PWD
-
అమెజాన్ శుభవార్త! అలాంటి వారికి ట్రైనింగ్‌తోపాటు జాబ్స్..
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా (Amazon) దివ్యాంగులకు (PwDs) శుభవార్త చెప్పింది. వీరికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. (Google: ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్ బంపరాఫర్..) దివ్యాంగులకు శిక్షణ ఇచ్చి వారిని ప్రధాన శ్రామిక స్రవంతిలోకి తీసుకురావడానికి 2026 వరకు ఐదు రాష్ట్ర ప్రభుత్వాలతో ఎంఓయూ అమలులో ఉంటుందని, ఈ ఐదు రాష్ట్రాల్లోని పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నైపుణ్యం, ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఈ చొరవ తీసుకున్నట్లు అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. (Airbus jobs: గుడ్ న్యూస్.. ఎయిర్‌బస్‌లో భారీగా ఉద్యోగాలు) అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ పీపుల్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ (PXT) డైరెక్టర్ లిజు థామస్ మాట్లాడుతూ.. "అమెజాన్ ఇండియాలో వృద్ధికి అనుకూలమైన సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాం. ప్రతిఒక్కరూ తమ సామర్థ్యాలను నిరూపించుకునేలా సమాన అవకాశాలను కల్పిస్తున్నాం" అన్నారు. ఈ చొరవ కింద అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ నెట్‌వర్క్‌లో మూడు సంవత్సరాల వ్యవధిలో దివ్యాంగులకు నైపుణ్యం, జీవనోపాధి కల్పించడంపై అమెజాన్ దృష్టి పెట్టింది. అమెజాన్ ఆపరేషన్స్ నెట్వర్క్ పరిధిలోని ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, సార్టేషన్ కేంద్రాలు, డెలివరీ స్టేషన్లలో దివ్యాంగులకు స్టోవింగ్, పికింగ్, ప్యాకింగ్, సార్టింగ్ వంటి ఉద్యోగాలను కల్పించనున్నారు. -
గతుకుల రోడ్లే కారణమంటే ఎలా; మంత్రి అసహనం
ముంబై : గతుకుల రోడ్డు వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి అనడం సమంజసం కాదంటున్నారు మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మినిస్టర్ చంద్రకాంత్ పాటిల్. విలేకరుల సమావేశంలో భాగంగా ‘ఈ మధ్య కాలంలో ముంబైలో జరుగుతున్న యాక్సిడెంట్లకు గతుకుల రోడ్లే కారణమంటున్నారు దీనిపై మీ అభిప్రాయం తెలపండని’ అడగ్గా చంద్రకాంత్ ఇలా అసహనం ప్రదర్శించారు. గత నెల రోజుల్లో గతుకుల రోడ్ల వల్ల ఆరుగురు ముంబై వాసులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐదుగురు కళ్యాణి ప్రాంతానికి చెందిన వారు కాగా మరొకరు నావీ ముంబై వాసి. వీరందరు రోడ్డు మీద ఉన్న గతుకుల కారణంగానే పట్టు తప్పి ప్రమాదాలకు గురయ్యారు. ఈ మధ్య కాలంలో ముంబైని భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా రోడ్డు మీద ఉన్న గతుకులు నీటితో నిండిపోయి, కనిపించకుండా అయిపోయాయి. దాంతో అక్కడ గుంత ఉందనే విషయం ప్రయాణికులకు తెలిసే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా పట్టు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు బారిన పడుతున్నది ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే కావడం గమనార్హం. ఈ విషయం గురించి విలేకరులు చంద్రకాంత్‌ను అడగ్గా ‘ఆయన మీరు గతుకుల రోడ్ల వల్లనే ఈ ప్రమాదాలు జరిగాయని అంటున్నారు. కానీ అదే రోడ్ల మీద ప్రతిరోజు 5 లక్షల మంది నిత్యం తిరుగుతుంటారు. మరి వారంతా క్షేమంగానే ఉన్నారు కదా. కేవలం రోడ్ల మీద ఉన్న గతుకుల కారణంగానే ప్రమాదాలు జరిగాయనడం సబబు కాదు’ అన్నారు. మరి సోషల్ మీడియాలో ప్రజలు ఈ గతుకుల రోడ్ల గురించి మాట్లాడుకుంటున్నారని అడగ్గా ‘ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న విషయం గురించి ప్రతికూలంగా మాట్లడటం ఫ్యాషన్ అయింది. అయినా పోనుపోను వాళ్లే వారి అభిప్రాయాన్ని మార్చుకుంటారని’ తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం త్వరలోనే ఎక్స్‌గ్రేషియా అందిస్తుందని తెలిపారు. -
పీడబ్ల్యూడీ స్కాంలో కేజ్రీవాల్ బంధువు అరెస్ట్
న్యూఢిల్లీ: ప్రజాపనుల విభాగం(పీడబ్ల్యూడీ) డ్రెయినేజీ పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మేనల్లుడిని ఏసీబీ అరెస్ట్ చేసింది. వాయవ్య ఢిల్లీ ప్రాంతంలో డ్రెయినేజీ వ్యవస్థ నిర్మాణ బాధ్యతలను రేణు కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ చేపట్టింది. సుమారు రూ.3.1 కోట్ల విలువైన పనులను పీడబ్ల్యూడీ అధికారులతో కుమ్మక్కై ఈ కంపెనీ నాసిరకంగా చేపట్టిందని ఏసీబీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రేణు కన్స్ట్రక్షన్స్ కంపెనీలో సీఎం మేనల్లుడు వినయ్ బన్సల్‌కు సగం వాటా ఉంది. వినయ్ బన్సల్‌ను గురువారం అదుపులోకి తీసుకున్న ఏసీబీ ఢిల్లీ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా ఒక రోజు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. çఆప్‌ను వేధించడమే కేంద్రం పనిగా పెట్టుకుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆరోపించారు. -
ఉండవల్లిలో అధికారుల అత్యుత్సాహం
సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లా ఉండవల్లిలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పీడబ్ల్యూడీ వర్క్ షాపు ఉన్న వద్ద ఇళ్లను ఖాళీ చేయించడానికి అధికారులు సిద్ధం అయ్యారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలోని ఇళ్లకు విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. దీంతో తమకు ప్రత్యామ్నయం చూపాలంటూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. నిర్వాసితుల ఆందోళనుకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వామపక్ష నేతలు మద్దతు తెలిపారు. కోర్టులో కేసు నడుస్తుండగా ఇళ్లను ఎలా తొలగిస్తారని మండిపడ్డారు. ఒక్కొక్కరికి 5 సెంట్ల స్థలం, రూ.5 లక్షల నగదు ఇవ్వాలని ఎమ్మెల్యే ఆర్కే డిమాండ్ చేశారు. -
ఆన్లైన్లో కమ్యూనిటీ హాళ్ల బుకింగ్
న్యూఢిల్లీ: ఇప్పటి వరకూ నగరవాసులు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు వేదికలను బుక్ చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ్యయప్రయాసాలకు తట్టుకొని ఫంక్షన్‌హాళ్లను బుక్ చేసుకోవాల్సి వచ్చేది. ఇక ఆ ఇబ్బందులు తొలగిపోనున్నా యి. ఇది ఢిల్లీవాసులకు పీడబ్ల్యూడీ విభాగం తెలియజేస్తున్న శుభవార్త. ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ బుకింగ్ ప్రాజెక్టును ప్రారంభించింది. అవసరమైన ప్రజలు పీడబ్ల్యూ వెబ్సైట్లో కమ్యూనిటీ హాళ్లను బుక్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. బుకింగ్ పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. అందుబాటులో ఇవే..: పీడబ్ల్యూడీకి చెందిన కమ్యూనిటీ హాళ్లు, బహిరంగ ప్రదేశాలు, పార్కులతోపాటు గులాబి బాగ్‌లో మూడు ఫంక్షన్‌హాళ్లు, కార్కాడూమా, కల్యానవాస్, తిమర్పూర్లలోని ఫంక్షన్ హాళ్ల సమాచారాన్ని తన వెబ్సైట్లో ఉంచింది. ప్రస్తుతం బుక్ చేసుకోవడంతోపాటు నగదు చెల్లింపులు కూడా ఆన్లైన్ ద్వారానే చెల్లించుకోవచ్చన్నారు. సమయం ఆదా..: ఇంతకు ముందు ఢిల్లీ వాసులు ఢిల్లీ సెక్రటేరియట్‌కు వచ్చి కమ్యూనిటీ హాళ్లను బుక్ చేసుకోవడం వల్ల సమయం వృథా అయ్యేదని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. ఈ పద్ధతి ద్వారా సమయం ఆదా అవుతోందని, సాధారణ ప్రజలు తమ కార్యక్రమానికి అనుకూలంగా ఇంటర్నెట్లో ఫంక్షన్‌హాళ్ల ఖాళీల వివరాలు తెలుసుకొని నిర్ణయించిన కాలపరిమితి (పెళ్లి కోసమైతే..45 రోజుల ముందు) బుక్ చేసుకోవచ్చు. ఇతర కార్యక్రమాలు పార్టీలు, పుట్టిన రోజు వాటికి నగరానికి చెందిన ఆమె/అతడు 20 రోజుల ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధ ంగా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తించవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే (పెళ్లికోసం-90 రోజుల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులైతే (పెళ్లి కోసం-60 రోజుల ముందుగానే ఫంక్షన్‌హాళ్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని పీడ బ్ల్యూడీ అధికారులు పేర్కొన్నారు. -
వానరాల సేవకుడు
సమయం ఉదయం ఏడు గంటలు.... అసలే పర్యాటక ప్రాంతం... సమీపంలోని మ్యూజియంకు పర్యాటకుల రాక అప్పుడే మొదలై ఎవరి హడావిడిలో వారున్నారు....తనకేమీ పట్టనట్టు ఓ యువకుడు మాత్రం ఎదురుచూస్తున్నాడు. నిన్న డల్‌గా కనిపించిన చిన్నారి వానరం జాడలేదు.....మొన్న పర్యాటకుని చేతిలో గాయపడిన వానరం ఎటూ పోయి ఉందో అంటూ తన సేననూ లెక్కగట్టసాగాడు .... ఇంతలోనే ఒక వ్యక్తి సార్ నాకు ఈ అడ్రస్ కాస్త చెబుతారా అంటూ అడగ్గా...ఐదు నిమిషాలు ఆగండి.... పెద్ద వానరాలు రాకముందే చిన్నవాటికి బిస్కెట్లు(టిఫిన్) పెట్టాలి...పెద్దవి వస్తే చిన్నవాటికి ముక్క కూడా దొరకదు అంటూ తన పెంపుడు కోతుల సేవలో నిమగ్నమయ్యాడు వెంకటేశ్. నాలుగేళ్ల నుంచి దాదాపు 50 కోతులకు ఆకలి తీర్చుతూ ఆదర్శంగా నిలుస్తున్న యువకుడి కథలోకి వెళితే... తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా పూండికి చెందిన పీడబ్ల్యూడీ అధికారి నీలమేఘం కుమారుడు వెంకటేశన్. హోంగార్డుగా రెండేళ్ల క్రితం వరకు విధులు నిర్వహించి రాజీనామా చేసి ప్రస్తుతం ప్రైవేటు కంపెనీలో సీనియర్ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య నదియా, పిల్లలు తరుణ్, రేష్మ ఉన్నారు. తండ్రి పీడబ్ల్యూడీ అధికారి కావడంతో డ్యూటీ మొత్తం పూండి రిజర్వాయర్ వద్దే సాగేది. ఇలా రిజర్వాయర్ వద్ద విధులు నిర్వహిస్తున్న తండ్రికి భోజనం తీసుకె ళ్లే తల్లితో పాటు వెళ్లే సమయంలో వానరాలు ఆహారం కోసం పడుతున్న పాట్లు వెంకటేశ్‌ను కంటతడి పెట్టించాయి. అప్పుడే రోజుకు కనీసం పది రూపాయలకు బిస్కెట్లను కొనిపెట్టి కొన్నింటికి అయినా ఆకలి తీర్చేవారు. అప్పుడే నిర్ణరుుంచుకున్నాడు పదేళ్ల తరువాతైనా రోజుకు కనీసం 50 కోతులకైనా ఆకలి తీర్చాలని. పార్టటైమ్ పని చేసి.. తన లక్ష్యం ప్రకారం నాలుగేళ్ల నుంచి కోతులకు బిస్కెట్లు పెట్టడం ప్రారంభించారు. అయితే హోంగార్డు ఉద్యోగం ద్వారా వచ్చే వేతనం ఇంటికి తన పెంపుడు కోతులకు కుటుంబానికి సరిపడకపోవడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రైవేటు ఉద్యోగంలో చేరాడు. ప్రతి రోజు మూడు గంటల పాటు ఎలక్ట్రికల్ వైరింగ్ పనులను పార్ట్‌టైమ్‌గా చేసి తద్వారా వచ్చే ఆదాయంతో వానరాలను పెంచుతున్నట్టు వివరించారు వెంకటేశన్. తాను కోతులను పెంచడం ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు అయినా కేవలం పదేళ్లపాటు మాత్రమే జీవించగలిగే కోతులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై వుందన్నదే తన ఆశయంగా వివరించేవాడు. వెంకటేశన్ ఏమంటున్నారంటే.... కోతులు దాడి చేస్తాయని వాటిని శారీరకంగా హింసించడాన్ని ప్రత్యక్షంగా చూస్తాం. వాస్తవానికి సహజంగా దొరికే ఆహారం కోతులకు దొరకనప్పుడు మాత్రమే అవి దాడి చేస్తాయి. సర్కస్‌కు, యాచనకు కోతులను ఉపయోగించే వారు వాటి ద్వారా వచ్చే సంపాదనలో కేవలం పది శాతం మాత్రమే వాటికి ఖర్చు చేస్తారు. తన యజమాని తన కోసం చూపిన ఆప్యాయతనూ దృష్టిలో వుంచుకుని అతను చెప్పిందల్లా కోతులు చేస్తున్నారుు. ఒక వ్యక్తి ఒక వానరాన్ని దత్తత తీసుకున్నా భవిష్యత్తులో మానవుడు ఉద్భవించిన తీరును వివరించడానికి వుపయోగపడుతుంది. నాలుగేళ్ల క్రితం ఇంటి వద్దే చిన్నగుడిసె వేసి కోతులను పెంచాను. బ్లూ క్రాస్ నుంచి ఇబ్బందులు వస్తాయని కొందరు భయపెడితే, మరి కొందరు కోతుల నుంచి ఇబ్బందులు వున్నాయని నాపై గొడవలకు దిగారు. దీంతో వేరే ప్రాంతంలో పెంచుతున్నాను. తన దరఖాస్తుకు స్పందించి కోతుల పెంపకానికి బ్లూక్రాస్ అనుమతి ఇస్తే ఇష్టంగా పెంచుకుంటాను. ఐదు గంటలు గడిపేస్తా ఒక్క రోజు నా రాముడు, లక్ష్మీ, పెరుమాల్, శివ, అజిత్, జిమ్మీ(ఇవి కోతుల పేర్లు) చూడకపోతే ఏదోలా వుంటుంది. అందుకే ఎక్కడికి వెళ్లినా రాత్రికంతా వానరాల వద్దకు వచ్చి విజిల్ వేస్తే ఎక్కడున్నా అవే పరిగెత్తుకొస్తాయి. ఇలా నా కోసం 50 ప్రాణులు ఉన్నాయా అనే విషయాన్ని గుర్తించి బిస్కెట్లు వేయడానికి వస్తుంటా ను. నేను ఒక్క రోజు రాకుంటే వానరాలు ఎదురుచూస్తున్నాయని ఫ్రెండ్స్ నాకు చెబుతుంటే, ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక్క రోజు సెలవు దొరికితే ఐదు గంటల పాటు వాటితోనే గడిపేస్తాను. -
ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి, న్యూఢిల్లీ:వారం రోజుల స్వాతంత్య్ర దిన వేడుకలను పురస్కరించుకుని నగ రాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ) ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా తన అధీనం కిందవున్న1,250 కిలోమీటర్ల రహదారి వెంట ఉన్న పోస్టర్లు, హోర్డింగులను సంబంధిత సిబ్బంది తొలగిస్తారు. చెట్లను కత్తిరిస్తారు. ఫ్లైఓవర్లకు రంగులు అద్దడంతోపాటు వాటికింద ఉన్న ఉద్యానవనాలకు మెరుగులు దిద్దుతారు, నిర్మాణ వ్యర్థాలను తొలగిస్తారు. ఈ విషయాన్ని ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ) కార్యదర్శి అరుణ్ బొరోకా వెల్లడించారు. ప్రధాన ఫ్లైఓవర్లన్నింటిపైనా స్వాతంత్య్ర దినోత్సవం తాలూకు సందేశాలు కలిగిన బ్యానర్లను ఏర్పాటుచేస్తారు. ప్రధాన క్రాసింగ్‌ల వద్ద 4,000 జాతీయ జెండాలను ఏర్పాటుచేస్తారు. రాజ్‌ఘాట్ నుంచి ఎర్రకోట వరకు వీఐపీ మార్గాన్నికూడా త్రివర్ణ పతాకాలతో అలంకరిస్తారు. ఢిల్లీ సచివాలయం, విధానసభ, ఎల్జీ కార్యాలయం, పీడబ్ల్యూడీ ప్రధాన కార్య్యాలయం వంటి భవనాలకు విద్యుద్దీపాలను అమరుస్తారు. రింగ్ రోడ్, ఔటర్ రింగ్‌రోడ్‌పై 20ప్రధాన క్రాసింగ్ ల వద్ద 200 బ్యానర్లతో 16,000 బెలూన్లను ఏర్పాటచేస్తారు. నగరానికి గల ఎనిమిది ప్రవేశ మార్గాలను కూడా జాతీయ జెండాలు, బెలూన్లతో అలంకరిస్తారు. 11 లక్షల మొక్కలను నాటనున్న సర్కారు వారం రోజుల స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా నగరవ్యాప్తంగా 11 లక్షల మొక్కలను నాటాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మూడు లక్షల మొక్కలను అటవీ ప్రాంతంలో నాటనున్నారు. మరో లక్ష మొక్కలను ప్రజాపనుల శాఖ నాటనుంది. ఇక ఆయా కార్పొరేషన్లు లక్ష మొక్కలను నాటనున్నాయి. మిగతావాటిని కంటోన్మెంట్, ఎకో క్లబ్‌లు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు నాటనున్నాయని ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలియజేసింది. మొక్కలు నాటే కార్యక్రమాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఈ నెల 12వ తేదీన ప్రారంభించనున్నారు. శాస్త్రిపార్కు విహార్ ప్రాంతంలో ఆరోజున వెయ్యి మొక్కలనునాటతారు. వీటిలో ఔషధ, హెర్బల్ మొక్కలు కూడా ఉంటాయి. ఎగురనున్న నాలుగువేల మువ్వన్నెల జెండాలు స్వాతంత్య్ర దినోత్సవం రోజున నగరంలో నాలుగు వేల మువ్వన్నెల జెండాలు ఎగరనున్నాయి. దీంతోపాటు 16 వేల బెలూన్లు కూడా నింగిలోకి దూసుకుపోనున్నాయి. ఈ విషయాన్ని సోమవారం విడుదలచేసిన ఓ ప్రకటనలో ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. -
పాత ఢిల్లీలో మళ్లీ ట్రామ్‌లు?
సాక్షి, న్యూఢిల్లీ: పాత ఢిల్లీ వీధుల్లో మళ్లీ ట్రామ్‌లు పరుగులు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. షాజ హానాబాద్ వీధులలో మళ్లీ ట్రామ్‌లు నడపాలని పీడబ్ల్యూడీ యోచిస్తోంది. ఈ పథకానికి యూటీప్యాక్ ఆమోదం తెలిపింది. మొదటి దశలో ఫతేపురీ మసీదు నుంచి జైన్‌మందిర్ వరకు ట్రామ్ నడపాలనుకుంటున్నారు. ఈ రూటు పొడవు 1.3 కిలోమీటర్లు. ట్రామ్ రూటు మెట్రో స్షేషన్ వరకు ఉంటుం ది. ట్రామ్ కోసం రూటు ప్రణాళిక తయారుచేసే బాధ్యత డీఎంఆర్సీకి అప్పగించారు. చాందినీచౌక్ సుందరీకరణ పథకం పాత ఢిల్లీ రోడ్లపైకి ట్రామ్‌లను తెచ్చేందుకు దోహదపడుతోంది. ఢిల్లీలో అరవయ్యో దశకం వరకు ట్రామ్‌లు నడిచాయి. 1908 లో లార్డ్ హార్డింగ్ చేతుల మీదుగా ప్రారంభమైన ట్రామ్ సేవలను 1921లో విస్తరించారు. అప్పట్లో 15 కి.మీల ట్రామ్ ట్రాక్ ఉండేది.. ట్రాక్‌పై 24 కార్ల తో కూడిన ట్రామ్ నడిచేదని అంటారు. అప్పట్లో చాందినీచౌక్, జామా మసీదు, సదర్‌బజార్ తదితర ప్రాంతాలలో ట్రామ్ సేవ అందుబాటులో ఉండేది. 1963లో ట్రామ్ సేవ రద్దయింది. ఢిల్లీచరిత్రలో భాగమైన ట్రామ్‌లను మళ్లీ పాత ఢిల్లీలో ప్రవేశపెట్టాలని లెఫ్టినె ంట్ గవర్నర్ న జీబ్జంగ్ భావించారు. పాత ఢిల్లీ చారిత్రక నేపథ్యం దృష్ట్యా ట్రామ్ సేవను ప్రవేశపెట్టాలన్న జంగ్ సూచనమేరకు పీడబ్ల్యూడీ విభాగం ప్రాజెక్టు నివేదిక రూపొందించింది. దీనిని యూటీప్యాక్ ఆమోదం కోసం పంపగా ఆ సంస్థ కూడా ఆమోదం తెలిపింది. ట్రామ్ సేవ కోసం 7.5 మీటర్ల వెడల్పు క్యారేజ్‌వే రూపొందించవలసి ఉం టుంది. చాందినీచౌక్‌ను అందంగా తీర్చిదిద్దే పథకానికి సంబంధిం చిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యా యి, పీడబ్ల్యూడీ విభాగం ఈ పథకం పనులు ప్రారంభించింది. షాజహనాబాద్ పునరాభివృద్ధి బోర్డు కూడా జామామసీదు పథకానికి సంబంధించి పను లు మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేసింది. అయితే కేవలం ట్రామ్ మార్గాన్ని మెట్రోస్టేషన్‌తో అనుసంధానించడంతో సరిపోదని మొత్తం షాజ హానాబాద్ అంతటా ఈ సేవను అందుబాటులోకి తేవాలని అనుకుంటున్నారు. చాందినీచౌక్, రైల్వే స్టేషన్, జామా మసీదు వాటి పరిసర ప్రాంతాలను కలుపు తూ ప్రజారవాణా వ్యవస్థను రూపొందించడం వల్ల షాజహానాబాద్ ప్రాంతంలో పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు మార్కెట్‌కు వచ్చే జనాల సంఖ్య పెరుగుతుంది. దాంతో పాటు ట్రాఫిక్ సమస్యకు కూడా పరిష్కా రం లభిస్తుందని భావిస్తున్నా రు. ఇరుకు రోడ్లు, వీధులతో కూడిన పాత ఢిల్లీలో వాహనాల రాకపోకలు అటుంచి కాలినడకన సంచరించడం కూడా కష్టతరమే. -
ప్రాజెక్టుల్లో కదలిక
న్యూఢిల్లీ:సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా స్తంభించిన పథకాలు/అభివృద్ధి ప్రాజెక్టులు పునఃప్రారంభం కానున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఈ నెల 10న రద్దయింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులను తిరిగి మొదలుపెట్టడంపై చర్చించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ.. ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి విజయ్దేవ్తో త్వరలోనే భేటీ కానున్నారు. ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో ప్రాజెక్టులను పునఃప్రారంభించాలని ఎన్నికల సంఘం ఇది వరకే సంబంధిత విభాగాలను ఆదేశించింది. ‘విజయ్దేవ్ను ఇది వరకే ఓసారి కలుసుకున్నాను. త్వరలోనే సమావేశాలు నిర్వహిస్తాం. విద్యుత నీరు, రోడ్ల వంటి ప్రాజెక్టులను తక్షణం ప్రారంభించాల్సి ఉంది. రోడ్లు, నీటిపారుదల, వరదల నియంత్రణకు సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రజాపనులశాఖ (పీడబ్ల్యూడీ) మొదలుపెట్టాల్సి ఉంది’ అని శ్రీవాస్తవ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే చేపట్టిన 11 కిలోమీటర్ల పొడవైన మోనోరైలు ట్రాక్, వజీరాబాద్ సిగ్నేచర్ బ్రిడ్జి వంటివి ఎన్నికల నియమాల వల్ల నిలిచిపోయాయి. మోనోరైలు మార్గాన్ని శాస్త్రిపార్కు నుంచి త్రిలోక్‌పురి నిర్మిస్తారు. షీలా దీక్షిత్ ప్రభుత్వం చేపట్టిన వికాస్పురి-వజీరాబాద్ రింగురోడ్డు, మరొకొన్ని పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు కూడా త్వరలోనే మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఔటర్‌రింగు రోడ్డు నిర్మాణం పూర్తయితే ఈ రెండు మార్గాల మధ్య ట్రాఫిక్ సిగ్నల్ రహిత ప్రయాణం సాధ్యపడుతుంది. ఆహార భద్రతలో భాగంగా పేదల కోసం ప్రారంభించిన అన్నశ్రీ యోజన కూడా ఎన్నికల సమయంలో నిలిపివేశారు. ఈ పథకం లబ్ధిదారులకు ఆహార ధాన్యాల రాయితీల నగదును నేరుగా వారి ఖాతాలకే బదిలీ చేస్తారు. దీని గురించి శ్రీవాస్తవను ప్రశ్నించగా, సంబంధితశాఖ నుంచి వివరాలు అందిన తరువాతే స్పందిస్తానని చెప్పారు. అన్నశ్రీ యోజన ఖాతా నిధులు ఈ నెలాఖరు వరకే ఉంటాయని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. ‘ఆర్థికపరమైన పథకం అమలుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. కాబట్టి అన్నశ్రీ అమలు గురించి ప్రస్తుతానికి ఏమీ చెప్పలేం. ఎల్జీ దీనిపై సమీక్ష నిర్వహించిన తరువాతే నిర్ణయం తీసుకుంటారు’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వాళ్లు అన్నశ్రీ పథకానికి అర్హులవుతారు. దీనికింద ఒక్కో కుటుంబానికి నెలకు రూ.600 చొప్పున రాయితీ నగదును వారి ఖాతాల్లో జమ చేస్తారు. ప్రస్తుతానికి సర్కిల్‌రేట్లు యథాతథం సర్కిల్ రేట్లను ఈ నెలాఖరు వరకు పెంచాలన్న ప్రతిపాదనను ప్రస్తుతానికి పక్కనపెట్టినట్టు సమాచారం. ఢిల్లీలో ఎన్నికలు ముగిసినప్పటికీ, అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యాకే రేట్ల పెంపును పరిశీలించాలని ఎల్జీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రద్దు చేసినా, కొన్ని రాష్ట్రాల్లో ఇది వచ్చే నెల 31 వరకు అమల్లో ఉంటుంది. సవరణ తరువాత సర్కిల్ రేట్లు 20 నుంచి 60 శాతం పెరగవచ్చని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఢిల్లీలో స్థిరాస్తుల విషయంలో ప్రభుత్వ రేట్లకు, మార్కెట్ రేట్లకు మధ్య భారీ తేడా ఉంది. ఈ తేడాను తొలగించడానికి సర్కిల్ రేట్లను సవరించాలని రెవెన్యూశాఖ భావిస్తోంది. ఒక స్థలాన్ని రిజిస్టర్ చేయడానికి ప్రభుత్వం ప్రాంతాల వారీగా నిర్ణయించే కనీస ధరను సర్కిల్ రేటు అంటారు. ఉదాహరణకు కేటగిరీ ‘ఎ’ కిందకు వచ్చే జోర్‌బాగ్, గోల్ఫ్‌లింక్స్ వంటి సంప్నన్న కాలనీలు, డిఫెన్స్ కాలనీ వంటి ‘బి’ కేటగిరీ కాలనీల్లో సర్కిల్ రేటు చదరపు కిలోమీటరుకు 6.5 లక్షల రూపాయలు ఉంది. పంజాబీబాగ్ వంటి ‘సి’ కేటగిరీ కాలనీల్లో సర్కిల్ రేటు రూ.1.32 లక్షలు ఉంది. ‘హెచ్’ కేటగిరీ కాలనీలో సర్కిల్ రేటు చదరపు కిలోమీటరుకు రూ.19,400గా ఉంది. ప్రభుత్వం నిర్ణయించే ఈ కనీస ధరకన్నా మార్కెట్ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే రిజిస్ట్రేషన్ సమయంలో చూపించే ధరలకు వాస్తవ ధరలకు ఎంతో తేడా ఉంటుంది. నల్లధనం రూపేణా జరిగే ఈ లావాదేవీల కారణంగా ప్రభుత్వం భారీ ఆదాయాన్ని కోల్పోతోంది. సంపన్న కాలనీకు సంబంధించి తేడా అధికంగా ఉండడం వల్ల వాటి సర్కిల్‌రేట్లు భారీగా పెంచనున్నారు. ఎన్నికలయ్యాకే దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశముంది.