Merry Christmas 2021 Wishes, Quotes, Greetings and Whatsapp Status Messages for Your Loved Ones
Sakshi News home page

Merry Christmas 2021 Wishes: క్రిస్టమస్‌ రోజున మీ ఫ్రెండ్స్‌కు ఈ మెసేజ్‌లు పంపారంటే.. దిల్‌ ఖుష్‌!

Published Fri, Dec 24 2021 8:43 PM | Last Updated on Sat, Dec 25 2021 10:15 AM

Merry Christmas 2021 Wishes - Sakshi

అందరికీ క్రిస్టమస్‌ శుభాకాంక్షలు! మనలో చాలా మందికి క్రిస్టమస్‌ పండుగ చాలా ప్రత్యేకం. క్రీస్తు జన్మార్ధమైన ఈ పర్వదినాన బంధుమిత్రులతో, విందు భోజనాలతో, బహుమతులతో సందడిగా ఇంటిల్లిపాది ఆహ్లాదంగా గడపాలనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. అలాగే జరుగునుగాక! ఐతే క్రిస్టమస్‌ పండుగ సందర్భంగా మీ ప్రియమైనవారికి ఖరీదైన గిఫ్టులివ్వలేకపోయినా, కోట్ల విలువచేసే చిన్న పలకరింపు, చక్కని మాటలతో పేర్చిన మెసేజ్‌లను పంపినా వారెంతో మురిసిపోతారు. సోషల్‌ మీడియాలో షేర్‌ చేయదగిన అట్లాంటి కొన్ని కోట్స్‌, గ్రీటింగ్స్‌, మెసేజెస్‌లు, ఫొటోలు మీకోసం..

‘మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు!'

మీ సెలవులు ఆనందంతో నిండునుగాక... క్రిస్మస్ శుభాకాంక్షలు!

నిజమైన క్రిస్మస్ ఆశీర్వాదం మనం స్వీకరించే బహుమతుల్లో ఉండదు. పండుగను ఆనందంగా మలిచే కుటుంబంలో ఉంటుంది. మీ క్రిస్మస్ అద్భుతమైన అన్ని విషయాలతో నిండుగా ఉండాలి.

క్రిస్మస్ మెరిసే లైట్లు మీ హృదయాన్ని ఆశలతో నింపాలి. మీకు కావలసినవన్నీ శాంటాక్లాజ్‌ తేవాలని కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరమంతా ఆనందంతో నిండి ఉండాలి. ఈ సంతోషకరమైన రోజున ఇవే మీకు నా శుభాకాంక్షలు. మేరీ క్రిస్మస్!

ఈ హాలిడే సీజన్‌ మీకు శాంతి, శ్రేయస్సు, కోరుకున్న అన్ని బహుమతులను తెస్తుందని ఆశిస్తున్నాను!

హ్యాపీ హాలిడేస్‌! క్రిస్మస్ మీకు ప్రేమ, ఆనందం, శాంతిని తెస్తుందని ఆశిస్తున్నాను.

మీ క్రిస్మస్ ఆనందాలతో, బహుమతులతో నిండి పోవాలి. హ్యాపీ హాలిడేస్‌!

ఈ క్రిస్మస్ మీ ఇంటిలోని ప్రతి మూలను, మీ హృదయాన్నంతటిని ఆనందంతో నింపుతుందని ఆశిస్తున్నాను.

క్రిస్మస్ శుభాకాంక్షలు! ఈ పండుగ ఆనందం మీ జీవితాన్ని ఆనందం, శాంతితో నింపుతుంది.

చదవండి: Good News! ఇక డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు లేకుండానే ఆన్‌లైన్‌ షాపింగ్‌!

ఆనందం, ఐశ్వర్యం, శాంతి అనే గిఫ్ట్‌ ఫ్యాక్‌లను ఈ క్రిస్మస్ రోజున మీరు విప్పాలని ఆశిస్తున్నాను!

ఈ క్రిస్మస్‌ పర్వదినాన మీరు కోరుకునేవన్నీ శాంతా క్లాజ్ మీదగ్గరకు తీసుకురావాలి.

ఈ క్రిస్మస్ రోజున మీ హృదయం ఆనందంతో పొంగిపొర్లుతుందని ఆశిస్తున్నాను.

నా ప్రతి రోజును ఆనందంగా మార్చే నా ప్రియమైన ఫ్రెండ్‌కు క్రిస్మస్ శుభాకాంక్షలు.

నా క్రిస్మస్‌లో హ్యాపీనెస్‌ను ఉంచి, నిజమైన స్నేహితుడిగా ఉన్నందుకు కృతజ్ఞతలు.

ఈ క్రిస్మస్ రోజున మీ ఆనందం పెద్దగా, మీ బిల్లులు చిన్నవిగా ఉండాలని కోరుకుంటున్నాను!

మీకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022! ఈ కొత్త సంవత్సరం మీకు అన్నీ శుభవార్తలనే తెస్తుంది.

క్రిస్మస్  మీకు మంచి ఆరోగ్యం, అంతులేని ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.

నీపై నాకున్నప్రేమ క్రిస్మస్ చెట్టులోని లైట్ల కన్నా దేదీప్యమానంగా వెలుగుతోంది!

మీలాంటి ఫ్రెండ్స్‌ నాతో ఉండటమే క్రిస్మస్ అందించే అత్యుత్తమ గిఫ్ట్‌. క్రిస్మస్ శుభాకాంక్షలు!

(మీరు మీ సన్నిహితులకు మేరీ క్రిస్మస్‌ విషెష్‌ తెలియజేయండి ఇలా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement