wagan r
-
వ్యాగన్ఆర్ అంత ఘోరమా : టాటా మోటార్స్ సెటైర్లు
సాక్షి, ముంబై: భద్రతా ప్రమాణాల విషయంలో మెరుగైన రేటింగ్ సాధించిన ప్రముఖ కార్ల సంస్థ టాటా మోటార్స్ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తోంది. తాజాగా మారుతి సుజుకిని లక్ష్యంగా చేసుకుంది. మారుతి సుజుకి వాహనం వ్యాగన్ఆర్పై సెటైర్లు వేసింది. ఇటీవలికాలంలో సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్న టాటా మెటార్స్ భద్రతా క్రాష్ పరీక్షలలో విఫలమైన పోటీ సంస్థల కార్లపై వరుసగా వ్యంగ్యంగా ట్వీట్ చేస్తోంది. ఇప్పటికే హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్, మారుతి ఎస్-ప్రెస్సోపై విమర్శలు చేసింది. (ఎస్బీఐతో బెంజ్ జట్టు: ప్రత్యేక ఆఫర్లు) చక్రం ఊడిపోయిన ఇమేజ్ను ట్వీట్ చేస్తూ, భద్రత ముఖ్యం స్మార్ట్‌గా ఉండాలంటూ సూచించింది. అంతేకాదు కారు స్పెల్లింగ్‌లో కావాలనే ‘R’చేర్చడం గమనార్హం. మారుతి వాగన్ఆర్ గ్లోబల్ ఎన్సీఏపీ భద్రతా క్రాష్ పరీక్షలలో పేలవమైన రేటింగ్‌ను పొందిన సంగతి తెలిసిందే. ఇటీవల గ్లోబల్ కార్ సేఫ్టీ రేటింగ్ ఏజెన్సీ గ్లోబల్ ఎన్సీఏపీ 2014-2019 మధ్య వచ్చిన కార్లలో సురక్షితమైన భారతీయ కార్ల జాబితాను ప్రకటించింది. ఇందులో మారుతి ఎస్-ప్రెస్సో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, కియా మోటార్స్ సెల్టోస్ ఎస్యూవీ రేటింగ్ దారుణంగా ఉండగా, టాటా మోటార్స్ కార్లు నెక్సాన్, ఆల్ట్రోజ్ ఫైవ్ స్టార్ క్రాష్ రేటింగ్‌ను పొందాయి. ఇంకా టిగోర్, టియాగో కూడా సురక్షితమైన కార్లుగా పేర్కొంటూ ఫోర్-స్టార్ రేటింగ్ ఇచ్చింది. Safety is 'two' important to be ignored. Be smart before someone overturns your caRt. Choose Tiago, the safest car in the segment, rated 4 stars by GNCAP. Click on https://t.co/x9nKgE745s to book now.#Tiago #NewForever #SaferCarsForIndia pic.twitter.com/3k8Ughat0C — Tata Motors Cars (@TataMotors_Cars) November 22, 2020 -
వ్యాగన్ ఆర్, బాలెనో కార్లు రీకాల్
సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల సంస్థ మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ కార్లను భారీ సంఖ్యలో రీకాల్ చేస్తోంది. ఫ్యూయెల్ పంప్లో లోపాలు ఉండటంతో వ్యాగన్ ఆర్, బాలెనో మోడళ్ళను రీకాల్ చేస్తున్నట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో మారుతి బుధవారం ప్రకటించింది. ఇంధన పంపులో లోపాలు ఉన్నట్టు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉచితంగా ఈ లోపాలను సరిదిద్ది కస్టమర్లకు తిరిగి అందించనున్నామని దేశంలోని అతిపెద్ద ప్రయాణీకుల వాహనాల తయారీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ కార్లు వాగన్ ఆర్, బాలెనో (పెట్రోల్ వేరియంట్) 1,34,885 యూనిట్లను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. నవంబర్ 15, 2018-2019 అక్టోబర్ 15 మధ్య తయారైన వ్యాగన్ఆర్ 56,663 కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపింది. అలాగే జనవరి 8, 2019-నవంబర్ 8, 2019 మధ్య తయారైన బాలెనో 78,222 కార్లను రాబోయే వారాల్లో రీకాల్ చేస్తామని పేర్కొంది. కస్టమర్లకు అదనపు ఖర్చు లేకుండా లోపభూయిష్ట భాగాన్ని కంపెనీ భర్తీ చేస్తుందని వెల్లడించారు. మోటారు జనరేటర్ యూనిట్లో లోపం కారణంగా డిసెంబరులో, 63,493 యూనిట్ల ప్రీమియం సియాజ్, ఎర్టిగా, ఎక్స్ఎల్ 6, ఆగస్టులో 40,618 యూనిట్ల వ్యాగన్ ఆర్ కార్లను స్వచ్ఛందంగా రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. -
మారుతి వ్యాగన్ ఆర్ లిమిటెడ్ ఎడిషన్
సాక్షి, న్యూఢిల్లీ: పండుగ సీజన్లో కస్టమర్లకు ఆకట్టుకునేందుకు ఆటో మేజర్ మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ లిమిటెడ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఎక్కువగా అమ్ముడుబోయే తన కార్లలో ఒకటైన వ్యాగన్ ఆర్కు కొత్త సొబగులు అద్ది విడుదల చేసింది. అంతేకాదు వాగన్ ఆర్ లిమిటెడ్ ఎడిషన్ కొనుగోలుపై రెండు ఆప్షనల్ యాక్ససరీస్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ కిట్లను రూ.15,490, రూ.25,490 ప్రత్యేక ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. వ్యాగన్ ఆర్ లిమిటెడ్ ఎడిషన్‌లో ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, డబుల్-డిన్ బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్తోపాటు రివర్స్ పార్కింగ్ సెన్సార్లను, ఫాబ్రిక్ ఫ్లోర్ మాట్స్ను జోడించింది. డబుల్ డిన్ బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ విత్ స్పీకర్స్ అమర్చింది. అలాగే సీటు కవర్ల డిజైన్‌ను కూడా కొత్తగా తీర్చిదిద్దింది. ఇక ఎక్స్ టీరియర్ విషయానికి వస్తే బాడీ గ్రాఫిక్స్‌తో పాటు, వెనుక స్పాయిలర్‌ను అమర్చింది. ఈ పరిమిత ఎడిషన్‌లో జోడించిన అదనపు హంగులతో వినియోగదారులను భారీగా ఆకర్షించాలని మారుతి భావిస్తోంది. వ్యాగన్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ ద్వారా కస్టమర్లకు ఈ పండుగు సీజన్ మరింత అద్భుతంగా మారనుందని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ఎస్. కల్సీ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా 1999లో లాంచ్ అయిన వాగన్ఆర్ కంపెనీ అమ్మకాల్లో కీలక పాత్రను పోషిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్, సెప్టెంబర్ కాలానికి మారుతి మొత్తం అమ్మకాల సంఖ్య 21.9 లక్షలు నమోదుకాగా, వ్యాగన్ ఆర్ 85వేల యూనిట్లను విక్రయించడం గమనార్హం. ధర : రూ 4.19 లక్షల నుంచి రూ. 5.39 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 1.0 లీటర్, 3-సిలిండర్ డ్యుయల్ ఇంజీన్(పెట్రోల్, సీఎన్జీ) ఆప్షన్సతో లభిస్తుంది. అలాగే 5-స్పీడ్ ఎఎంటీ ట్రాన్స్‌మిషన్‌తో పెట్రోల్ వెర్షన్ కూడా లభ్యం. -
ఢిల్లీలో మరో బీఎండబ్ల్యూ బీభత్సం
ఢిల్లీ: ఢిల్లీలో ఓ బీఎం డబ్ల్యూ బీభత్సం సృష్టించింది. ఐఐటీ ఫ్లై ఓవర్ పై ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంచనావేస్తున్నారు. ఈ ఘటనలో రెండు వాహనాలను నుజ్జునుజ్జు అయ్యాయి. మితిమీరిన వేగంతో దూసుకు వచ్చిన బీఎండబ్ల్యూ ఎస్ యూవీ.. వ్యాగన్ ఆర్ కారును ఢీకొట్టింది. ఈ ధాటికి కారు వ్యాగన్ ఆర్ ఒక్కసారిగా గాల్లోకి లేచి ఎగిరిపడింది. దీంతో వ్యాగన్ ఆర్ కారు డ్రైవర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బాధితుడిని గుర్గావ్ కు చెందిన నజ్రూల్ ఇస్లాంగా పోలీసులు గుర్తించారు. బీఎండబ్ల్యూ కారు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షుల కథనం. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చత్తీస్ గడ్ రిజిస్ట్రేషన్ వాహనంగా బీఎండబ్ల్యూ కారును గుర్తించారు. కాగా ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.