పండుగల సీజన్పై బ్యాంకుల దృష్టి..
• గృహ రుణాలపై ఎస్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు
• ఐసీఐసీఐ బ్యాంక్ ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం
న్యూఢిల్లీ: పండుగల సీజన్‌లో వ్యాపారం పెంపుపై ప్రభుత్వ-ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్ దృష్టి సారించారుు. వినియోగదారులను ఆకర్షించే లక్ష్యంతో రేటు తగ్గింపుసహా పలు ఆఫర్‌లను ప్రకటించారుు.
ఎస్‌బీఐ ఇలా...
రూ.75 లక్షల వరకూ గృహ రుణాలపై వడ్డీరేటును 0.15 శాతం తగ్గించింది. ఎస్‌బీఐ గృహ రుణం 9.15 శాతానికి లభిస్తుండగా, మహిళల విషయంలో ఈ రేటు 9.10 శాతంగా ఉంది. బ్యాంక్ రేటు అతితక్కువ అరుునందువల్ల కొత్త గృహ రుణ గ్రహీతలకు అలాగే తమ గృహ రుణాలను ఎస్‌బీఐకి మార్చుకుని రుణ రేటు ద్వారా ప్రయోజనం పొందాలనుకునేవారికి ఇది సానుకూలమని పేర్కొంది. గృహ రుణ రేటు తగ్గింపు వల్ల రూ.50 లక్షల రుణంపై నెలవారీగా కొనుగోలుదారుడు రూ.542 పొదుపుచేసుకోగలుగుతాడు. 30 ఏళ్ల రుణ కాలంలో దాదాపు రూ. 2 లక్షల వరకూ ప్రయోజనం ఉంటుంది. ఇదే ఈఎంఐ మొత్తాన్ని రుణ కాలానికి నెలవారీగా రికరింగ్ డిపాజిట్‌లో పొదుపుచేస్తే... రూ.6 లక్షల ఆదాయం లభిస్తుందనని ఎస్‌బీఐ వివరించింది.
ఐసీఐసీఐ బ్యాంక్...
గృహాలకు సంబంధించి అకౌంట్ ఉన్న ఉద్యోగులకు ఆస్తి తనఖాపై ఓవర్‌డ్రాఫ్ట్‌గా రూ. 5 లక్షల నుంచి రూ. కోటి వరకూ రుణాన్ని ఆఫర్ చేసింది. ‘ఐసీఐసీఐ బ్యాంక్ హోమ్ ఓవర్‌డ్రాఫ్ట్’గా వ్యవహరిస్తున్న ఈ ప్రొడక్ట్ అటు టర్మ్ లోన్‌గా ఇటు ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యంగా ఉపయోగపడుతుందని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలపింది. తక్షణ అవసరాలకు ఈ నిధులు కస్టమరకు ఉపయోగపడతాయని తెలిపింది. విద్య, వైద్యం, గృహ పునర్ నిర్మాణం , వివాహం, విదేశీయానాలకు సైతం ఓవర్‌డ్రాఫ్ట్ రుణ సౌలభ్యం దోహదపడుతుందని వివరించింది. టర్మ్‌లోన్ విషయంలో నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్ ఆధారంగా వడ్డీరేటు ఉంటుందని తెలిపింది. ఓవర్‌డ్రాఫ్ట్ విషయంలో వినియోగించిన నిధులు, ఆయా కాలాలకు అనుగుణంగా వడ్డీరేటు ఉంటుందని వివరిచింది.