ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఈ పండుగ సీజన్‌లో సరసమైన ధరలో ఓ మంచి ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలని కొందరు ఆలోచించవచ్చు. అలాంటి వారు ఏ కారు కొనాలి? దాని ధర ఎంత ఉంటుందనే సమాచారం కోసం వెతికే అవకాశం ఉంది. ఇలాంటి వారి సందేహాలకు సమాధానమే ఈ కథనం..
ఎంజీ విండ్సర్ ఈవీ
ఇటీవల భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త 'ఎంజీ విండ్సర్' పండుగ సీజన్‌లో కొనుగోలు చేయదగిన ఎలక్ట్రిక్ కారు. దీని ధర రూ.13.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే ఈ కారును బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్ కింద తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇందులోని 38 కిలోవాట్ బ్యాటరీ 332 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది.
ఎంజీ కామెట్ ఈవీ
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న సరసమైన ఎలక్ట్రిక్ కారు ఈ ఎంజీ కామెట్ ఈవీ. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.99 లక్షలు. అయితే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్ కింద, రూ. 4.99 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. పరిమాణంలో చిన్నదిగా ఉన్న ఈ ఎలక్ట్రిక్ కారు 17.3 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 230 కిమీ రేంజ్ అందిస్తుంది.
టాటా టియాగో ఈవీ
టాటా కంపెనీకి చెందిన టియాగో ఈవీ నాలుగు వేరియంట్‌లు, రెండు బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటితో పాటు.. ప్రీమియం అనుభవం కోసం హర్మాన్ సౌండ్ సిస్టమ్‌తో కూడిన టెక్-ఫార్వర్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా పొందుతుంది.
టాటా పంచ్ ఈవీ
దేశంలో అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా ఉన్న టాటా పంచ్ ఈవీ కూడా పండుగ సీజన్‌లో కొనుగోలు చేయదగిన బెస్ట్ ఎలక్ట్రిక్ కారు. ఇది ప్రస్తుతం పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. స్మార్ట్, స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ ప్లస్ అనే వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు 25 కిలోవాట్, 35 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. ఇవి వరుసగా 265 కిమీ మరియు 365 కిమీ రేంజ్ అందిస్తాయి. దీని ధరలు రూ. 9.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.
ఇదీ చదవండి: మనసు మార్చుకున్న నిఖిల్ కామత్!.. అప్పుడు అద్దె ఇల్లే బెస్ట్ అని..
సిట్రోయెన్ ఈసీ3
ఫ్రెంచ్ బ్రాండ్ అయిన సిట్రోయెన్ ఈసీ3 ప్రారంభ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 11.61 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 29.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ చార్జితో 320 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారులో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 10.2 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment