటే అనుకూలం.. నిజాం హయాంలో నిర్వహించిన వరంగల్ శివారులోని మామునూరులో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌ను తిరిగి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా యత్నిస్తోంది. దీంతోపాటు జక్రాన్‌పల్లి (నిజామాబాద్), పాల్వంచ (భద్రాచలం–కొత్తగూడెం), బసంత్‌నగర్ (పెద్దపల్లి), ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లో కూడా కొత్త విమానాశ్రయాలు నిర్మించాలని ప్రతిపాదించింది. తాజాగా ఏఏఐ అందించిన టెక్నో ఫీజిబిలిటీ నివేదిక ప్రకారం రూ.2,300 కోట్లకుపైగా ఖర్చు కానుంది. దీన్ని వీలైనంత తగ్గించేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంశాలను ఏఏఐ ముందుంచింది. విమానాశ్రయాల ఏర్పాటుకు ఉన్న అడ్డంకుల్లో కొన్నింటిని వదిలేస్తే ఖర్చు తగ్గుతుందనేది రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం. అది సాధ్యమా కాదా అన్న విషయంలో ఏఏఐ తిరిగి నివేదిక అందించాల్సి ఉంది. ఆ తర్వాత తుది సర్వే చేయాలి. ఇదంతా జరిగేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున చార్టర్డ్ విమానాలను నడిపితే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇవి సమయ పట్టిక ఆధారంగా ప్రయాణికుల కోసం నడిపే విమానాలు కాదు. ముందస్తుగా బుక్ చేసుకుంటే సంస్థలు వాటిని ప్రైవేటు అవసరాల కోసం నడుపుతాయి. వీటిల్లో 19 సీట్ల వరకు ఉండే విమానాలకు మంచి డిమాండ్ ఉంది. కానీ ఈ ప్రైవేటు విమానాలకు మన వద్ద అంతగా వ్యాపారం ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ వేగంగా అభివృద్ధి చెందుతుండటం, అక్కడ పరిశ్రమలు భారీగా వస్తుండటం, సాఫ్ట్వేర్ రంగాన్ని కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండటంతో చార్టర్డ్ విమానాలకు కొంత డిమాండ్ మొదలవుతుందన్న అభిప్రాయంలో ఉంది. టేకాఫ్.. ల్యాండింగ్ ఒకవైపే.. సాధారణంగా రన్‌వేలకు టేకాఫ్, ల్యాండింగ్ వసతి రెండు వైపులా ఉండేలా ప్లాన్ చేస్తారు. మరోవైపు రెండు రన్‌వేలను నిర్మిస్తారు. రాష్ట్రంలో ప్రతిపాదిత ఆరు విమానాశ్రయాల ఖర్చు తగ్గించుకునే క్రమంలో తొలుత ల్యాండింగ్, టేకాఫ్ ఒకవైపే అయ్యేలా సాధారణ రన్‌వేతో ప్రారంభించాలని అధికారులు ఏఏఐకి ప్రతిపాదించారు. భవిష్యత్తులో వాటిని రెండు వైపులా విస్తరించటంతో పాటు రెండో రన్‌వేను కూడా నిర్మించుకోవచ్చని, తొలుత ఒకవైపే టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేలా రన్‌వేకు అనుమతించాలని కోరారు. -
పండగ సెలవులంటే ఫ్లైట్ కావాల్సిందేనంట!
దసరా దీపావళి పండగలు మన దగ్గర ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కొందరు సొంతూళ్లకు వెళితే మరికొందరు బంధువుల ఇళ్లకు వెళ్తారు. ఇక సంపన్నులైతే విదేశీ టూర్లకు వెళ్తుంటారు. అయితే ఈసారి ఇలా విదేశాలకు వెళ్తున్న వారితో ఛార్టర్ ఫ్లైట్స్‌కి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కోవిడ్ ఆంక్షలు దేశీయంగా చాలా ప్రాంతాల్లో టూరిస్టులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్, ఉత్తర్ఖండ్, కశ్మీర్, లదాఖ్ ఇలా టూరిస్టులు ఎక్కువగా వచ్చే రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. దీంతో ఎటువంటి ఆంక్షలు లేని యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు, మాల్దీవ్స్, థాయ్‌లాండ్, రష్యా వంటి దేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఛార్టర్ ఫ్లైట్స్ విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్న సంపన్న వర్గాలు సాధారణ ప్లైట్స్ కంటే ఛార్టర్ ఫ్లైట్స్ బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆరు నుంచి ఎనిమిది సీట్ల సామర్థ్యం కలిగిన ప్రైవేట్ ఫ్లైట్స్ ఎక్కువగా బుక్ అవుతున్నాయని ప్రైవేట్ జెట్ ఆపరేటర్స్ అంటున్నారు. కోవిడ్ జాగ్రత్తల్లో భాగంగా రెగ్యులర్ ఫ్లైట్స్ కంటే ఛార్టర్ ఫ్లైట్స్ బుక్ చేసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. ఫుల్ డిమాండ్ విదేశీ టూర్లకు సంబంధించి ఛార్టర్ ఫ్లైట్స్‌కి గిరాకీ పెరిగింది. ఇప్పటికే అక్టోబరు నుంచి డిసెంబర్ వరకు వీకెండ్లకు సంబంధించి ఛార్టర్ ఫ్లైట్స్ అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. దసరా , దీపావళి పండగ సెలవు రోజుల్లో రెట్టింపు ధర చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇండియాకు వస్తున్నారు ఇక వ్యాపారం, ఉద్యోగ పనుల నిమిత్తం దుబాయ్‌లో ఉండిపోయిన భారతీయుల్లో ఎక్కువ మంది పండగని తమ కుటుంబ సభ్యుల మధ్య చేసుకోవాలనే సెంటిమెంట్‌ని ఎక్కువగా పాటిస్తున్నారు. గతేడాది కరోనా కారణంగా పండగ జరుపుకోలేకపోయిన వారు ఈ సారి ఇండియా వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వీరు సైతం ప్రైవేటు ఫ్లైట్స్ బుక్ చేసుకుంటున్నారు. ప్రైవేట్ జెట్ ఫ్లైట్లకు జరుగుతున్న బుకింగ్స్‌లో 35 శాతం వరకు విదేశాల నుంచి ఇండియాకి వచ్చే వారికే ఉంటున్నాయని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. చదవండి : ‘జీ’ కప్పులో చల్లారని తుఫాను.. కొత్త చిక్కుల్లో సోని -
భారత ప్రయాణికులపై చైనా ఆంక్షల కొనసాగింపు
బీజింగ్: చైనాలో చదువుతున్న భారత విద్యార్థులను, పనిచేస్తున్న ఉద్యోగులను తిరిగి చైనాలోకి అనుమతించడంపై ఆ దేశం ఆంక్షలను కొనసాగిస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలకు చెందిన ఉద్యోగులను తిరిగి చైనాలోకి తీసుకొచ్చేందుకు ఆ దేశం తాజాగా చార్టర్డ్ విమానాలకు అనుమతులు జారీ చేసింది. అయితే భారత్ నుంచి 23 వేల మందికి పైగా విద్యార్థులు, వందల సంఖ్యలో ఉద్యోగులు వారి కుటుంబాలు చైనా వెళ్లడం కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ ప్రతినిధి ఝావో లిజియాన్ స్పందిస్తూ.. చైనా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ను పరిశీలిస్తూ, పరిస్థితులు అనుకూలంగా ఉన్న దేశాల నుంచి ఉద్యోగులను రప్పించుకుంటుందని ఆయన వెల్లడించారు. చదవండి: Afghan: అఫ్గన్ కేంద్రంగా దాడులు జరగనివ్వం -
కోహ్లి, సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్
దుబాయ్: ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ కరోనా కారణంగా అర్థంతరంగా రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌తో ఆధిక్యంలో ఉంది. ఇక ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీలకు వారం సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఇంగ్లండ్ టూర్లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు యూఏఈకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ కెప్టెన్ విరాట్ కోహ్లి, మహ్మద్ సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్‌ను లండన్‌కు పంపించనుంది. చార్టర్ ఫ్లైట్‌లో దుబాయ్‌కి చేరుకోనున్న ఈ ఇద్దరు ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. ఈ విషయాన్ని ఆర్సీబీ ఒక ప్రకటనలో తెలిపింది. కోహ్లి, సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్‌ను సిద్ధం చేశాం. శనివారం రాత్రి కోహ్లి, సిరాజ్‌లు చార్టర్ ఫ్లైట్ ఎక్కుతారు.. ఆదివారం ఉదయం దుబాయ్‌లో దిగిన వెంటనే నిబంధనల ప్రకారం ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. అంటూ ఆర్సీబీ పేర్కొంది. చదవండి: IND VS ENG 5th Test: ఒక్క టెస్ట్ మ్యాచ్ రద్దవడం వల్ల ఇంత భారీ నష్టమా..? ఇక ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్సీబీ మంచి ప్రదర్శన కనబరిచింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 5 విజయాలు, రెండు ఓటములతో 10 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ఆర్సీబీ ఫ్రాంచైజీ చరిత్రలో తొలిసారి కావడం విశేషం. ఈసారి టైటిల్ ఫెవరెట్లలో ఆర్సీబీ ఒకటని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చదవండి: SL Vs SA: ఓపెనర్‌గా వచ్చి నాటౌట్.. అయినా గెలిపించలేకపోయాడు -
కువైట్ ప్రయాణం చాలా ఖరీదు.. 15 వేల నుంచి 1.35 లక్షలు
సాక్షి, బాల్కొండ(నిజామాబాద్): కరోనా నేపథ్యంలో ఏడాదిన్నర తరువాత కువైట్ ప్రభుత్వం తమ దేశానికి విదేశీ విమానాల రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో వివిధ విమానయాన సంస్థలు టికెట్ ధరలను పెంచేశాయి. షెడ్యూల్ విమానాలను నడపాల్సిన సంస్థలు చార్టర్డ్ విమానాలలో ప్రయాణికులను చేరవేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. సాధారణ షెడ్యూల్ విమానాలు నడిపితే తమకు గిట్టుబాటు కాదని పలు విమానయాన సంస్థలు చార్టర్డ్ విమానాలను నడపడానికే మొగ్గుచూపుతున్నాయి. భారత్‌నుంచి కువైట్‌కు మామూలుగా షెడ్యూల్ విమాన టికెట్ ధర రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది. అయితే ప్రస్తుతం చార్టర్డ్ విమానాలకు వివిధ విమానయాన సంస్థలు టికెట్ ధరను రూ.1.35 లక్షల వరకు నిర్ణయించాయి. దీంతో మన దేశం నుంచి కువైట్‌కు వెళ్లాలనుకునే వలస కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 22 నుంచి మన దేశ విమానాల ల్యాండింగ్‌కు కువైట్ అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పటివరకు షెడ్యూల్ విమానాలు ప్రారంభం కాలేదు. చార్టర్డ్ విమానాల టికెట్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో కువైట్‌కు వెళ్లాలనుకుంటున్న వలస కారి్మకులను కొన్ని సంస్థలు అడ్డగోలుగా దోచుకుంటున్నాయనే అరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా కువైట్ నుంచి భారత్‌కు సెలవుపై వచ్చిన కారి్మకులకు ఇప్పుడు తిరిగి వెళ్లడానికి అవకాశం లభించింది. కానీ విమాన టికెట్ల ధరలు భారీగా పెరగడం వారికి భారంగా మారింది. ఇప్పటికైనా విమానయాన శాఖ జోక్యం చేసుకుని కువైట్ విమాన టికెట్ల ధరలు తగ్గించేలా చర్యలు చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు. చదవండి: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ -
ఆ సమయంలో నేనున్నానంటూ.. రవి పులి
సాక్షి, సిటీబ్యూరో: ఆ క్షణంలో ప్రతి ఒక్కరిలో భయం గూడుకట్టుకొంది. ఇప్పట్లో అమెరికా నుంచి హైదరాబాద్‌కు వెళ్లగలమా అనే ఆందోళన. అప్పటికే అమెరికా అంతటా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. అంతర్జాతీయ విమానాలు నిలిచిపోయాయి. ‘ఎట్లయినా సరే అమెరికా దాటి వెళ్లాలి’. చదువుకొనేందుకు, ఉద్యోగాలు చేసేందుకు వెళ్లిన ఎంతోమంది యువతీయువకులు.. అమెరికాలో స్థిరపడిన తమ కొడుకులు, కూతుళ్ల వద్దకు వెళ్లిన తల్లిదండ్రులు, పుట్టింట్లో పురుడు పోసుకోవాలని ఎదురు చూసే గర్భిణులు ...అందరి ఆలోచన ఒక్కటే. ఎలాగైనా సరే అమెరికా నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలి. కానీ ఎలా... అదిగో సరిగ్గా ఆ సమయంలో ‘నేనున్నానంటూ’ వచ్చారు రవి పులి. అమెరికాలో తనకున్న పరిచయాలను, పలుకుబడితో చార్టెడ్ ఫ్లైట్లను ఏర్పాటు చేశారు. టిక్కెట్లు కొనుగోలు చేయలేని నిరుద్యోగులకు అండగా నిలిచారు. అందరినీ హైదరాబాద్ విమానం ఎక్కించారు. 250 మందికి పైగా తెలుగు వారిని హైదరాబాద్‌కు తరలించడంలో ఎంతో కృషి చేశారు. (కరోనా కేసులు, ఫలితాలే కీలకం ) పల్లె పరిమళం పదిలం... నిజానికి పదమూడు మంది పిల్లలు ఉన్న ఒక ఇంట్లో వారిని పెంచి పోషించడమే ఆ తల్లిదండ్రులకు చాలా కష్టమైన పని.అలాంటి ఇంట్లో రవి 10వ సంతానం. అక్కచెల్లెళ్లు,అన్నదమ్ములు గంపెడు మందితో పాటు కలిసి పెరిగాడు. తండ్రి రాజయ్య. గీత కార్మికుడు. తల్లి బుచ్చమ్మ. ఆ వృత్తే వారి జీవనాధారం. ‘ ఒక్కోసారి పస్తులున్నాం.మమ్మల్ని పోషించడం కోసం నా తల్లిదండ్రులు పడిన కష్టాలు బాగా తెలుసు. ఇప్పుడు మా నాన్న లేరు. అమ్మ ఊళ్లోనే ఉంటుంది. తరచుగా ఊరికెళ్తాను. జీవితంలో నన్ను గెలిపించింది నా కాటాపురమే.అందుకే నాకు నా ఊరంటే ఎంతో ఇష్టం.’ అంటారు. అమ్మ ఫోన్‌తో... ‘అమ్మ భయాందోళనతో ఫోన్ చేసింది. ఊరుకు రమ్మని చెప్పింది. ఆ పిలుపులోని ఆవేదన నాకు తెలుసు. కానీ ఎంతోమంది విద్యార్థులు, ఉద్యోగార్థులు అమ్మా నాన్నలు పిలిచినా హైదరాబాద్‌కు వెళ్లలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాళ్లందరినీ పంపించకుండా నేను మాత్రమే ఎలా వెళ్లగలను’ అంటారు రవి పులి. కొంతకాలం క్రితం వరకు ఆయన ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగి. కానీ ఇప్పుడు అమెరికా రాజధాని వాషింగ్టన్లోనే ఒక ప్రముఖ ఔత్సాహిక పారిశ్రామికవేత్త. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అంతర్జాతీయ సదస్సులో ఇవాంకతో పాటు వచ్చిన పారిశ్రామికవేత్తల బృందంలో రవి పులి కూడా ఉన్నారు. కానీ ‘ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్నట్లు..’ ఆయన తన ‘స్థాయి’ని అమెరికాలో ఉన్న తెలుగువారికి మరింత చేరువ చేశారు. తెలంగాణ నుంచి విద్య,ఉద్యోగాల కోసం వెళ్లే యువతీ యువకులకు ‘రవన్న’ గొప్ప ధీమా. ఆయన వాషింగ్టన్లో ఏర్పాటు చేసిన ‘ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ గ్రూపు’ నిరుద్యోగులకు అండగా నిలుస్తుంది.‘హైదరాబాద్‌లో ఎంతో కష్టపడి చదువుకున్నాను. మారుమూల పల్లెటూళ్లో , ఒక సాధారణ కుటుంబంలో పుట్టిపెరిగిన నాకు ఆ కష్టాలు కొత్త కాదు. కానీ నాలాగా మరొకరు కష్టపడొద్దని భావిస్తాను. అందుకే అమెరికాకు వచ్చే హైదరాబాద్ వారికి, తెలంగాణ విద్యార్ధులకు ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ గ్రూపు ఉద్యోగావకాశాల్లో సహాయ సహకారాలు అందజేస్తుంది. అలాగే సాఫ్ట్వేర్ సంస్థలను ఏర్పాటు చేయాలనుకొనే ఔత్సాహికులకు ప్రోత్సాహాన్నిస్తుంది.’అని చెప్పారు. సాధారణ కుటుంబం నుంచి.. ‘ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు అమెరికా నాకు ఒక అవకాశం ఇచ్చి ఉండవచ్చు. కానీ నా అస్థిత్వం మాత్రం నేను పుట్టిపెరిగిన పల్లెలోనే ఉంది.అది ములుగు జిల్లాలోని కాటాపురం. హన్మకొండకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది’ అని చెప్పారు. నిజానికి 40 ఏళ్ల క్రితం అది కీకారణ్యమే.ఆ పల్లె ప్రజలకు ‘అమెరికా’ అనే ఆలోచనే ఊహకందనిది. కానీ రవి ఆ ఊహను నిజం చేశారు. అమెరికా కలను సాకారం చేసుకున్నారు. ఇప్పుడు తనతో పాటు అనేక మందికి ఉపాధి మార్గంగా నిలిచారు. ‘ఇప్పుడు రోడ్లు,రవాణా సదుపాయాలు. మెబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వచ్చాయి. కానీ ఆ రోజుల్లో అడవి దాటి తాడ్వాయికి చేరుకొని అక్కడ బస్సెక్కి హన్మకొండకు వెళ్లి చదువుకొనేవాన్ని. చదువుకోవడమే కష్టం.కానీ జీవితంలో పైకెదగాలంటే నా వంటి పేదవాడికి చదువు తప్ప మరో అవకాశం లేదు కదా....’ అని చెప్పారు. హన్మకొండలో చదువు పూర్తయిన తరువాత హైదరాబాద్‌కు చేరుకున్నారు. ‘అమెరికా కలల’కు ఊపిరిలూదారు.‘ అప్పటి వరకు మా కుటుంబంలో,బంధువుల్లో అమెరికా వెళ్లినవాళ్లు లేరు. కనీసం తెలిసిన వాళ్లు లేరు. ఎట్లయినా సరే అమెరికా వెళ్లాలనే పట్టుదల తప్ప మరో ఆస్తి లేదు. ’ అన్నారు. ఏదోఒకవిధంగా కష్టపడి 1997లో అమెరికా చేరుకున్నారు. అక్కడ మరో ఒంటరి పోరాటం తప్పలేదు. ఎట్టకేలకు ఒక సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం లభించింది.‘ రాత్రింబవళ్లు కష్టపడ్డాను.మెళకువలు నేర్చుకున్నాను. నైపుణ్యాన్ని పెంచుకొన్నాను. దశాబ్దానికి పైగా సాధించిన అనుభవం, అక్కడ ఏర్పడిన పరిచయాలు ‘ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ గ్రూపు ఏర్పాటుకు అవకాశం కల్పించాయి.’ అని గుర్తు చేసుకున్నారు. -
భారత్‌కు చేరుకున్న 480 విద్యార్థులు
ముంబై: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రష్యాలో చిక్కుకున్న 480 మంది భారతీయ వైద్య విద్యార్థులు సోమవారం ఓ ప్రైవేట్ చార్టర్డ్ విమానంలో ముంబై చేరుకున్నారు. వారిని భారత్‌కు తీసుకువచ్చేందుకు సాయం చేసిన మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శివసేనకు చెందిన ముంబై-సౌత్ ఎంపీ అర్వింద్ సావంత్ మీడియాతో మాట్లాడుతూ.. రష్యాలో ఉన్న భారత విద్యార్థులు మొదట తనను సంప్రదించారని, దీంతో వారికి మంత్రి ఆదిత్య ఠాక్రేకు ట్వీట్ చేయమని సలహా ఇచ్చానని చెప్పారు. ఇక ఆయన క్యాబినెట్ మంత్రిగా ఉన్నందున ప్రోటోకాల్ విభాగానికి బాధ్యత వహించి విద్యార్థులను భారత్‌కు రప్పించారని సావంత్ తెలిపారు. (చదవండి: మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు) మహరాష్ట్ర చేరుకున్న 480 విద్యార్థుల్లో 470 మంది మహరాష్ట్ర చేరుకున్నారని, దాద్రా, నగర్ హవేలీకి చెందిన వారు 4, మధ్యప్రదేశ్‌కు చెందిన వారు 4, గోవాకు చెందిన ఇద్దరూ ఉన్నారు. రష్యా నుంచి విద్యార్థులను తీసుకువచ్చేందుకు ప్రతి విద్యార్థికి 400 డాలర్లు (సుమారు రూ. 30,000) ప్రభుత్వం చెల్లించినట్లు నిక్స్టోర్ విమాన ఆన్లైన్ టికెటింగ్ కంపెనీకి చెందిన నికేష్ రంజన్ తెలిపారు. విద్యార్థులను తీసుకువచ్చేందుకు ఠాక్రే సహాయం చేశారని, ఇందుకు ఆయన విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ), రాష్ట్ర ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయాలను సంప్రదించారని రంజన్ పేర్కొన్నారు. (చదవండి: గుడ్‌న్యూస్: కరోనా డ్రగ్ ధర తగ్గింది) -
ముంబైలో జనావాసాల మధ్యలో కూలిన విమానం
-
ముంబైలో కూలిన విమానం
సాక్షి, ముంబై : ముంబై నగరంలో చిన్న విమానం కూలడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరికొద్ది సేపట్లో జుçహూ ఎయిర్‌పోర్టులో దిగాల్సిన విమానం ఘాట్కోపర్లోని ఓ నిర్మాణంలో ఉన్న భవనాన్ని ఢీకొని కూలిపోయింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, ఇద్దరు ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణ ఇంజనీర్లతో పాటు ఓ పాదచారి మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక శాఖ, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఉవ్వెత్తున లేస్తున్న మంటలను ఆర్పివేశారు. మృతదేహాలను, క్షతగాత్రులను ఘాట్కోపర్లోని రాజావాడి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన విమానం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందినదని, అయితే దాన్ని యూవై ఏవియేషన్ సంస్థకు విక్రయించారని ఓ అధికారి తెలిపారు. 12 సీట్లతో కూడిన కింగ్ ఎయిర్ సీ90 విమానం జుçహూ నుంచి టేకాఫ్ తీసుకుందన్నారు. మరోవైపు ఘటనపై విచారణ జరపాల్సిందిగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ను పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఆదేశించారు. జుహూలో విమానాలు రాకపోకలు సాగించేందుకు పవన్ హన్స్ విమానాశ్రయం ఉంది. మధ్యాహ్నం ట్రయల్ కోసం బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషా ల్లోనే çఘాట్కోపర్లో నిర్మాణంలో ఉన్న భవనాన్ని ఢీ కొని పడిపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న 40–50 మంది కూలీలు భోజనానికి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. లేని పక్షంలో భారీ ప్రాణ నష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
త్రిష, పెళ్లి విమానంలో జరుపుకోనున్నారట
నిర్మాత, పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్‌తో ప్రేమలో పడ్డ త్రిష, తమ పెళ్లిని విమానంలో జరుపుకోనున్నారట. ఈ జంట ఇటీవలే తాజ్‌మహల్‌ను తిలకించేందుకు ప్రత్యేక విమానంలో వెళ్లొచ్చారు. వీరి వివాహ నిశ్చితార్థం ఈ నెల 23న చెన్నైలో జరగనుంది