న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలకు పండుగల డిమాండ్ తోడయ్యింది. ఢిల్లీలో పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.200 పెరిగి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ.78,300కు చేరింది. స్టాకిస్టులు, రిటైల్ కస్టమర్ల నుంచి పసిడికి డిమాండ్ పటిష్టంగా ఉన్నట్లు ఆల్ ఇండియా సఫారా అసోసియేషన్ పేర్కొంది. ఇక వెండి విషయానికి వస్తే, కేజీ ధర రూ.665 ఎగసి రూ.93,165కు చేరింది.
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా కమోడిటీ మార్కెట్లు బుధవారం పనిచేయని సంగతి తెలిసిందే. నవరాత్రి ప్రారంభంలో డిమాండ్ పెరగడంతో సెంటిమెంట్ మెరుగ్గా మారిందని, హిందూ పురాణాల ప్రకారం కొత్త వస్తువులను ముఖ్యంగా విలువైన లోహాలను కొనుగోలు చేయడానికి ఇది శుభప్రదమైన వారమని వ్యాపారులు తెలిపారు.
మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ కాంట్రాక్ట్ 10 గ్రాముల ధర ఈ వార్త రాస్తున్న 10 గంటల సమయంలో రూ.200కుపైగా లాభంతో రూ.45,500 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో ధర రూ.400కుపైగా పెరిగింది. వెండి సైతం రూ.1,000కిపైగా లాభంతో రూ. 92,453 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment