temporary workers
-
గిగ్ వర్కర్లకు ఫుల్ డిమాండ్
ముంబై: ఈ ఏడాది పండుగల సందర్భంగా తాత్కాలిక కార్మికులకు భారీ డిమాండ్ ఏర్పడింది. గతేడాదితో పోల్చితే గిగ్ వర్కర్లు (తాత్కాలిక ఉద్యోగులు)/ఫ్రీలాన్సర్ల డిమాండ్ 23 శాతం పెరిగినట్టు ‘అవ్సార్’ గివ్ వర్కర్స్ నివేదిక వెల్లడించింది. రిటైల్ రంగంలో వచ్చిన మార్పులు, కస్టమర్ల వినియోగం, వారి అంచనాలు పెరగడం, ఈ కామర్స్ సంస్థల విస్తరణ ఈ డిమాండ్‌కు మద్దతునిచ్చినట్టు తెలిపింది. పండుగల సందర్భంగా 12 లక్షల తాత్కాలిక ఉపాధి అవకాశాలు ఏర్పడినట్టు వెల్లడించింది. ఉద్యోగ నియామక సేవలు అందించే అవ్సార్ తన ప్లాట్‌ఫామ్‌పై డేటాను విశ్లేషించిన అనంతరం ఈ వివరాలు విడుదల చేసింది. లాజిస్టిక్స్, రిటైల్, ఈ కామర్స్, కస్టమర్ సపోర్ట్ రంగాలపై అధ్యయనం చేసింది. ద్వితీయ శ్రేణి పట్టణాలైన సూరత్, జైపూర్, లక్నో తాత్కాలిక పనివారికి ప్రధాన కేంద్రాలుగా మారినట్టు తెలిపింది. ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు మొత్తం మీద ఉపాధి పరంగా ముందున్నట్టు, మొత్తం డిమాండ్‌లో ఈ మూడు మెట్రోల నుంచే 53 శాతం ఉన్నట్టు వెల్లడించింది. సంప్రదాయంగా మెట్రోల్లో కనిపించే తాత్కాలిక కార్మికుల సంస్కృతి, టైర్ 2 పట్టణాలకూ విస్తరిస్తున్నట్టు పేర్కొంది. పెరిగిన వేతనాలు: నైపుణ్య మానవవనరులను ఆకర్షించేందుకు ఈ సీజన్లో కంపెనీలు అధిక వేతనాలను ఆఫర్ చేసినట్టు తెలిపింది. ఫీల్డ్ టెక్నీషియన్లకు ప్రతి నెలా రూ.35,000, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌లు, డెలివరీ బాధ్యతలకు రూ.18,000–28,000 వరకు చెల్లించినట్టు వివరించింది. అధిక డిమాండ్ ఉండే నైపుణ్య పనుల నిర్వహణకు మానవ వనరుల కొరత, సేలకు డిమాండ్ అధిక వేతనాలకు దారితీసినట్టు తెలిపింది. ప్రధానంగా లాజిస్టిక్స్, రిటైల్, ఈ కామర్స్ రంగాలు తాత్కాలిక ఉద్యోగులకు ఈ ఏడాది పండుగల సీజన్లో ఎక్కువ ఉపాధి కల్పించినట్టు వెల్లడించింది. దేశ ఉపాధి రంగంపై గిగ్ ఎకానమీ దీర్ఘకాలం పాటు ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది. పట్టణాల్లో తగ్గిన నిరుద్యోగం సెప్టెంబర్ త్రైమాసికంలో 6.4%పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 6.4 శాతానికి దిగొచ్చింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నిరుద్యోగం 6.6 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లోనూ పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 6.6 శాతంగా ఉండడం గమనార్హం. నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) 24వ పీరియాడిక్ లేబర్ సర్వే వివరాలను విడుదల చేసింది. పట్టణాల్లో 15 ఏళ్లు నిండిన మహిళల్లో నిరుద్యోగ రేటు సెప్టెంబర్ చివరికి 8.4 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికం నాటికి ఇది 8.6 శాతంగా ఉంది. ఇక ఈ ఏడాది జూన్ చివరికి 9 శాతంగా ఉంది. 15 ఏళ్లు నిండిన పురుషులకు సంబంధించి పట్టణ నిరుద్యోగం సెప్టెంబర్ చివరికి 5.7 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 6 శాతం కాగా, ఈ ఏడాది జూన్ చివరికి 5.8 శాతంగా ఉంది. జూలై–సెప్టెంబర్ కాలంలో కారి్మకుల భాగస్వామ్య రేటు 50.4 శాతానికి మెరుగుపడింది. క్రితం ఏడాది సెప్టెంబర్ చివరికి ఇది 50.1 శాతంగా ఉంది. -
భారతీయులకు కెనడా శుభవార్త
టొరంటో: కెనడాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ వృత్తినిపుణుల కుటుంబసభ్యులకు తీపి కబురు! ఓపెన్ వర్క్ పర్మిట్ (ఓడబ్ల్యూపీ) కింద అక్కడ పనిచేస్తున్న భారతీయుల కుటుంబసభ్యులు కూడా ఇకపై తాత్కాలిక వర్క్ పర్మిట్లతో పనిచేసుకోవచ్చు. వలసలు, శరణార్థులు, పౌరసత్వ వ్యవహారాల మంత్రి సీన్ ఫ్రాసర్ శుక్రవారం ఈ మేరకు ప్రకటించారు. వర్క్ పర్మిట్లున్న వారి జీవిత భాగస్వామి, పిల్లలు వచ్చే ఏడాది నుంచి ఉద్యోగాలు చేసుకోవచ్చంటూ ట్వీట్ చేశారు. ‘‘దేశంలో సమస్యగా మారిన ఉద్యోగుల కొరతకు పరిష్కారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. దీంతో 2,00,000 మందికిపైగా ఉన్న విదేశీ ఉద్యోగులకు తోడు వారి కుటుంబసభ్యులకు కెనడాలో కొలువుకు అవకాశం దక్కుతుంది. గతంలో ఓపెన్ వర్క్ పర్మిట్ ఉన్న ఉద్యోగి హై–స్కిల్డ్ ఉద్యోగం చేస్తేనే జీవితభా గస్వామికి వర్క్ పర్మిషన్ ఇచ్చేవాళ్లం. నిబంధనలను సడలించడంతో వర్క్ పర్మిట్ ఉద్యోగు లు కుటుంబంతో కలిసుంటారు. వారి శారీరక ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది’ అని ఫ్రాసర్ అభిప్రాయపడ్డారు. దీన్ని మూడు దశల్లో అమలు చేస్తారు. -
తాత్కాలిక పనివారికి డిమాండ్ !
ముంబై: పండుగల నేపథ్యంలో తాత్కాలిక పనివారు, ఉద్యోగుల కోసం నియామకాలు పెరిగాయి. మూడవ త్రైమాసికంలో నియామకాలు 400 శాతం వృద్ధి చెందాయి. ‘ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వ్యాపారాలు పూర్తి స్థాయిలో నడవలేదు. దీంతో వృద్ధి నమోదు కాలేదు. ఏప్రిల్–జూన్ నుంచి సానుకూల వాతావరణం మొదలైంది. మహమ్మారి నేపథ్యంలో కంపెనీలు త్వరితగతిన నియామకాలు పూర్తి చేసే క్రమంలో తాత్కాలిక పనివారు, సిబ్బందికి భారీ డిమాండ్ ఉంది. ఎడ్టెక్, ఫిన్‌టెక్, మొబిలిటీ, ఈ–కామర్స్, ఫుడ్‌టెక్, రిటైల్ రంగాల్లో బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్, మార్కెటింగ్, ఆన్‌బోర్డింగ్, ఆడిటింగ్, రిటైల్, వేర్‌హౌజ్ ఆపరేషన్స్ వంటి విభాగాల్లో ప్రధానంగా డిమాండ్ ఉంది.జనవరి–జూన్‌తో పోలిస్తే మూడవ త్రైమాసికంలో వీరి వేతనాలు 1.25–1.5 రెట్లు అధికం అయ్యాయి’ అని క్వెస్ కార్ప్ అనుబంధ కంపెనీ టాస్‌్కమో కో–ఫౌండర్ ప్రశాంత్ జానాద్రి తెలిపారు. ఈ–కామర్స్ రంగంలోనే సుమారు ఒక లక్ష మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఫస్ట్‌మెరీడియన్ బిజినెస్ సర్వీసెస్ గ్రూప్ సీఈవో సుధాకర్ బాలకృష్ణన్ వెల్లడించారు. ప్రస్తుత త్రైమాసికంలో చాలా కంపెనీలు నియామకాలు చేపట్టాలని భావిస్తున్నాయన్నారు. ఈ–కామర్స్ రంగంలో 50 శాతం, ఈ–ఫార్మా, సరుకు రవాణా 30–40, ఫుడ్ డెలివరీలో 50 శాతం రిక్రూట్మెంట్ పెరగనుందని చెప్పారు. -
ఎల్ఐసీకి సుప్రీం షాక్!
నాగ్ పూర్: నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎల్ఐసీ)కి దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం షాక్ ఇచ్చింది. 1991లో ఉద్యోగాల నుంచి తొలగించిన కాంట్రాక్ట్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తేల్చిచెప్పింది. నిబంధనల ప్రకారం అప్పటి నుంచి ఇప్పటివరకూ వారికి అందాల్సిన వేతనాలను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎల్ఐసీ 1991లో దేశవ్యాప్తంగా రెగ్యులర్ చేయాల్సిన మూడో, నాలుగో తరగతులకు చెందిన 8,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. దీంతో వారందరూ ఆల్ ఇండియా నేషనల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ద్వారా కోర్టును ఆశ్రయించారు. అప్పటినుంచి న్యాయస్థానాల్లో నలుగుతున్న ఈ కేసును మార్చి18, 2015న ఉద్యోగులకు అనుకూలంగా తీర్పువచ్చింది. దీంతో ఎల్ఐసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 25 ఏళ్ల వేతనాలు రూ.7,083 కోట్లు ఒకేసారి చెల్లించడం ఎల్ఐసీకి భారమవుతుందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు. అయితే 50 శాతం వేతనాలతో పాటు తదనంతర పరిణామాలకు కారణమైనందుకు అడిషనల్ బెనిఫిట్స్ ను ఉద్యోగులకు ఇవ్వాలని జస్టిస్ వి. గోపాల గౌడ, జస్టిస్ సి. నాగప్పన్ లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. 25 ఏళ్లుగా ఉద్యోగులు వేచిచూస్తున్నారని ఎనిమిది వారాల్లోగా వారికి రావలసిన బకాయిల్లో 50 శాతం అంటే రూ.3,543 కోట్లు చెల్లించాలని పేర్కొంది.