పండక్కి 13 స్పెషల్ ఎడిషన్స్.. మార్కెట్లో కొత్త కార్ల జోరు | New Special Edition Cars In India On This Festive Season | Sakshi
Sakshi News home page

పండక్కి 13 స్పెషల్ ఎడిషన్స్.. మార్కెట్లో కొత్త కార్ల జోరు

Published Fri, Oct 25 2024 4:19 PM | Last Updated on Fri, Oct 25 2024 4:36 PM

New Special Edition Cars In India On This Festive Season

ఈ పండుగ సీజన్‌లో ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నంలో కార్ల తయారీ సంస్థలు స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ చేశాయి. ఈ జాబితాలో మారుతీ సుజుకి, టయోటా, మహీంద్రా, జీప్, రెనాల్ట్ మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఈ కథనంలో ఇటీవల దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన స్పెషల్స్ ఎడిషన్స్ ఏవనే వివరాలు తెలుసుకుందాం.

స్పెషల్ ఎడిషన్స్ 
➺మారుతి వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ ఎడిషన్
➺మారుతి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్
➺మారుతి గ్రాండ్ విటారా డొమినియన్ ఎడిషన్
➺మారుతి బాలెనో రీగల్ ఎడిషన్
➺టయోటా హైరైడర్ ఫెస్టివల్ ఎడిషన్
➺టయోటా గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్
➺టయోటా రూమియన్ ఫెస్టివల్ ఎడిషన్
➺టయోటా టైసర్ ఫెస్టివల్ ఎడిషన్
➺మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్
➺జీప్ కంపాస్ యానివెర్సరీ ఎడిషన్
➺రెనాల్ట్ నైట్ అండ్ డే ఎడిషన్
➺ట్రైబర్ నైట్ అండ్ డే ఎడిషన్
➺క్విడ్ నైట్ అండ్ డే ఎడిషన్

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన ఈ స్పెషల్స్ ఎడిషన్స్ కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ మాత్రమే పొందినట్లు సమాచారం. వీటికి అదనంగా యాక్ససరీస్ ఫ్యాక్స్ కూడా ఎంపిక చేసుకోవచ్చు. కాబట్టి ధరలు స్టాండర్డ్ మోడల్స్ కంటే కొంత ఎక్కువగా ఉంటాయి. ధరలు కొనుగోలుదారు ఎంచుకునే యాక్ససరీస్ ప్యాక్ మీద ఆధారపడి ఉంటాయి. ఇందులో కొన్ని కార్లు ఈ నెల చివర వరకు మాత్రమే విక్రయానికి ఉండనున్నట్లు సమాచారం. కాబట్టి ఈ కార్లకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం మీ సమీపంలోనే కంపెనీ అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement