పాత ఢిల్లీలో మళ్లీ ట్రామ్‌లు?
సాక్షి, న్యూఢిల్లీ: పాత ఢిల్లీ వీధుల్లో మళ్లీ ట్రామ్‌లు పరుగులు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. షాజ హానాబాద్ వీధులలో మళ్లీ ట్రామ్‌లు నడపాలని పీడబ్ల్యూడీ యోచిస్తోంది. ఈ పథకానికి యూటీప్యాక్ ఆమోదం తెలిపింది. మొదటి దశలో ఫతేపురీ మసీదు నుంచి జైన్‌మందిర్ వరకు ట్రామ్ నడపాలనుకుంటున్నారు. ఈ రూటు పొడవు 1.3 కిలోమీటర్లు. ట్రామ్ రూటు మెట్రో స్షేషన్ వరకు ఉంటుం ది. ట్రామ్ కోసం రూటు ప్రణాళిక తయారుచేసే బాధ్యత డీఎంఆర్‌సీకి అప్పగించారు. చాందినీచౌక్ సుందరీకరణ పథకం పాత ఢిల్లీ రోడ్లపైకి ట్రామ్‌లను తెచ్చేందుకు దోహదపడుతోంది. ఢిల్లీలో అరవయ్యో దశకం వరకు ట్రామ్‌లు నడిచాయి. 1908 లో లార్డ్ హార్డింగ్ చేతుల మీదుగా ప్రారంభమైన ట్రామ్ సేవలను 1921లో విస్తరించారు. అప్పట్లో 15 కి.మీల ట్రామ్ ట్రాక్ ఉండేది.. ట్రాక్‌పై 24 కార్ల తో కూడిన ట్రామ్ నడిచేదని అంటారు.
అప్పట్లో చాందినీచౌక్, జామా మసీదు, సదర్‌బజార్ తదితర ప్రాంతాలలో ట్రామ్ సేవ అందుబాటులో ఉండేది. 1963లో ట్రామ్ సేవ రద్దయింది. ఢిల్లీచరిత్రలో భాగమైన ట్రామ్‌లను మళ్లీ పాత ఢిల్లీలో ప్రవేశపెట్టాలని లెఫ్టినె ంట్ గవర్నర్ న జీబ్‌జంగ్ భావించారు. పాత ఢిల్లీ చారిత్రక నేపథ్యం దృష్ట్యా ట్రామ్ సేవను ప్రవేశపెట్టాలన్న జంగ్ సూచనమేరకు పీడబ్ల్యూడీ విభాగం ప్రాజెక్టు నివేదిక రూపొందించింది. దీనిని యూటీప్యాక్ ఆమోదం కోసం పంపగా ఆ సంస్థ కూడా ఆమోదం తెలిపింది. ట్రామ్ సేవ కోసం 7.5 మీటర్ల వెడల్పు క్యారేజ్‌వే రూపొందించవలసి ఉం టుంది. చాందినీచౌక్‌ను అందంగా తీర్చిదిద్దే పథకానికి సంబంధిం చిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యా యి, పీడబ్ల్యూడీ విభాగం ఈ పథకం పనులు ప్రారంభించింది.
షాజహనాబాద్ పునరాభివృద్ధి బోర్డు కూడా జామామసీదు పథకానికి సంబంధించి పను లు మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేసింది. అయితే కేవలం ట్రామ్ మార్గాన్ని మెట్రోస్టేషన్‌తో అనుసంధానించడంతో సరిపోదని మొత్తం షాజ హానాబాద్ అంతటా ఈ సేవను అందుబాటులోకి తేవాలని అనుకుంటున్నారు. చాందినీచౌక్, రైల్వే స్టేషన్, జామా మసీదు వాటి పరిసర ప్రాంతాలను కలుపు తూ ప్రజారవాణా వ్యవస్థను రూపొందించడం వల్ల షాజహానాబాద్ ప్రాంతంలో పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు మార్కెట్‌కు వచ్చే జనాల సంఖ్య పెరుగుతుంది. దాంతో పాటు ట్రాఫిక్ సమస్యకు కూడా పరిష్కా రం లభిస్తుందని భావిస్తున్నా రు. ఇరుకు రోడ్లు, వీధులతో కూడిన పాత ఢిల్లీలో వాహనాల రాకపోకలు అటుంచి కాలినడకన సంచరించడం కూడా కష్టతరమే.