న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగ సీజన్‌లో దేశీయంగా ప్యాసింజర్ వాహనాల (కార్లు మొదలైనవి) అమ్మకాలు 10 లక్షల మార్కును దాటేయవచ్చని ఆటోమొబైల్ పరిశ్రమ అంచనా వేస్తోంది. వీటిలో యుటిలిటీ వాహనాల విక్రయాలు అత్యధికంగా ఉండొచ్చని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.
ఈసారి ఆగస్టు 17న మొద లయ్యే పండుగల సీజన్ నవంబర్ 14 వరకు 68 రోజుల పాటు కొనసాగనుంది. సాధారణంగా వాహన విక్రయాల్లో దాదాపు 22–26 శాతం వాటా పండుగ సీజన్‌దే ఉంటుందని శ్రీవాస్తవ చెప్పారు. ఈ ఏడాది ప్యాసింజర్ వాహన విక్రయాలు 40 లక్షల స్థాయిలో ఉండొచ్చని, అందులో 10 లక్షల యూనిట్లు పండుగ సీజన్‌వి ఉండగలవని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment