సాక్షి, ముంబై:
క్రిస్మస్ ఉత్సవాలకు నగరం ముస్తాబైంది. నగరంలోని అనేక ప్రాంతాలను విద్యుద్దీపాలతోపాటు వివిధ రకాల ఆకాశ దీపాలతో (కందిళ్లు) అలంకరించారు. అనేకమంది తమ ఇళ్లనుకూడా రంగు రంగుల తోరణాలు, నక్షత్రాలు, క్రిస్మస్ ట్రీలతో అలంకరించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొందరు రాజకీయ నాయకులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అనేక కూడళ్లలో హోర్డింగులను ఏర్పాటుచేశారు. నగరంలోని పలు దుకాణాలలో శాంటాక్లాస్ బొమ్మలు, టోపీలతోపాటు వివిధ రకాల ఆకర్షణీయమైన బహుమతులు దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా కొనుగోలుదారులతో దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. బాంద్రాహిల్ రోడ్డు, క్రాఫర్డ్ మార్కెట్‌లలో క్రిస్మస్ ట్రీలు అత్యధికంగా అమ్ముడుపోయా యి. అదేవిధంగా నగరంలోని బైకలా, కొలాబా, బాంద్రా, మాహీం, అంధేరీ తదితర ప్రాంతాలలోని అత్యంత పురాతనమైన సెయింట్ ఆండ్రూ, మౌంట్ మేరీ, సెయింట్ మైఖేల్, సెయింట్ ఆన్స్, సెయింట్ థామస్ కెథడ్రల్ తదితర అనేక చర్చిలను అలంకరించారు. హోటళ్లు, షాపింగ్ మాల్‌లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ప్రజలను ఆకట్టుకునే విధంగా భారీఎత్తున విద్యుద్దీపాలతో అలంకరించడంతోపాటు పెద్ద పెద్ద క్రిస్మస్ ట్రీలను ఏర్పాటుచేశారు.
సిద్ధమైన తెలుగు ప్రజలు....
ముంైబె , ఠాణేలతోపాటు, రాష్ట్రంలో నివసించే తెలుగు ప్రజలు కూడా క్రిస్మస్ వేడుకలను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాల్లోని చర్చిలలో కూడా క్రిస్మస్ ఉత్సవాలకుప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగరం నడిబొడ్డున పరేల్‌లో ఉన్న ‘రాథో్ మెమోరియల్ మెథడిస్ట్ తెలుగు చర్చి’తోపాటు కొలాబా, మలాడ్, కుర్లా, అంటాప్‌హిల్, మాటుంగా లేబర్ క్యాంపు, ఠాణే, భివండీ, కళ్యాణ్, ఉల్లాస్‌నగర్ తదితర ప్రాంతాలలోని తెలుగు బాప్టిస్టు చర్చిలు ఈ వేడుకల కోసం ముస్తాబయ్యాయి.
నేడు క్రిస్మస్ నగరం ముస్తాబు
Published Wed, Dec 25 2013 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement
Advertisement