ఢిల్లీలో మరో బీఎండబ్ల్యూ బీభత్సం | Driver of Wagon R killed as out of control BMW rams into it in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మరో బీఎండబ్ల్యూ బీభత్సం

Published Mon, Jan 23 2017 8:44 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ఢిల్లీలో మరో  బీఎండబ్ల్యూ బీభత్సం - Sakshi

ఢిల్లీలో మరో బీఎండబ్ల్యూ బీభత్సం

ఢిల్లీ:  ఢిల్లీలో  ఓ బీఎం డబ్ల్యూ బీభత్సం  సృష్టించింది. ఐఐటీ ఫ్లై ఓవర్ పై  ఆదివారం  అర్థరాత్రి   చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.  అతివేగమే ప్రమాదానికి కారణమని  పోలీసులు అంచనావేస్తున్నారు. ఈ  ఘటనలో రెండు వాహనాలను  నుజ్జునుజ్జు అయ్యాయి.

మితిమీరిన వేగంతో దూసుకు వచ్చిన బీఎండబ్ల్యూ ఎస్ యూవీ..   వ్యాగన్ ఆర్  కారును  ఢీకొట్టింది.  ఈ ధాటికి కారు వ్యాగన్  ఆర్ ఒక్కసారిగా గాల్లోకి లేచి  ఎగిరిపడింది. దీంతో వ్యాగన్ ఆర్ కారు డ్రైవర్ అక్కడిక్కడే  ప్రాణాలు కోల్పోయాడు.   బాధితుడిని గుర్గావ్ కు చెందిన నజ్రూల్ ఇస్లాంగా పోలీసులు గుర్తించారు. 
 
బీఎండబ్ల్యూ కారు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని   ప్రత్యక్ష సాక్షుల కథనం.  ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు  చేసి  దర్యాప్తు  ప్రారంభించారు. చత్తీస్ గడ్ రిజిస్ట్రేషన్ వాహనంగా బీఎండబ్ల్యూ  కారును గుర్తించారు. కాగా  ప్రమాదానికి కారణమైన  కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement