Today Gold and Silver prices రికార్డు స్థాయి నుంచి కిందికి దిగివచ్చినట్టే వచ్చిన పసిడి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. రానున్న పండుగల సీజన్‌లో బంగారానికి డిమాండ్ పెరనున్న నేపథ్యంలో పెరుగుతున్న ధరలను పసిడి ప్రియులకు షాకిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో వెండి బంగారం మళ్లీ పెరుగుదల దిశగా కదులుతున్నాయి. శనివారం నాడు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ. 55,000కి చేరుకున్నాయి .అలాగే భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 60వేల దిశగా కదులుతోంది.(జ్యూస్ అమ్ముకునే స్థాయినుంచి రూ.5 వేల కోట్ల దాకా: ఎవరీ సౌరభ్?)
శనివారం నాడు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 200 రూపాయలు పెరిగి రూ. 54,900 వద్ద, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 220పెరిగి రూ. 59,890 వద్ద ఉంది. అటే వెండి కూడా లాభాల్లోనే ఉంది. రూ. 700రూపాయలు ఎగిసి కిలోవెండి ధర రూ. 78,200 పలుకుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో బంగారం డిమాండ్ ఉండే బ్యాక్-టు-బ్యాక్ పండుగల నేపథ్యంలో సెప్టెంబరు- నవంబర్ త్రైమాసికంలో పసిడి మెరుస్తూనే ఉంటుందని,ఈ నవంబర్ 2023 చివరి నాటికి 62 వేలకు దాటవచ్చనేది అంచనా. యూఎస్ ఆర్థిక డేటా , డాలర్ , ముడి చమురు ధరలలో పెరుగుదలో అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు ఔన్సు 2,090డాలర్ల రికార్డు స్థాయికి చేరుకోవచ్చని అంచనా. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,923 డాలర్ల వద్ద ముగిసింది. ఏది ఏమైనా బంగారం ధరలు యూఎస్ ఫెడ్ ధోరణి, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా కరెన్సీ డాలరు కదలికల ఆధారంగా మారుతూ ఉంటాయి అనేది గమనార్హం. (భారతీయ విద్యార్థులకు షాక్: వీసా ఫీజు భారీగా పెంపు)
Comments
Please login to add a commentAdd a comment