తెలుగు వాళ్లు విమాన ప్రయాణాల్లో బిజీ అయ్యారు. కరోనా పాండెమిక్ తర్వాత ప్రయాణాలకు ఛార్టర్ ఫ్లైట్స్‌ని అధికంగా వినియోగిస్తున్నారు. దీంతో బేగంపేట ఎయిర్‌పోర్ట్ ఫుల్ బిజీ అయ్యింది. హైదరాబాద్‌లో ఛార్టర్ ఫ్లైయిట్స్‌కి పెరిగిన డిమాండ్ చూసి ఏవియేషన్ అధికారులే ఆశ్చర్యపోతున్నారు.
బేగంపేట కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో ఛార్టర్ ప్లైట్స్ బిజినెస్ ఊపందుకుంది. గంటకు రూ. 1.60 లక్షల నంచి రూ. 7 లక్షల వరకు ఖర్చయ్యే ఛార్టర్ ఫ్లయింగ్‌కి మన వాళ్లు సై అంటున్నారు. ఖర్చుకు వెనుకాడటం లేదు. సమయం. సెక్యూరిటీకే ప్రాధాన్యం ఇస్తున్నారను. దీంతో రోజుకు సగటున 8 బుకింగ్స్ జరుగుతున్నాయి.
30 శాతం ఇక్కడే
కరోనా ముందుకు పరిస్థితితో పోల్చితే హైదరాబాద్‌లో ఛార్టర్ ఫ్లయిట్స్ బిజినెస్ ఏకంగా 200 శాతం పెరిగింది. ఇతర మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులలో కూడా ఇంత డిమాండ్ లేదు. దేశంలో ఛార్టర్ ఫ్లయిట్స్ బిజినెస్‌లో 30 శాతం హైదరాబాద్ కేంద్రంగానే జరుగుతున్నాయి.
టాలీవుడ్ టూర్స్
హైదరాబాద్ నగరం కేంద్రంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, సినిమా తారాలు ఇటీవల ఛార్టర్ ఫ్లయిట్ సేవలను బాగా ఉపయోగించుకుంటున్నారు. నగరం మధ్యలో బేగంపేట ఉండటంతో ఇక్కడి నుంచి సులువుగా ప్రయాణం చేయడం వీలవుతోంది. దీనికి తోడు కరోనా తర్వాత నెలకొన్న సందేహాలు సైతం ఛార్టెడ్ డిమాండ్ పెరగడానికి కారణం. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఎక్కువగా ఛార్టర్ ఫ్లయిట్స్‌ని ఉపయోగిస్తున్నారు.
ఫుల్ గిరాకీ
ఛార్టెడ్ విమానాలకు డిమాండ్ పెరగడంతో బేగంపేట ఎయిర్‌పోర్టులో దాదాపు 14 మినీ విమానాలు నిలిచి ఉంటున్నాయి. ఇందులో 6 సీట్ల నుంచి 13 సీట్ల కెపాసిటీ ఉన్న విమానాలు ఉన్నాయి. కనీసం 8 బుకింగ్స్ అవుతుండడంతో అందరికీ గిరాకీ దొరకుతోంది.
రెగ్యులర్‌గా
ఈ ట్రెండ్ మరికొద్ది కాలం కొనసాగితే రెగ్యులర్ విమానాల తరహాలో నడిపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు ఏవియేషన్ అధికారులు. మరోవైపు నగరంలో హెలి ట్యాక్సీ సేవలు అందిస్తున్న హెలికాప్టర్ సంస్థలు సైతం ఛార్టర్ ఫ్లయిట్ బిజినెస్‌లోకి రావాలని చూస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment