పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని స్విగ్గీ 'ఇంటర్నేషనల్ లాగిన్' పేరుతో సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. ఇది యునైటెడ్ స్టేట్స్, కెనడా, జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, యూఏఈతో సహా 27 దేశాలలోని వినియోగదారులు ఫుడ్ డెలివరీ, కిరాణా షాపింగ్ వంటి వంటివి చేయడానికి అనుమతిస్తుంది.
భారతదేశంలోని కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు అవసరమైన వస్తువులు లేదా బహుమతులను ఆర్డర్ చేయడానికి లేదా పంపడానికి స్విగ్గీ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్‌లు, యూపీఐ ఎంపికలతో డబ్బు చెల్లించవచ్చు.
స్విగ్గీ ఇంటర్నేషనల్ లాగిన్ ఫీచర్ ద్వారా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు కిరాణా లేదా నిత్యావసర వస్తువులను ఇంటికి పంపించడానికి పనికొస్తుంది. అంతే కాకుండా.. కుటుంబ సమావేశాలకు, ముఖ్యంగా పండుగల సమయంలో ఫుడ్, గిఫ్ట్స్ వంటివి చాలా అవసరం. అయితే విదేశాల్లో నివసిస్తున్న వారు నేరుగా గిఫ్ట్స్, ఫుడ్ ఇవ్వలేరు. కాబట్టి ఇంటర్నేషనల్ లాగిన్ ద్వారా ప్రత్యేక సందర్భాలలో తమ ప్రియమైన వారికి ఇలాంటివి స్విగ్గీ ద్వారా అందించి ఆశ్చర్యపరచవచ్చు.
ఇదీ చదవండి: యూట్యూబ్ కొత్త ఫీచర్: మరింత ఆదాయానికి సులువైన మార్గం
స్విగ్గీ గురించి
2014లో ప్రారంభమైన స్విగ్గీ ప్రస్తుతం లక్షల మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఫుడ్ డెలివరీలో అగ్రగామిగా ఉంటూ సుమారు 600 కంటే ఎక్కువ నగరాల్లో రెండు లక్షల కంటే ఎక్కువ రెస్టారెంట్లతో సహకరిస్తోంది. 43 నగరాల్లో పనిచేస్తున్న స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ కేవలం 10 నిమిషాల్లో 20 కంటే ఎక్కువ కిరణా, ఇతర నిత్యావసర వస్తువులను డెలివరీ చేస్తోంది. వినియోగదారులకు ఉత్తమ సేవలను అందించడమే లక్ష్యంగా స్విగ్గీ ముందుకు సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment