Metropolitan
-
నిమ్మరసంతో గురకకు చెక్‌పెట్టండి..!
భారతదేశంలోని అనేక మెట్రోపాలిటన్ నగరాల్లో నివసించే ప్రజలు సరైన నిద్రపోవడం లేదని ఓ సర్వేలో తేలింది. అంటే ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు నిద్రలేమి వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దేశంలోని 59 శాతం మంది ప్రజలు రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారు. మొబైల్ వాడకమే అందుకు కారణం. నిమ్మరసం రోజూ తాగటం వలన మ్యూకస్ ఉత్పత్తి అదుపులో ఉండి గురకలను తగ్గిస్తుంది. ఒక చెంచా తాజా నిమ్మరసాన్ని రోజు ఉదయాన తాగటం వల్ల ఈ గురకల నుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా, చక్కెర కలపని నిమ్మరసం మీ శ్వాస గొట్టాలను శుభ్రంగా ఉంచి దగ్గు, జలుబులకు దూరంగా ఉంచుతుంది.స్నానం చేసేటప్పుడు శరీరానికి సోప్ అప్లై చేశాక లూఫాతో రుద్దుతుంటాం. అయితే చాలాసార్లు స్నానం తర్వాత లూఫాను శుభ్రం చేయకుండా వదిలేస్తాం. మరుసటి రోజు మళ్లీ అదే లూఫాతో ఒంటిని రుద్దుతాం. ఇలా చేయడం వల్ల ఆ లూఫాలో పేరుకు పోయిన బాక్టీరియా శరీరాన్ని చేరి అలర్జీ సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి లూఫాను శుభ్రం చేశాకే వాడాలి. (చదవండి: కోటీశ్వరుడిగా అవ్వడమే శాపమైంది..! మానసిక అనారోగ్యంతో..) -
మారణాయుధాలతో తిరుగుతున్న ఇద్దరికి జైలు
సాక్షి, చిలకలగూడ: మారణాయుధాలతో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష విధించిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేష్, డీఐ నాగేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ మెట్రోస్టేషన్ ఫుట్‌పాత్‌పై నివసిస్తున్న జంజర్ల ప్రేమ్, లోయర్‌ట్యాంక్‌బండ్ గోశాల ప్రాంతానికి చెందిన కైత నాగరాజు చిత్తుకాగితాలు, ప్లాస్టిక్ బ్యాటిల్స్ ఏరుకుని జీవనం సాగించేవారు. ఈనెల 21న రాత్రి గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని గస్తీ పోలీసులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. అదుపులోకి తీసుకుని సోదా చేయగా వారి వద్ద కత్తి, చాకు లభించాయి. ఈ పెట్టీ కేసులు నమోదు చేసి గురువారం సికింద్రాబాద్ 15వ స్పెషల్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపర్చగా, ఐదు రోజుల చొప్పున జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. (చదవండి: దారి కాచి...దాడి చేసి) -
ఇదీ మన ‘మెట్రో’
ప్రజా రవాణా వ్యవస్థల్లో అంతర్భాగమవుతున్న మెట్రో రైళ్లు మహా నగరాల అవసరాలకు దీటుగా మెట్రో రూపకల్పన లక్షలాది మంది ప్రజలకు ఏసీ బోగీల్లో సౌకర్యవంత ప్రయాణం ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నైల్లో ఇప్పటికే పరుగులు హైదరాబాద్‌లో వచ్చే ఏడాది అందుబాటులోకి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న మెట్రో ప్రస్తుతం దేశంలో ‘మెట్రో’ శకం నడుస్తోంది. మెట్రో రైలు.. మహానగరాల్లోని సాధారణ ప్రజల జీవితాల్లో ఓ అంతర్భాగమైపోయింది. మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రతిరోజూ లక్షలాది మంది ఆమ్ఆద్మీలను గమ్యస్థానం చేరుస్తున్న మెట్రో ఇప్పుడు ప్రజా రవాణా వ్యవస్థలకు కొత్త దారి చూపింది. మహానగరాల అవసరాలకు దీటుగా రూపుదిద్దుకున్న మెట్రో రైలు.. సాధారణ ప్రజలకు ఏసీ బోగీల్లో సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తోంది. ట్రాఫిక్ అనే పద్మవ్యూహంలో చిక్కుకుంటున్న నగరవాసులను సులువుగా గమ్యస్థానాలకు చేర్చి విలువైన పనిగంటలను మిగులుస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థను సరికొత్తగా ఆవిష్కరిస్తూ మరే రవాణా సాధనం తనకు సాటి రాదని, రాలేదని మెట్రో రైలు రుజువు చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు బెంగళూరు, ముంబై, చెన్నై మహానగరాల్లో ఇప్పుటికే మెట్రో రైళ్లు పరుగెడుతున్నాయి. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో మెట్రో రైలు ప్రజలకు అందుబాటులోకి రానుంది. దేశంలోని ఇతర మహా నగరాలకు దీటుగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లోని మెట్రో రైళ్లకంటే ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది మన మెట్రో రైలు. ఒకే పిల్లర్‌పై మెట్రో రైలు ట్రాక్, స్టేషన్ల నిర్మాణం, డ్రైవర్ లేని సాంకేతికత, కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థ, ప్రీకాస్ట్ విధానం, పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో పనులు ఇలా చెప్పుకుంటూపోతే హైదరాబాద్ మెట్రోకు అన్నీ ప్రత్యేకతలే. ప్రస్తుతం వేగంగా హైదరాబాద్ మెట్రో నిర్మాణం జరుగుతున్న తరుణంలో పలు మహానగరాల్లో అందుబాటులో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టులతోపాటు మన హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విశేషాలపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్.. - సాక్షి, హైదరాబాద్ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ►2012 జూన్‌లో హైదరాబాద్ మెట్రో పనులు ప్రారంభమయ్యాయి. ►ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.14,132 కోట్లు. కేంద్ర ప్రభుత్వం 10 శాతం, మరో 90 శాతం నిర్మాణ వ్యయాన్ని ఎల్అండ్టీ సంస్థ భరించనున్నాయి. మరో రూ.1,980 కోట్లను తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ, రహదారుల విస్తరణకు ఖర్చు చేస్తోంది. ►ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా, నాగోల్-శిల్పారామం రూట్లలో మొత్తం 72 కి.మీ. మార్గంలో పనులు చేపట్టారు. ►2017 జూన్ నాటికి మొత్తం 72 కి.మీ. మార్గంలో మెట్రో పనులు పూర్తికానున్నాయి. ►ప్రారంభంలో సుమారు 18 లక్షలు, 2020 నాటికి 24 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణించనున్నారు. ►కనీస చార్జీ రూ.10, గరిష్ట చార్జీ రూ.25 ఉండే అవకాశం. ►తొలిదశ కింద మియాపూర్-పంజాగుట్ట మార్గంలో వచ్చే ఏడాది ప్రారంభంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ►ప్రతి రైలుకు మూడు బోగీలు ఉంటాయి. వెయ్యి మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ►మొత్తం మూడు కారిడార్లలో 57 మెట్రో రైళ్లు 72 కి.మీ. మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. ►మియాపూర్, ఉప్పల్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో మూడు మెట్రో రైలు డిపోలు ఏర్పాటు చేయనున్నారు ►3 కారిడార్లలో రాకపోకలు సాగించే మెట్రో రైళ్లను ఉప్పల్ మెట్రో డిపోలోని ఆపరేషన్ కంట్రోల్ కేంద్రం నుంచి నియంత్రిస్తారు. ‘మెట్రో’ ఇంజనీరింగ్ అద్భుతం హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ►హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ప్రపంచంలోనే తొలిసారిగా పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన అతిపెద్ద మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టు. ఒంటిస్తంభం