మారుతి వ్యాగన్‌ ఆర్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ | Maruti Suzuki launches WagonR Limited Edition ahead of festive season | Sakshi
Sakshi News home page

మారుతి వ్యాగన్‌ ఆర్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌

Oct 6 2018 9:06 AM | Updated on Oct 6 2018 9:11 AM

Maruti Suzuki launches WagonR Limited Edition ahead of festive season - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పండుగ సీజన్‌లో కస్టమర్లకు ఆకట్టుకునేందుకు ఆటో మేజర్‌ మారుతి సుజుకి వ్యాగన్‌ ఆర్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ను లాంచ్‌ చేసింది. ఎక్కువగా అమ్ముడుబోయే తన కార్లలో ఒకటైన వ్యాగన్‌ ఆర్‌కు కొత్త సొబగులు అద్ది విడుదల చేసింది. అంతేకాదు వాగన్‌ ఆర్‌ లిమిటెడ్ ఎడిషన్ కొనుగోలుపై రెండు ఆప్షనల్‌ యాక్ససరీస్‌ను కూడా ఆఫర్‌ చేస్తోంది. ఈ కిట్లను రూ.15,490, రూ.25,490 ప్రత్యేక ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.

వ్యాగన్‌ ఆర్‌ లిమిటెడ్ ఎడిషన్‌లో ఇంటీరియర్‌ స్టైలింగ్ కిట్, డబుల్-డిన్ బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్‌తోపాటు  రివర్స్ పార్కింగ్ సెన్సార్లను, ఫాబ్రిక్‌ ఫ్లోర్‌ మాట్స్‌ను  జోడించింది. డబుల్‌ డిన్‌  బ్లూటూత్‌  మ్యూజిక్‌ సిస్టమ్‌ విత్‌ స్పీకర్స్‌ అమర్చింది. అలాగే  సీటు కవర్ల డిజైన్‌ను కూడా కొత్తగా తీర్చిదిద్దింది.  ఇక ఎక్స్‌ టీరియర్‌ విషయానికి వస్తే బాడీ గ్రాఫిక్స్‌తో పాటు, వెనుక స్పాయిలర్‌ను అమర్చింది. ఈ పరిమిత ఎడిషన్‌లో జోడించిన అదనపు హంగులతో వినియోగదారులను భారీగా ఆకర్షించాలని మారుతి భావిస్తోంది. వ్యాగన్‌ఆర్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ ద్వారా  కస్టమర్లకు ఈ పండుగు సీజన్‌ మరింత అద్భుతంగా మారనుందని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ఎస్. కల్సీ ఒక ప్రకటనలో తెలిపారు. 

కాగా 1999లో లాంచ్‌  అయిన వాగన్ఆర్ కంపెనీ అమ్మకాల్లో  కీలక పాత్రను పోషిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్, సెప్టెంబర్ కాలానికి మారుతి మొత్తం అమ్మకాల సంఖ్య 21.9 లక్షలు నమోదుకాగా, వ్యాగన్‌ ఆర్‌ 85వేల యూనిట్లను విక్రయించడం గమనార్హం.

ధర : రూ 4.19 లక్షల నుంచి రూ. 5.39 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో కూడిన 1.0 లీటర్, 3-సిలిండర్ డ్యుయల్‌ ఇంజీన్‌(పెట్రోల్, సీఎన్‌జీ) ఆప్షన్సతో  లభిస్తుంది. అలాగే  5-స్పీడ్ ఎఎంటీ ట్రాన్స్మిషన్‌తో పెట్రోల్‌ వెర్షన్‌ కూడా లభ్యం.

1
1/6

2
2/6

3
3/6

4
4/6

5
5/6

6
6/6

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement