ప్రముఖ మోడల్, నటి సోనాలి బింద్రే(Sonali Bendre) తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించి వేలాది అభిమానులను సొంతం చేసుకుంది. ఆమెకు బాలీవుడ్ నటిగానే ఎక్కువగా గుర్తింపు లభించింది. ఎందుకంటే ఎక్కువ సినిమాలు హిందీలోనే చేసింది. ఇక మన తెలుగులో అగ్ర హీరోల సరసన నటించి మంచి హిట్‌లతో ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. అంతేగాదు సోనాలి అత్యంత అందమైన నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అదీగాక చూడటానికి కుందనపు బొమ్మల ఆకర్షణీయంగా ఉంటుంది. ఓ ఇంటర్వ్వూలో ఆమె గ్లామర్ రహస్యం(beauty secret) గురించి షేర్ చేసుకంది. తన మెరిసే చర్మం రహస్యం ఆ మొక్కేనని అంటోంది.. మన భారతీయ సంప్రదాయంలో పూజలందుకునే ఈ మొక్క ఔషధ గుణాలను అందరూ ఉపయోగించుకోవాలని చెబుతోంది. అదేంటో చూద్దామా..!.
ఐదు పదుల వయసులో అంతే గ్లామర్‌తో అభిమానులను ఫిదా చేస్తుంటారామె. ఆమె ముఖంలో ఉట్టిపడే కాంతి ఎవ్వరినైనా కట్టిపడేస్తుంది. అంతలా చర్మం ప్రకాశవంతంగా కనిపించేందుకు స్కిన్ కేర్ తీసుకుంటానని అన్నారు. మన భారతీయ సంప్రదాయంలో పూజలందుకునే వేప మొక్క తన మెరిసే చర్మానికి కారణమంటుంది.
తాను రోజకి రెండసార్లు వేప ఉత్పత్తుల(Neem products)తో చర్మాన్ని శుభ్రపరుస్తానని అంటున్నారు. దీంతోపాటు తాను చేసే వ్యాయమం కూడా చర్మాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేయడంలో ఉపకరిస్తుందని చెబుతున్నారు. "మనం భారతీయులం కచ్చితంగా ఈ వేప మొక్క గుణాలను పిల్లలకు తెలియజేయాలి. ఈ మొక్కచేసే మాయాజాలం గురించి సవివరంగా చెప్పాలి.
వేప చర్మానికే కాదు ఆరోగ్యానికి కూడా మంచిదే. తేమ వాతావరణంలో ఉండే వాళ్లకు వేప చాలా బాగా పనిచేస్తుంది. అయితే నేను బ్యూటీ ప్రొడక్ట్(Beauty Products)లను ఎక్కవగా ఉపయోగించను తరచుగా మాత్రం ముఖాన్ని శుభ్రపరుచుకోవడానికి బద్దకించను. అలాగే వీటి తోపాటు ఆర్యోగకరమైన ఆహారం తప్పనిసరిగా తీసుకుంటాను." అని చెబుతున్నారు సోనాలి.
వేపతో కలిగే లాభాల..
వేపని 'వండర్ హెర్బ్'గా చెబుతుంటారు. ఇది చర్మం, జుట్టు, రక్తం తదితర శరీర భాగాలన్నింటి శ్రేయస్సుకి సమర్థవంతమైనది.
జీవశాస్త్రపరంగా దాదాపు 130 రకాలుగా ఉపయోగపడుతుందట.
2018లో ది హిమాలయ డ్రగ్ కంపెనీ వేప చర్మానికి ఒనగూర్చే ప్రయోజనాలు గురించి సవివరంగా వెల్లడించింది.
ఆయుర్వేదంలో వేప చాలా ప్రభావవంతమైన మొటిమల నివారిణి.
చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో కీలకంగా ఉంటుందట
అలాగే బ్లాక్/వైట్ హెడ్స్‌ని నివారిస్తుంది.
దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా, హానికరమైన ప్రభావాలను తగ్గిస్తుందట.
దద్దుర్లు, కాలిన గాయాల తాలుకా ఇన్ఫెక్షన్‌లను తగ్గిస్తుంది.
ముఖ్యంగా తేలికపాటి చర్మ సమస్యలను సమూలంగా నివారిస్తుందని చెబుతున్నారు చర్మ సంరక్షణ నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివారాలను వ్యక్తిగత వైద్య నిపుణలను సంప్రదించి అనుసరించడం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment