
భారతదేశంలోని అనేక మెట్రోపాలిటన్ నగరాల్లో నివసించే ప్రజలు సరైన నిద్రపోవడం లేదని ఓ సర్వేలో తేలింది. అంటే ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు నిద్రలేమి వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దేశంలోని 59 శాతం మంది ప్రజలు రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారు. మొబైల్ వాడకమే అందుకు కారణం.
నిమ్మరసం రోజూ తాగటం వలన మ్యూకస్ ఉత్పత్తి అదుపులో ఉండి గురకలను తగ్గిస్తుంది. ఒక చెంచా తాజా నిమ్మరసాన్ని రోజు ఉదయాన తాగటం వల్ల ఈ గురకల నుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా, చక్కెర కలపని నిమ్మరసం మీ శ్వాస గొట్టాలను శుభ్రంగా ఉంచి దగ్గు, జలుబులకు దూరంగా ఉంచుతుంది.
స్నానం చేసేటప్పుడు శరీరానికి సోప్ అప్లై చేశాక లూఫాతో రుద్దుతుంటాం. అయితే చాలాసార్లు స్నానం తర్వాత లూఫాను శుభ్రం చేయకుండా వదిలేస్తాం. మరుసటి రోజు మళ్లీ అదే లూఫాతో ఒంటిని రుద్దుతాం. ఇలా చేయడం వల్ల ఆ లూఫాలో పేరుకు పోయిన బాక్టీరియా శరీరాన్ని చేరి అలర్జీ సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి లూఫాను శుభ్రం చేశాకే వాడాలి.
(చదవండి: కోటీశ్వరుడిగా అవ్వడమే శాపమైంది..! మానసిక అనారోగ్యంతో..)