స్పైస్జెట్ పండుగ ఆఫర్..
రూ. 888కే టికెట్..
న్యూఢిల్లీ: దేశీ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా వచ్చే పండుగ సీజన్‌ను పురస్కరించుకొని టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థ ఈ ఆఫర్‌లో భాగంగా దేశీ విమాన టికెట్లను (ఒక వైపునకు) రూ.888 నుంచి అందిస్తోంది. ఇక విదేశీ విమాన టికెట్ ధర రూ.3,699గా ఉంది. అక్టోబర్ 7 వరకు కొనసాగనున్న ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు ఈ నవంబర్ 8 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 13 వరకు మధ్య ఉన్న కాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చని సంస్థ పేర్కొంది. ఇది పరిమితకాల ఆఫర్ అని, ముందుగా టికెట్లను బుకింగ్ చేసుకున్న వారికి అధిక ప్రాధాన్యముంటుందని తెలిపింది.