Toyota Remains World Biggest Car Seller Widens Lead On Volkswagen - Sakshi
Sakshi News home page

World Biggest Car Seller: హట్‌కేకుల్లా అమ్ముడైన కోటి కార్లు..! దిగ్గజ కంపెనీలకు భారీ షాక్‌..!

Published Sat, Jan 29 2022 1:58 PM | Last Updated on Sat, Jan 29 2022 2:50 PM

Toyota Remains World Biggest Car Seller Widens Lead On Volkswagen - Sakshi

ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీలను చిప్‌ కొరత, సప్లై చైన్‌ రంగం తీవ్రంగా దెబ్బ తీశాయి. గత ఏడాది ఆయా కంపెనీల ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. కాగా 2021లో జపనీస్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం టయోటా మాత్రం రికార్డు స్థాయిలో అమ్మకాలను జరిపింది. 

కోటికి పైగా..!
జపాన్‌కు చెందిన టయోటా మోటార్ కో శుక్రవారం తన వాహన విక్రయాలు 2021లో గణనీయంగా  10.1 శాతం పెరిగాయని ఒక ప్రకటనలో పేర్కొంది. వరుసగా రెండో ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించి టయోటా రికార్డులు క్రియేట్‌ చేసింది.  సమీప ప్రత్యర్థి జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ AG కంటే మరింత ముందుందని టయోటా తెలిపింది. అనుబంధ సంస్థలైన డైహట్సు మోటార్స్ , హినో మోటార్స్‌తో సహా 2021లో 10.5 మిలియన్(కోటీకిపైగా) వాహనాల అమ్మకాలు జరిపినట్లు టయోటా వెల్లడించింది.



 

ఫోక్స్‌ వ్యాగన్‌ అంతంతే..!
2020తో పోల్చితే గత ఏడాదిలో ఫోక్స్‌ వ్యాగన్‌ అమ్మకాల సంఖ్య భారీగా పడిపోయింది. 2020 కంటే 5 శాతం తక్కువ అమ్మకాలను 2021లో నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఫోక్స్‌వ్యాగన్‌ కేవలం 8.9 మిలియన్ల కార్ల అమ్మకాలను జరిపింది. గత 10 సంవత్సరాల్లో ఇదే అత్యల్పం. 

అమెరికన్‌ కంపెనీలకు భారీ షాక్‌..!
90 సంవత్సరాల తరువాత అమెరికాలో అత్యధికంగా అమ్ముడైన కార్ల బ్రాండ్‌గా టయోటా నిలిచింది. 2021గాను యుఎస్ ఆటోమొబైల్‌ మార్కెట్లలో అత్యధికంగా కార్లను విక్రయించిన కిరీటాన్ని టయోటా మోటార్స్‌ సొంతం చేసుకుంది. స్థానిక ఆటోమొబైల్‌ దిగ్గజం జనరల్‌ మోటార్స్‌ షాకిస్తూ టయోటా మోటార్స్‌ గత ఏడాది అమెరికాలో అత్యధిక కార్లను సేల్‌ చేసింది. 2021లో సుమారు 2.332 మిలియన్ వాహనాలను టయోటా విక్రయించింది. ఇక జనరల్‌ మోటార్స్‌ గత ఏడాదిలో 2.218 మిలియన్ యూనిట్ల అమ్మకాలను జరిపింది.

చదవండి: Toyota: 90 ఏళ్ల తరువాత సంచలనం సృష్టించిన టయోటా మోటార్స్‌..!
చదవండి: నానో కారు కంటే చిన్న కారును లాంచ్‌ చేసిన టయోటా..! ధర ఎంతంటే..?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement