ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా (Amazon) దివ్యాంగులకు (PwDs) శుభవార్త చెప్పింది. వీరికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది.
(Google: ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్ బంపరాఫర్..)
దివ్యాంగులకు శిక్షణ ఇచ్చి వారిని ప్రధాన శ్రామిక స్రవంతిలోకి తీసుకురావడానికి 2026 వరకు ఐదు రాష్ట్ర ప్రభుత్వాలతో ఎంఓయూ అమలులో ఉంటుందని, ఈ ఐదు రాష్ట్రాల్లోని పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నైపుణ్యం, ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఈ చొరవ తీసుకున్నట్లు అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది.
(Airbus jobs: గుడ్ న్యూస్.. ఎయిర్‌బస్‌లో భారీగా ఉద్యోగాలు)
అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ (PXT) డైరెక్టర్ లిజు థామస్ మాట్లాడుతూ.. "అమెజాన్ ఇండియాలో వృద్ధికి అనుకూలమైన సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాం. ప్రతిఒక్కరూ తమ సామర్థ్యాలను నిరూపించుకునేలా సమాన అవకాశాలను కల్పిస్తున్నాం" అన్నారు.
ఈ చొరవ కింద అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ నెట్‌వర్క్‌లో మూడు సంవత్సరాల వ్యవధిలో దివ్యాంగులకు నైపుణ్యం, జీవనోపాధి కల్పించడంపై అమెజాన్ దృష్టి పెట్టింది. అమెజాన్ ఆపరేషన్స్ నెట్‌వర్క్ పరిధిలోని ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, సార్టేషన్ కేంద్రాలు, డెలివరీ స్టేషన్‌లలో దివ్యాంగులకు స్టోవింగ్, పికింగ్, ప్యాకింగ్, సార్టింగ్ వంటి ఉద్యోగాలను కల్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment