పండగల వేళ : చందమామలా మెరిసిపోవాలంటే! | Skin Care Beauty Tips During Festive Season | Sakshi
Sakshi News home page

పండగల వేళ : చందమామలా మెరిసిపోవాలంటే!

Published Thu, Sep 5 2024 5:10 PM | Last Updated on Thu, Sep 5 2024 5:40 PM

Skin Care Beauty Tips During Festive Season

వరుస పండుగల సీజన్‌ వచ్చేస్తోంది. వినాయక చవితి మొదలు తెలుగుముంగిళ్లు దసరా, దీపావళి,సంక్రాంతి సంబరాలతో కళకళలాడతాయి. అంతేనా ఆడబిడ్డలు పట్టుచీరలు, కొత్త నగలు అంటూ షాపింగ్‌తో సందడిగా ఉంటారు.  దీనికి తోడు  గృహిణులు, కొత్తకోడళ్లు,  కొత్త పెళ్లి కూతుళ్లు తమ అందానికి మెరుగులు దిద్దుకునే పనిలో బిజీబిజీగా ఉంటారు.  మరి ముఖం, చర్మం, మెరుస్తూ చందమామలా ఉండాలంటే  కొన్ని జాగ్రత్తలు తప్పవు. అవేంటో ఒకసారి చూద్దాం.

చర్మం నిగనిగలాడుతూ ఉండాలంటే, చక్కటి ఆహారం తీసుకోవాలి.  పండగల సందడిలో స్వీట్లు వగైనా ఎక్కువగా తినేస్తాం కాబట్టి  ఒంటికి కాస్తంత పని చెప్పాలి. కనీసం ఓ అరగంట పాటైనా వాకింగ్‌, యోగా లాంటి వ్యాయామం తప్పని సరి. అలాగే  రోజుకు సరిపినన్ని నీళ్లు  తాగేలా జాగ్రత్త పడాలి.  ఒక  ఆరోగ్య సంరక్షణ, ముఖ సౌందర్య విషయానికి వస్తే... కొవ్వు పదార్థాలకు దూరంగా, అప్పుడప్పడు కొన్ని ఆరోగ్యమైన ద్రవాలను  తాగుతూఉండాలి.  అందమైన చందమామ లాంటి ముఖం కోసం సహజంగా  దొరికే వస్తువులో ప్యాక్ వేసుకుంటూ ఉండాలి. 

ఫేస్‌ మాస్క్‌
రోజ్‌ వాటర్‌తో ముఖం మెరుస్తూ కనిపిస్తుంది. రోజ్‌ వాటర్, కలబంద, తేనె సహాయంతో మంచి మాస్క్‌ వేసుకుంటే ముఖం కొత్త కళతో మెరిసిపోతుంది.   రోజ్‌ వాటర్‌లో మరికొన్ని సహజసిద్ధమైన ఉత్పత్తులను ఉపయోగించి ఆరోగ్యకరమై ఫేస్‌ మాస్క్‌లను తయారు చేసుకోవచ్చు. ఇంకా  చర్మాన్ని బట్టి పసుపు, శెనగపిండి, పెరుగు, అలోవెరా మిశ్రమాలతో  ప్యాక్‌ వేసుకొని, ఆ తరువాత  ఐస్‌ ముక్కలతో  మృదువుగా మసాజ్‌ చేసుకోవాలి.

కీరా, పైనాపిల్‌ జ్యూస్‌
కీరదోసలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉన్నందు వల్ల చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు  చర్మ సహజత్వాన్ని కాపాడతాయి ఇక  పైనాపిల్‌లో ఉండే బ్రొమెలిన్‌ అనే ఎంజైమ్‌ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వాపులను తగ్గిస్తుంది.

కీర, పైనాపిల్‌ ముక్కలు, తాజా పుదీనా ఆకులు వేసి జ్యూస్‌ చేసుకొని, దీనికి రుచుకోసం నిమ్మరసం, కొద్దిగా  తేనె కలుపు​కొని తాగితే  చర్మం యవ్వనంగా, కాంతిమంతంగా మారుతుంది.ముఖంపై  మంగు మచ్చులాంటివి కూడా  తగ్గుతాయి. 

క్యారెట్‌, బీట్‌రూట్‌ యాపిల్‌ జ్యూస్‌ (ఏబీసీ)
ఆపిల్, బీట్‌రూట్  క్యారెట్ కాంబినేషన్‌లో జ్యూస్‌  తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయి.  యాపిల్‌, క్యారెట్‌లో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, విటమిన్ ఇ  పుష్కలంగా ఉంటే  బీట్‌ రూట్‌  పోషకాలు మయం.శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. కంటి , చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  ముఖ్యంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

ఇంకా
జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. పచ్చని ప్రకృతిలోగడిపితే ఆరోగ్యానికి ఆరోగ్యం మానసిక వికాసం కూడా. అంతేకాదు  స్వచ్ఛమైన గాలి, సూర్యకాంతితో డీ విటమిన్‌ అందుతుంది. అందమైన  చర్మం కోసం  ఇది  చాలా అవసరం. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement