christams greetings
-
దేశ ప్రజలకు కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
సాక్షి, ఢిల్లీ: భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. శాంతి, కరుణ, సహనం, ప్రేమలను ప్రపంచానికి ఏసుక్రీస్తు చాటాడు. ఏసు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయి అని సీఎం కేసీఆర్ జాతిని ఉద్దేశించి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు క్రిస్మస్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ జాతీయ విస్తరణకు ఆయన రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. -
‘నీపై నాకున్నప్రేమ క్రిస్మస్ చెట్టులోని లైట్ల కన్నా మరింతగా వెలుగుతోంది'!
అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు! మనలో చాలా మందికి క్రిస్టమస్ పండుగ చాలా ప్రత్యేకం. క్రీస్తు జన్మార్ధమైన ఈ పర్వదినాన బంధుమిత్రులతో, విందు భోజనాలతో, బహుమతులతో సందడిగా ఇంటిల్లిపాది ఆహ్లాదంగా గడపాలనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. అలాగే జరుగునుగాక! ఐతే క్రిస్టమస్ పండుగ సందర్భంగా మీ ప్రియమైనవారికి ఖరీదైన గిఫ్టులివ్వలేకపోయినా, కోట్ల విలువచేసే చిన్న పలకరింపు, చక్కని మాటలతో పేర్చిన మెసేజ్‌లను పంపినా వారెంతో మురిసిపోతారు. సోషల్ మీడియాలో షేర్ చేయదగిన అట్లాంటి కొన్ని కోట్స్, గ్రీటింగ్స్, మెసేజెస్‌లు, ఫొటోలు మీకోసం.. ‘మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు!' మీ సెలవులు ఆనందంతో నిండునుగాక... క్రిస్మస్ శుభాకాంక్షలు! నిజమైన క్రిస్మస్ ఆశీర్వాదం మనం స్వీకరించే బహుమతుల్లో ఉండదు. పండుగను ఆనందంగా మలిచే కుటుంబంలో ఉంటుంది. మీ క్రిస్మస్ అద్భుతమైన అన్ని విషయాలతో నిండుగా ఉండాలి. క్రిస్మస్ మెరిసే లైట్లు మీ హృదయాన్ని ఆశలతో నింపాలి. మీకు కావలసినవన్నీ శాంటాక్లాజ్ తేవాలని కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరమంతా ఆనందంతో నిండి ఉండాలి. ఈ సంతోషకరమైన రోజున ఇవే మీకు నా శుభాకాంక్షలు. మేరీ క్రిస్మస్! ఈ హాలిడే సీజన్ మీకు శాంతి, శ్రేయస్సు, కోరుకున్న అన్ని బహుమతులను తెస్తుందని ఆశిస్తున్నాను! హ్యాపీ హాలిడేస్! క్రిస్మస్ మీకు ప్రేమ, ఆనందం, శాంతిని తెస్తుందని ఆశిస్తున్నాను. మీ క్రిస్మస్ ఆనందాలతో, బహుమతులతో నిండి పోవాలి. హ్యాపీ హాలిడేస్! ఈ క్రిస్మస్ మీ ఇంటిలోని ప్రతి మూలను, మీ హృదయాన్నంతటిని ఆనందంతో నింపుతుందని ఆశిస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు! ఈ పండుగ ఆనందం మీ జీవితాన్ని ఆనందం, శాంతితో నింపుతుంది. చదవండి: Good News! ఇక డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండానే ఆన్లైన్ షాపింగ్! ఆనందం, ఐశ్వర్యం, శాంతి అనే గిఫ్ట్ ఫ్యాక్‌లను ఈ క్రిస్మస్ రోజున మీరు విప్పాలని ఆశిస్తున్నాను! ఈ క్రిస్మస్ పర్వదినాన మీరు కోరుకునేవన్నీ శాంతా క్లాజ్ మీదగ్గరకు తీసుకురావాలి. ఈ క్రిస్మస్ రోజున మీ హృదయం ఆనందంతో పొంగిపొర్లుతుందని ఆశిస్తున్నాను. నా ప్రతి రోజును ఆనందంగా మార్చే నా ప్రియమైన ఫ్రెండ్‌కు క్రిస్మస్ శుభాకాంక్షలు. నా క్రిస్మస్లో హ్యాపీనెస్‌ను ఉంచి, నిజమైన స్నేహితుడిగా ఉన్నందుకు కృతజ్ఞతలు. ఈ క్రిస్మస్ రోజున మీ ఆనందం పెద్దగా, మీ బిల్లులు చిన్నవిగా ఉండాలని కోరుకుంటున్నాను! మీకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022! ఈ కొత్త సంవత్సరం మీకు అన్నీ శుభవార్తలనే తెస్తుంది. క్రిస్మస్ మీకు మంచి ఆరోగ్యం, అంతులేని ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నీపై నాకున్నప్రేమ క్రిస్మస్ చెట్టులోని లైట్ల కన్నా దేదీప్యమానంగా వెలుగుతోంది! మీలాంటి ఫ్రెండ్స్ నాతో ఉండటమే క్రిస్మస్ అందించే అత్యుత్తమ గిఫ్ట్. క్రిస్మస్ శుభాకాంక్షలు! (మీరు మీ సన్నిహితులకు మేరీ క్రిస్మస్ విషెష్ తెలియజేయండి ఇలా..) -
నేడు క్రిస్మస్ నగరం ముస్తాబు
సాక్షి, ముంబై: క్రిస్మస్ ఉత్సవాలకు నగరం ముస్తాబైంది. నగరంలోని అనేక ప్రాంతాలను విద్యుద్దీపాలతోపాటు వివిధ రకాల ఆకాశ దీపాలతో (కందిళ్లు) అలంకరించారు. అనేకమంది తమ ఇళ్లనుకూడా రంగు రంగుల తోరణాలు, నక్షత్రాలు, క్రిస్మస్ ట్రీలతో అలంకరించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొందరు రాజకీయ నాయకులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అనేక కూడళ్లలో హోర్డింగులను ఏర్పాటుచేశారు. నగరంలోని పలు దుకాణాలలో శాంటాక్లాస్ బొమ్మలు, టోపీలతోపాటు వివిధ రకాల ఆకర్షణీయమైన బహుమతులు దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా కొనుగోలుదారులతో దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. బాంద్రాహిల్ రోడ్డు, క్రాఫర్డ్ మార్కెట్లలో క్రిస్మస్ ట్రీలు అత్యధికంగా అమ్ముడుపోయా యి. అదేవిధంగా నగరంలోని బైకలా, కొలాబా, బాంద్రా, మాహీం, అంధేరీ తదితర ప్రాంతాలలోని అత్యంత పురాతనమైన సెయింట్ ఆండ్రూ, మౌంట్ మేరీ, సెయింట్ మైఖేల్, సెయింట్ ఆన్స్, సెయింట్ థామస్ కెథడ్రల్ తదితర అనేక చర్చిలను అలంకరించారు. హోటళ్లు, షాపింగ్ మాల్‌లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ప్రజలను ఆకట్టుకునే విధంగా భారీఎత్తున విద్యుద్దీపాలతో అలంకరించడంతోపాటు పెద్ద పెద్ద క్రిస్మస్ ట్రీలను ఏర్పాటుచేశారు. సిద్ధమైన తెలుగు ప్రజలు.... ముంైబె , ఠాణేలతోపాటు, రాష్ట్రంలో నివసించే తెలుగు ప్రజలు కూడా క్రిస్మస్ వేడుకలను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాల్లోని చర్చిలలో కూడా క్రిస్మస్ ఉత్సవాలకుప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగరం నడిబొడ్డున పరేల్‌లో ఉన్న ‘రాథో్ మెమోరియల్ మెథడిస్ట్ తెలుగు చర్చి’తోపాటు కొలాబా, మలాడ్, కుర్లా, అంటాప్‌హిల్, మాటుంగా లేబర్ క్యాంపు, ఠాణే, భివండీ, కళ్యాణ్, ఉల్లాస్‌నగర్ తదితర ప్రాంతాలలోని తెలుగు బాప్టిస్టు చర్చిలు ఈ వేడుకల కోసం ముస్తాబయ్యాయి.