పిల్లర్లపై పక్షి రెక్కల ఆకృతిలో ఏర్పాటు చేసిన మెట్రో రైలు స్టేషన్లు ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తితో హైదరాబాద్ విశ్వనగరం కావడం తథ్యం. హా నిర్మాణ రంగంలో ఆధునిక విప్లవానికి ఈ ప్రాజెక్టు నాంది. ప్రాజెక్టులో 85 శాతం నిర్మాణాలు కుత్బుల్లాపూర్, ఉప్పల్ కాస్టింగ్ యార్డుల్లో ప్రీకాస్ట్ విధానంలో రూపొందించినవే కావడం విశేషం. ప్రీకాస్ట్ విధానం వినియోగించడం.. రద్దీ రహదారులపై పనులు చేపట్టకపోవడంతో ట్రాఫిక్ ఇక్కట్లు బాగా తగ్గాయి. ► డ్రైవర్ లేని సాంకేతికత, కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థలు దేశంలోని ఇతర మెట్రో ప్రాజెక్టుల్లో అందుబాటులో లేవు. హైదరాబాద్ నగరంలోనే తొలిసారిగా ఈ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నాం. ► ప్రాజెక్టు పనులతో మతపరమైన, చారిత్రక కట్టడాలు దెబ్బ తినకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సుమారు పది సంస్థలు మెట్రో పనుల్లో భాగం పంచుకుంటున్నాయి. ► ఒక్కో మెట్రో రైలు ట్రాక్ ఏడు బస్సు లైన్లు, 24 కార్ లైన్లతో సమానం. ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో తక్కువ విస్తీర్ణంలోనే పనులు చేపడుతున్నాం. పిల్లర్ల మందం 2 మీటర్ల విస్తీర్ణానికంటే లోపుగానే ఉంది. ►మెట్రో రైలుకు బ్రేక్ వేసినప్పుడు ఉత్పన్నమయ్యే శక్తి నుంచే విద్యుత్ ఉత్పత్తి చేసి మెట్రో అవసరాలను 35 శాతం వరకు తీర్చుకునే అవకాశం ఉంది. ► మెట్రో ప్రయాణ అవసరాలను తీర్చే ప్రాజెక్టు మాత్రమే కాదు ఇది నగర పునర్నిర్మాణ ప్రాజెక్టు. ప్రజలకు ఉపయుక్తమైనది, పర్యావరణానికి హాని తలపెట్టని హరిత ప్రాజెక్టు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఇలా అన్ని వర్గాలకు అవసరమైన సకల సౌకర్యాలు మెట్రోలో అంతర్భాగమై ఉన్నాయి. ► ప్రధాన రైల్వే స్టేషన్లు, ఎంఎంటీఎస్, బస్స్టేషన్లను మెట్రో రైలు స్టేషన్లతో అనుసంధానించి ట్రాఫిక్ రద్దీలో నగరవాసులు చిక్కుకుపోకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. మెట్రో స్టేషన్లకు సమీప కాలనీలకు చేరుకునేందుకు వీలుగా నిరంతరం మెర్రీ గో అరౌండ్ బస్సులు అందుబాటులో ఉంటాయి. ► మెట్రో స్టేషన్లకు సమీపంలో ఉన్న ప్రముఖ పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, కార్యాలయాలకు ఫుట్ఓవర్ బ్రిడ్జీ(ఆకాశ వంతెనలు)లతో అనుసంధానం. ► హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు నిర్మాణ దశలోనే గ్లోబల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టు ఆఫ్ ది ఇయర్-2013(న్యూయార్క్), రాయల్ సొసైటీ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ గోల్డ్ అవార్డు వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకోవడం విశేషం. ముంబైలో.. ►ముంబైలో ప్రజా రవాణాకు రైళ్లే కీలకం. అక్కడ మెట్రో రైళ్లలో రోజువారీగా 2.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ► {పస్తుతం 11.4 కి.మీ. మార్గంలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ► తొలిదశ మెట్రో పనుల పూర్తికి ఎనిమిదేళ్ల సమయం పట్టింది. ►కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఢిల్లీ మెట్రో ►1998 అక్టోబర్‌లో ఢిల్లీ మెట్రో రైలు పనులు ప్రారంభమయ్యాయి. ►2002 డిసెంబర్లో 25 కి.మీ. మార్గంలో తొలిదశ అందుబాటులోకి వచ్చింది. ► {పస్తుతం 194 కి.మీ. మార్గంలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ►నిత్యం 6 మార్గాల్లో 24 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ►డీఎంఆర్సీ సంస్థ ఈ పనులను చేపట్టింది. బెంగళూరులో.. ►2015 మే నెలలో మెట్రో రైలు ప్రారంభమైంది. ►బయ్యనహళ్లి నుంచి ఎంజీ రోడ్ వరకు మెట్రో పరుగులు తీస్తోంది. ► {పస్తుతానికి 8.5 కి.మీ. మార్గంలో పనులు పూర్తిచేసేందుకు నాలుగేళ్ల సమయం పట్టింది. ►కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టు పనులు చేపట్టాయి. చెన్నైలో.. ►చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు పనులు 2009 జూన్‌లో ప్రారంభమయ్యాయి. ►ఈ ఏడాది జూన్ 29 నాటికి తొలిదశ పూర్తయ్యింది. ►తొలిదశలో కోయంబేడు-ఆలందూర్ మధ్య 10 కి.మీ. మార్గంలో 27 మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ►నిత్యం సుమారు 3 లక్షల మంది ఈ రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. ►మొత్తం 45 కి.మీ. మార్గంలో మెట్రో పనులు చేపడుతున్నారు. ఇందులో 21 కి.మీ. మేర ఎలివేటెడ్ (ఆకాశమార్గం), మరో 24 కి.మీ. భూగర్భ మార్గం. ►{పాజెక్టు అంచనా వ్యయం రూ.14,750 కోట్లు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 41 శాతం, 59 శాతం జైకా బ్యాంకు రుణంతో పనులు చేపట్టారు. -
ఈ - బడ్జెట్
రాష్ట్రంలో తొలిసారిగా తుమకూరు పాలికెలో ప్రవేశపెట్టిన వైనం ల్యాప్‌టాప్‌లో బడ్జెట్ వివరాలు పరిశీలించిన సభ్యులు తుమకూరు : రాష్ట్రంలో తొలిసారిగా తుమకూరు నగరపాలికెలో ఈ-బడ్జెట్‌ను (కాగిత రహిత) ప్రవేశపెట్టారు. మంగళవారం ఉదయం పాలికెలో రూ. 2కోట్లు మిగులుతో ఈ బడ్జెట్‌ను పాలికె ఆర్థిక స్థాయీ సమితి అధ్యక్షుడు నగేష్ బావికట్టె ప్రవేశపెట్టారు. కాగిత రహితంగా ఉండడంతో ల్యాప్‌టాప్‌లో ఉన్న బడ్జెట్ అంశాలను ఆయన సభ్యులకు చదివి వినిపించారు. అదే సమయంలో సభ్యులు కూడా వారి వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌లలో బడ్జెట్ అంశాలను పరిశీలించారు. ఈ తరహా బడ్జెట్‌నుప్రవేశపెట్టడంపై సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ప్రవేశపెట్టిన తుమకూరు పాలికె 2015-16 బడ్జెట్లో నీటి సరఫరా, చెత్త సేకరణ, విభజన, రోడ్ల అభివృధ, యూజీడీ తదితర అభివృ్ధ పనులకు పెద్ద పీట వేశారు. పాలికెకు పన్నుల రూపంలో ఆదాయం పెంచుకునేందుకు చర్యలు చేపట్టనున్నారు. నిరుపేదలకు, వసతి లేని వారికి నైట్ షెల్టర్స్‌ను ఏర్పాటు చేయడం కోసం రూ. 50 లక్షలను కేటాయించారు. నగర పాలికె అభివృ్ధ కోసం ఆస్తి పన్ను, దుకాణాల సముదాయాలపైన అద్దె పెంచనున్నారు. పాలికెకు వచ్చే ఆదాయంలో పేదలకు, మురికివాడల్లో నివసించే వారికి మూలభూత సౌకర్యాలను కల్పించేందుకు కృష చేయనున్నారు. ఈ-బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంపై సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ తరహా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అలాగే ల్యాప్‌టాప్‌ల వినియోగం గురించి తెలియని పలువురు సభ్యులు తమకు ప్రత్యేకంగా శిక్షణను ఇప్పించాలని మేయర్ లలితారవీష్‌ను కోరారు. దీనిపై మేయర్ మాట్లాడుతూ.. పాలికెలో కాగిత రహిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వలన స్టేషనరీ ఖర్చు తగ్గుతోందని అన్నారు. సమావేశంలో సభ్యులతో పాటు పాలికె కమిషనర్ హర్షద్ రసూల్ షరీఫ్, ఉప మేయర్ వెంకటేష్, నయాబ్, విపక్ష నేత సురేంద్ర పాల్గొన్నారు. -
ధనాధన్..
దీపావళికి గ్రేటర్లో పెరిగిన శబ్ద కాలుష్యం అత్యధికంగా ప్రగతినగర్‌లో 85 డెసిబుళ్లు నమోదు వివరాలు సేకరించిన పీసీబీ వాయు కాలుష్యంలో మనది మూడో స్థానం సాక్షి, సిటీబ్యూరో/సనత్‌నగ ర్: దీపావళి ఢాం..ఢాం శబ్దాలు సిటీజనుల గూబ గుయ్మనిపించాయి. గత ఏడాదితో పోలిస్తే మహానగరంలో శబ్ద కాలుష్య స్థాయి నాలుగు డెసిబుళ్లు అధికంగా నమోదైంది. నివాస, పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాల్లో దీపావళి రోజున వెలువడిన శబ్ద కాలుష్య ప్రమాణాలను కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) శుక్రవారం విడుదల చేసింది. అబిడ్స్, గచ్చిబౌలి, కూకట్పల్లి, తార్నాక, ప్యారడైజ్, జీడిమెట్ల, జూ పార్క్, పంజగుట్ట, జూబ్లీహిల్స్, ప్రగతినగర్, ఉప్పల్ ప్రాంతాల్లో కంటిన్యూ యాంబియంట్ సౌండ్ మెజర్మెంట్ పరికరాల ద్వారా దీపావళి రోజున (గురువారం) సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు (శుక్రవారం) ఉదయం 6 గంటల వరకు ధ్వని కాలుష్య ప్రమాణాలను నమోదు చేశారు. నివాస ప్రాంతాల్లోనే టపాసుల మోతతో ఎక్కువ శబ్దాలు వెలువడినట్లుగా పీసీబీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నగర శివారుల్లోని ప్రగతినగర్ (కూకట్పల్లి జేఎన్టీయూ ఎదురుగా)లో అత్యధికంగా 85.5 డెసిబుళ్ల ధ్వని కాలుష్యం నమోదైంది. అబిడ్స్‌లోనూ ఈసారి బాణసంచా పేలుళ్లు 82 డెసిబుళ్ల శబ్దంతో శ్రుతిమించాయి. సాధారణంగా 55 డెసిబుళ్ల కంటే అధిక శబ్దాలు వింటే మనుషులు వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో టపాసుల మోతతో శబ్ద కాలుష్యం అంతకంటే అధికంగా నమోదైంది. ఉప్పల్‌లో 77.6 డెసిబుళ్లు, ప్యారడైజ్, పంజగుట్ట, కూకట్‌పల్లిలో 69 డెసిబుళ్లు, జీడిమెట్లలో 60, జూ పార్క్‌లో 56, తార్నాక, జూబ్లీహిల్స్‌లో 53, గచ్చిబౌలిలో 52 డెసిబుళ్లశబ్ద కాలుష్యం నమోదైంది. గత ఏడాది దీపావళి రోజున గ్రేటర్ పరిధిలో సగటున 71 డెసిబుళ్ల ధ్వని కాలుష్యం నమోదు కాగా.. ఈసారి 75 డెసిబుళ్లకు చేరుకుంది. అంటే నాలుగు డెసిబుళ్లు పెరిగిందన్నమాట. వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల్లో పేలని టపాసులు పీసీబీ గణాంకాలను బట్టి చూస్తే వాణిజ్య ప్రాంతాల్లో దీపావళి టపాసుల మోత అంతగా లేదని తేలింది. అబిడ్స్ మినహా మిగిలిన వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లో శబ్ద కాలుష్య ప్రమాణాలు మోస్తరుగానే నమోదయ్యాయి. ప్యారడైజ్ ప్రాంతంలో గత ఏడాది సగటున 82 డెసిబుల్స్ నమోదు కాగా, ఈసారి 69కి తగ్గింది. పంజగుట్ట చౌరస్తాలో సైతం శబ్ద కాలుష్యం తక్కువగానే నమోదైనట్లు పీసీబీ గణాంకాలు చెబుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతమైన ఉప్పల్‌లో రెండు డెసిబుల్స్ తగ్గింది. గత ఏడాది సగటున 79 డెసిబుల్స్ ఉండగా, ఈ ఏడాది 77.6కు తగ్గింది. నిశ్శబ్ద జోన్లలోనూ మోత నిశ్శబ్ద మండలం (సెలైంట్ జోన్)గా పరిగణించే గచ్చిబౌలి, జూ పార్క్ ప్రాంతాల్లో సాధారణంగా ధ్వని కాలుష్యం రాత్రి వేళల్లో 40 డెసిబుళ్లు మించరాదు. దీపావళి రోజున జూ పార్క్ వద్ద 56, గచ్చిబౌలిలో 52 డెసిబుళ్ల శబ్ద కాలుష్యం నమోదవడం గమనార్హం. ఈ మోతతో జూ పార్క్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉన్న వన్యమృగాల జీవనశైలిలో పెనుమార్పులు వచ్చే ప్రమాదం ఉందని వెటర్నరీ వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. మనది మూడో స్థానం మెట్రో నగరాలతో పోలిస్తే వాయు కాలుష్యంలో గ్రేటర్ నగరం మూడో స్థానంలో నిలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సాధారణ రోజులతో పోలిస్తే తొమ్మిది రెట్లు పెరిగిందని వాతావరణ శాఖ అంచనా. బాణసంచా పేలుళ్లతో నైట్రోజన్ డై ఆక్సైడ్,సల్ఫర్ డైఆక్సైడ్ వాయువులు గాలిలో విపరీతంగా కలిసిపోయాయి. ఊపిరితిత్తులకు పొగబెట్టే ఈ కాలుష్య కారకాలు ఒక క్యూబిక్ మీటరు గాలిలో సుమారు 531 మైక్రోగ్రాములకు చేరడం గమనార్హం. చెన్నైలో క్యూబిక్ మీటరు గాలిలో కాలుష్య కారకాలు 320 మైక్రోగ్రాములు, గ్రేటర్లో క్యూబిక్ మీటరు గాలిలో 302 మైక్రోగ్రాములు, బెంగళూరులో 239 మైక్రోగ్రాములకు చేరినట్లు అంచనా వేస్తున్నాయి. వాయు కాలుష్య కారకాల వారీగా పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపాయి. -
మెట్రోపొలిస్ సదస్సు ప్రారంభం
-
తిరుపతిలో సైబర్ హర్రర్
ఆందోళనలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు తిరుపతి క్రైం: ఇప్పటివరకు దేశంలోని ప్రధాన నగరాలు, మెట్రో పాలిటన్ సిటీలకు పరిమితమైన సైబర్ నేరాలు ఇప్పుడిప్పుడే తిరుపతి పట్టణంలోకీ తొంగి చూస్తున్నా యి. సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమాయక ప్రజలను రకరకాలుగా మోసగిస్తున్నారు. లక్షల రూపాయలు బహుమతిగా వచ్చాయంటూ సెల్ఫోన్లకు మెసేజ్‌లు పంపుతారు. ఆ మొత్తం పొందాలంటే ముందుగా కొంత నగదును చెల్లించాలని నమ్మబలుకుతారు. దీన్ని నమ్మి డబ్బు ఇచ్చిన వారికి ఎలాంటి బ హుమతి సొమ్మూ రాదు. లేదంటే, బహుమతి సొమ్ము పంపుతాం, బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ పంపించమని కోరుతారు. ఈ వివరాలు పంపారంటే, ఇక అంతే.. వారి అకౌంట్లోని మొత్తం హుష్‌కాక్.. తిరుపతి పరిసర ప్రాంతాల్లో చాలామంది యువతీ యువకులు ఇలాంటి మెసేజ్‌ల ద్వారా మోసపోయారని పోలీసులు చెబుతున్నారు. బయటకు తెలిస్తే అవమానంగా భావించి కొంతమంది లోలోపలే కుమిలిపోతున్నారు. ఇలాంటి ఘటనే ఇటీవల తిరుచానూరులో వెలుగు చూసింది. నైజీరియా దేశానికి చెందిన ఇమ్మానుయేల్ ఈజీగా డబ్బు సంపాదించడం కోసం మహిళ పేరుతో తిరుపతికి చెందిన రియల్టర్ వెంకటరమణనాయుడును ఈ మెయిల్ ద్వారా ముగ్గులోకి లాగాడు. అతని నుంచి రూ.3.61 లక్షలు తన అకౌంట్లోకి వేయించుకున్నాడు. మోసపోయానని తెలుసుకున్న వెంకటరమణనాయుడు ఇమ్మానుయేల్‌ను తెలివిగా తిరుపతికి రప్పించి నిర్బంధించాడు. చివరకూ ఇద్దరూ కటకటాల వెనక్కు వెళ్లారు. పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన సైబర్ నేరాలు ఇప్పుడు తిరుపతితోపాటు పరిసర ప్రాంతాలకు పాకడంపై పోలీసులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సైబర్ నేరాలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. కాగా ఇలాంటి నేరాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే. మెయిల్స్, మెసేజ్‌లను చూసి మోసపోవద్దు ఫోన్ మెసేజ్‌లను, మొయిల్స్‌ను చూసి మోసపోవద్దండి. ఈజీగా మనీ సంపాదించేందుకు కొంతమంది క్రిమినల్స్ ఇలాంటి వాటిని ఎరగా వాడుకుంటున్నారు. అలాంటి చీటింగ్‌లకు మోసపోకూడదు. ఎవరైనా ఇలాంటి మోసానికి గురైతే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకుని వస్తే విచారణ చేసి సైబర్నేరగాళ్లను పట్టుకుంటాం. -ఎస్వీ.రాజశేఖర్‌బాబు, ఎస్పీ, తిరుపతి అర్బన్ జిల్లా -
నెల్లూరును మహానగరం చేస్తా
రాబోయే రోజుల్లో నెల్లూరును మహానగరంగా తీర్చిదిద్దుతానని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. స్థానిక వీఆర్ కళాశాల మైదానంలో బుధవారం జరిగిన ప్రజాగర్జనలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్నన్ని వనరులు మరెక్కడా లేవన్నారు. ఈ వనరులను వినియోగించి నగరాన్ని పారిశ్రామిక నగరంగా మారుస్తామన్నారు. అవసరమైతే ఒకటి, రెండు రింగ్ రోడ్లను నిర్మిస్తామన్నారు. తన హయాంలో ఇఫ్కోకు స్థలాన్ని కేటాయించామన్నారు. దాన్ని రానివ్వకుండా చేసిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. నగరంలో ఎయిర్‌పోర్ట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. చెన్నైకి దగ్గరగా ఉండటంతో జిల్లాను పారిశ్రామిక కారిడార్‌గా రూపొందిస్తామన్నారు. కృష్ణపట్నం, దుగరాజపట్నం పోర్టుల ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. మ త్స్యకారుల వేటకు సెలవులు ప్రకటిం చిన రోజుల్లో 100 కేజీలు బియ్యం, నగదు ఇస్తామన్నారు. మత్స్యకార హార్బర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పెన్నా, కండలేరు, సోమశిల ఉత్తరకాలువ అభివృద్ధి పనులు చేసి వ్యవసాయానికి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. ఏళ్ల తరబడి పార్టీ జెండాలను భుజాన మోసిన వారికి అన్యాయం చేయబోమన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు నిజాయితీ గల ఇతర పార్టీల నాయకులను తీసుకుంటున్నామని, దీన్ని కార్యకర్తలు అర్థం చేసుకోవాలన్నారు. చరిత్ర తిరగరాసే ఈ సమయంలో విజ్ఞతతో వ్యవహరించాలని కోరారు. పార్టీలో చేరిక చంద్రబాబు సమక్షంలో సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి టీడీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి బాబు పార్టీలోకి ఆహ్వానించారు. వీరి అనుచరులు కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. -
రూ.417 కోట్లు తినేశారు!
సాక్షి, చెన్నై:చెన్నై మహానగర కార్పొరేషన్ పాలక మండలి సమావేశం శనివారం ఉదయం రిప్పన్ బిల్డింగ్‌లో జరిగింది. మేయర్ సైదై దురైస్వామి, డెప్యూటీ మేయర్ బెంజిమిన్, కమిషనర్ విక్రమ్ కపూర్ తదితరులు హాజరయ్యూరు. ప్రశ్నోత్తరాల అనంతరం మేయర్ ప్రత్యేక ప్రకటన చేశారు. డీఎంకే హయూంలో రోడ్ల పేరుతో రూ.417 కోట్లు తినేశారని ఆరోపించడం వివాదానికి దారి తీసింది. డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా మేయర్ పట్టించుకోకుండా తన ప్రకటనను చదివారు. రోడ్లు వేసినట్లు డీఎంకే చూపిందని, అయితే అవి ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. దీనిపై పూర్తిస్థాయి పరిశీలన జరుగుతోందని వెల్లడించారు. ఇంతలో డీఎంకే సభ్యులు బోస్ తదితరులు జోక్యం చేసుకున్నారు. ఈ అవినీతిపై రిటైర్డ్ జడ్జితో విచారణకు సిద్ధమా అని మేయర్‌ను ప్రశ్నించారు. ఈ క్రమంలో డీఎంకే, అన్నాడీఎంకే సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రిటైర్డ్ జడ్జితో కాదని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించిందుకు తాము సిద్ధమని, ఇందుకు మీరు సిద్ధమేనా అని ప్రశ్నించారు. వాగ్వాదం ముదరడంతో సభను వాకౌట్ చేస్తున్నట్లు డీఎంకే ప్రకటించింది. విచారణను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేని వాళ్లందరూ తమకు సవాళ్లు విసురుతున్నారంటూ మేయర్ ధ్వజమెత్తారు. రూ.1200 కోట్లతో పనులు చివరగా సమావేశంలో 72 తీర్మానాలకు ఆమోదముద్ర వేశారు. రూ.1200 కోట్లతో 10,118 రోడ్లను పునరుద్ధరించేందుకు నిర్ణయించారు. ఐదేళ్ల కాలంలో రోడ్ల అభివృద్ధికి డీఎంకే రూ.600 కోట్లు మాత్రమే కేటాయించిందని, ఇందులో రూ.417 కోట్లు మింగేసిందని మేయర్ ఆరోపించారు. తాను మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నగర పరిధిలోని 30,560 రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టానని వివరించారు. ఇప్పటి వరకు రూ.1150 కోట్లతో 8146 రోడ్లను పునరుద్ధరించామని పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.1200 కోట్లతో 10,118 రోడ్లను పునరుద్ధరించనున్నామని ప్రకటించారు. నగరంలో నిబంధలనకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై కొరడా ఝుళిపించనున్నామని స్పష్టం చేశారు. రెండు వందలకుపైగా భవనాలకు నోటీసులు జారీ చేశామని, వివరణ వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
రగడ..
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరే షన్ సర్వసభ్య సమావేశం ఆద్యంతం నిరసనల తో హోరెత్తింది. సభ్యుల ఆందోళన, నినాదాల తో సమావేశం హాలు దద్దరిల్లింది. విలీనాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యుల మేయర్ పోడియం ముట్టడి, మేయర్‌కు వ్యతిరేకంగా బీజేపీ నినాదాలతో సభ హోరెత్తింది. గ్రేటర్లో 35 శివారు గ్రామాలను విలీనం చేయడాన్ని సమావేశం వ్యతిరేకించింది. గత సమావేశంలో 15 గ్రామాల విలీనాన్ని కౌన్సిల్ వ్యతిరేకించినా.. లెక్కచేయకుండా వాటితో సహా మొత్తం 35 గ్రామపంచాయతీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ జీవోలు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖం డించింది. సోమవారం ఉదయం సర్వసభ్య సమావేశం ప్రారంభం కాగానే రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల సభ్యులు ఒక్కసారిగా ఎదురుదాడికి దిగారు. సభ్యులంతా ముక్తకం ఠంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే నగరాభివృద్ధిని గాలికి వది లారని, కొత్తగా గ్రామాల విలీనం ద్వారా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ఎలా చేపడతారని సభ్యులు నిలదీశారు. నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారని ప్రశ్నించారు. విలీనం సందర్భంగా జీహెచ్ఎంసీకి ప్రత్యేకప్యాకేజీ కింద ఎన్ని నిధులిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విలీనం వల్ల కొత్తగా అభివృద్ధి మాట ఎలా ఉన్నా ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజె క్టులకు నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఉందని సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. ‘స్టేటస్ కో’కు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా కోరారు. ప్రత్యేక నిధులు.. తదితర అంశాల్లో స్పష్టత ఇస్తూ శ్వేతపత్రం విడుదల చేసేంతదాకా.. జీహెచ్ఎంసీ నిధులతో సదరు గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టరాదని తీర్మానించారు. గ్రామాల విలీనం వల్ల జీహెచ్ఎంసీపై మోయలేని అదనపు భారం పడుతుందే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. విలీనగ్రామాల ప్రజలపై అదనపు భారాలు పడటం తప్ప సదుపాయాలు సమకూరవన్నారు. ఈ విలీనం వల్ల జేఎన్ఎన్యూఆర్ఎం రెండో దశ ద్వారా వచ్చే నిధులు, స్లమ్ ఫ్రీ సిటీ కోసం వచ్చే రాజీవ్ ఆవాస్ యోజన నిధులు ఆగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆ పథకాలు మెట్రోపాలిటన్ నగరాలకు వర్తించనందున ఆ నిధులందకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేటర్లందరం కలిసి సీఎం దగ్గరకు వెళ్లి విలీనాన్ని రద్దు చేయాల్సిందిగా కోరదామన్నారు.