ముంబై: దేశీయ ఆటో తయారీ కంపెనీల డిసెంబర్ వాహన విక్రయ గణాంకాలు మిశ్రమంగా నమోదయ్యాయి. గతేడాది చివరి నెలలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హోండా కార్స్, ఎంజీ మోటార్స్ విక్రయాలు క్షీణించాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, నిస్సాన్, స్కోడా అమ్మకాలు మెరుగుపడ్డాయి. ఇదే డిసెంబర్‌లో ద్విచక్ర వాహన కంపెనీలైన హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు స్వల్పంగా క్షీణించాయి. ఆర్థిక రికవరీతో వాణిజ్య వాహనాలకు డిమాండ్ నెలకొంది. ఫలితంగా ఈ విభాగానికి చెందిన వోల్వో ఐషర్, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, ఎంఅండ్‌ఎం వాహన అమ్మకాల్లో వృద్ధి నమోదైంది.
► మారుతీ గతేడాది డిసెంబర్‌లో దేశీయంగా 1,23,016 వాహనాలను అమ్మింది. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో (2020) లో విక్రయించిన 1,40,754 యూనిట్లతో పోలిస్తే 13 % తక్కువ గా ఉంది. 2021లో 12.14 లక్షల యూనిట్లను విక్రయించింది.
► ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో టాటా మోటార్స్ 50% వృద్ధిని నమోదు చేసింది. గతేడాది డిసెంబర్‌లో ఈ సంస్థ 23,545 కార్లను అమ్మగా.. 2021లో 35,299 యూనిట్లను అమ్మింది.
దేశీయ ఆటో పరిశ్రమపై డిసెంబర్‌నూ సెమికండెక్టర్ల కొరత ప్రభావం కొనసాగింది. ప్రతికూలతల కంటే సానుకూలతలు ఎక్కువగా ఉండటంతో కొత్త ఏడాది అమ్మకాలపై ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉన్నాము. అయితే ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, సెమికండెక్టర్ల కొరత సమస్యలు పరిశ్రమకు ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలాయి.
శశాంక్ శ్రీవాస్తవ మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
ఆటో అమ్మకాలపై చిప్ ఎఫెక్ట్
Published Mon, Jan 3 2022 5:22 AM | Last Updated on Mon, Jan 3 2022 5:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment