కోల్‌కతా: మూడు రోజుల క్రితం చార్టర్డ్ విమానంలో ప్రయాణిస్తుండగా తనకు ఎదురైన భయానక అనుభవాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఎన్నికల ప్రచారం ముగించుకొని కోల్‌కతాకు తిరిగి వస్తుండగా తమ విమానానికి ఎదురుగా మరో విమానం దూసుకొచ్చిందని చెప్పారు. తమ పైలట్ తక్షణమే అప్రమత్తమై చాకచాక్యంగా విమానాన్ని కిందకు దించడంతో పెద్ద ముప్పు తప్పిందని అన్నారు.
లేకపోతే మరో 10 సెకండ్ల వ్యవధిలోనే రెండు విమానాలు ఢీకొనేవని తెలిపారు. పైలట్ సమర్థత కారణంగానే తాను ప్రాణాలతో బయటపడ్డానని వెల్లడించారు. మమత ప్రయాణిస్తున్న విమానం భారీగా కుదుపులకు లోనైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. విమానం కుదుపుల వల్ల మమతా బెనర్జీ ఛాతీ, వీపు భాగంలో గాయాలైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)ను బెంగాల్ ప్రభుత్వం కోరింది.
(చదవండి: బెంగాల్ అసెంబ్లీలో హైడ్రామా)
Comments
Please login to add a commentAdd a comment