సాక్షి, హైదరాబాద్: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 20 వేల ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఆదివారం పేర్కొంది. హైదరాబాద్ సహా పది నగరాల్లో ఈ ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్లు తెలిపింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించనుంది. కస్టమర్ సర్వీస్ విభాగంలో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాల్లో చాలా మటుకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. దీనికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 12వ తరగతి పాస్ అయి ఉండాలని అమెజాన్ ఇండియా డైరెక్టర్(కస్టమర్ సర్వీస్) అక్షయ్ ప్రభు తెలిపారు. (అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు)
అభ్యర్థులకు ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉండాలన్నారు. అభ్యర్థుల పనితీరు, కంపెనీ అవసరాల ఆధారంగా తాత్కాలిక ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన మార్చుతామని తెలిపారు. సెలవు సీజన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో రానున్న ఆరు నెలల్లో కస్టమర్ల ఆన్‌లైన్ షాపింగ్ వినియోగం మరింత పెరుగుతందని ఆయన అంచనా వేశారు. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో జనాలు నేరుగా బయట అడుగు పెట్టడానికే బయటపడుతున్నారు. దీంతో ప్రతిదానికి ఆన్‌లైన్ బాట పట్టారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా 50 వేల సిబ్బందిని నియమించుకుంటామని అమెజాన్ గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. (లాక్డౌన్ సడలింపులు : అమెజాన్ గుడ్ న్యూస్
Comments
Please login to add a commentAdd a comment