Old Delhi
-
వలస కూలీల ఆకలి దారిద్య్రం కళ్లకు కట్టింది
ఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో వలస కూలీలు ఆకలి దారిద్య్రం ఎంత ధీనావస్థలో ఉందనేది ఈ ఫోటో తెలియజేస్తుంది. సొంతూళ్లకు వెళ్లేందుకని కేంద్రం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైలును ఎక్కేందుకు వచ్చిన వలస కూలీలు ఆహారం కోసం ఒకరినొకరు తోసుకుంటూ మరీ లూటీకి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం సాయంత్రం ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. వివరాలు.. శ్రామిక్ రైలు ఎక్కేందుకు ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వచ్చిన కొంతమంది వలస కూలీలు రైలు ఎక్కడానికి సిద్దమయ్యారు. ఈ తరుణంలో అక్కడికి ఒక వ్యక్తి ఒక తోపుడుబండిలో చిప్స్, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ తీసుకొని వచ్చాడు. (భారత్‌లో లక్షా ముప్పైవేలు దాటిన కరోనా కేసులు) కొంతమంది వ్యక్తులు అతన్ని ఆపి కొనడానికి యత్నం చేస్తుండగా.. నిమిషాల వ్యవధిలోనే జనం సమూహం పెరిగిపోయి ఆహారం కోసం ఎగబడ్డారు. ఎవరికి తోచినట్లుగా వారు ఆహారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. ఇక చివరగా అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆహారం నాదంటే నాదని వాదులాడుకోవడం ఆకలి దారిద్య్రం కళ్లకు కట్టినట్లు చూపింది. అయితే ఇదంతా రైల్వే స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఆ సమయంలో అక్కడ ఒక్క రైల్వే పోలీసు అధికారి లేకపోవడం గమనార్హం. అయితే శ్రామిక్ రైళ్లకోసం మాత్రమే ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్‌ను వాడుతున్నట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. దేశం మొత్తం లాక్డౌన్ విధించడంతో వలస కూలీలు పనుల్లేక పస్తులతో కాలం గడుపుతున్నారు. సొంతూళ్లకు కాలినడకనే బయలుదేరిన వలసకూలీలు తినడానికి సరైన తిండి లేక వారి బతుకులు చిద్రంగా తయారవుతున్నాయి. (వ్యక్తి చెవిలో నుంచి బుల్లెట్.. ఆపై భార్య మెడలోకి) -
ఢిల్లీలోని నయాబజార్‌లో పేలుడు
-
రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎనిమిది బోగీలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పాత ఢిల్లీ-ఫైజాబాద్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం అర్థరాత్రి తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని హపూర్ అనే గ్రామం వద్ద పట్టాలు తప్పింది. మొత్తం ఎన్నిమిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 12మంది గాయపడ్డారని రైల్వే అధికారులు చెబుతుండగా 40 నుంచి 50మంది గాయపడి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. సరిగ్గా గర్ముక్తేశ్వర్, కాకాఖేర్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుందని రైల్వే గార్డు తెలిపారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు రైలు వేగం గంటకు 80 కి.మీలుగా ఉందని, పట్టాలు తప్పిన బోగీలు అపాయకర స్థితిలో ఓ పక్కకు పూర్తిగా పడిపోయాయని చెప్పారు. పట్టాలు తప్పిన బోగీల్లో నాలుగు ఏసీ, రెండు స్లీపర్, ఒక జనరల్ బోగీ, మరొకటి సామాన్లు భద్రపరిచే బోగీ పట్టాలు తప్పినట్లు వెల్లడించారు. ఘటనకు కారణాలు అన్వేషిస్తున్నామని చెప్పారు. -
మహిళ హత్య కేసులో ఐదుగురు నిందితుల అరెస్టు
స్థానిక పోలీసులు కచ్చా బనియన్ ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. పాత ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో గత ఆదివారం ఓ మహిళ హత్యకు గురైన సంగతి విదితమే. నిందితులను మొహబ్బత్, అనిస్ అలియాస్, ఫిర్సత్, మధు, సాగర్, రహీం అలియాస్ రాజుగా గుర్తించారు. వీరిని బుధవారం అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నిందితులు హతురాలి ఇంటిలో దొంగతనం కోసం యత్నించారని, అయితే అడ్డుకోవడంతో మహిళపై దాడి చేశారని, దీంతో ఆమె చనిపోయిందని చెప్పారు. అదే రోజు రాత్రి నిందితులు అనేక నేరాలకు పాల్పడ్డారన్నారు. వీరి దాడిలో అనేకమంది స్థానికులు గాయపడ్డారన్నారు. ఈ హత్య వెనుక పెద్ద బృందమే ఉందని తమ ప్రాథమిక విచారణలో తేలిందని, వీరంతా నరేలా రైల్వే క్రాసింగ్ వద్ద ఉంటారని తెలిపారు. గత రెండు నెలలుగా ఆ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో వీరంతా గుడిసెలు వేసుకుని జీవిస్తున్నట్టు తెలిపారు. దీంతో మెరుపుదాడి జరిపి నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు. నిందితులంతా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ వాసులని తమ విచారణలో తేలిందన్నారు. వీరు ఏ ప్రాంతంలోనూ ఆరు నెలలకు మించి ఉండరని, తరచూ తమ నివాస స్థలాన్ని మారుస్తుంటారని తెలిపారు. బాగా చీకటిగా ఉన్న సమయంలోనే వీరంతా నేరాలకు పాల్పడతారని, పగటిపూట వీరంతా ఆయా ప్రాంతా ల్లో మ్యాజిక్ ట్రిక్కులను ప్రదర్శిస్తుంటారని తెలిపారు. ఆ సమయంలోనే తాము దాడికి దిగాల్సిన ప్రాంతాలను ఎంచుకుంటారన్నారు. నేరాలకు పాల్పడే సమయంలో కేవలం డ్రాయర్లు మాత్రమే ధరిస్తారని తెలిపారు. -
పాత ఢిల్లీలో మళ్లీ ట్రామ్‌లు?
సాక్షి, న్యూఢిల్లీ: పాత ఢిల్లీ వీధుల్లో మళ్లీ ట్రామ్‌లు పరుగులు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. షాజ హానాబాద్ వీధులలో మళ్లీ ట్రామ్‌లు నడపాలని పీడబ్ల్యూడీ యోచిస్తోంది. ఈ పథకానికి యూటీప్యాక్ ఆమోదం తెలిపింది. మొదటి దశలో ఫతేపురీ మసీదు నుంచి జైన్‌మందిర్ వరకు ట్రామ్ నడపాలనుకుంటున్నారు. ఈ రూటు పొడవు 1.3 కిలోమీటర్లు. ట్రామ్ రూటు మెట్రో స్షేషన్ వరకు ఉంటుం ది. ట్రామ్ కోసం రూటు ప్రణాళిక తయారుచేసే బాధ్యత డీఎంఆర్సీకి అప్పగించారు. చాందినీచౌక్ సుందరీకరణ పథకం పాత ఢిల్లీ రోడ్లపైకి ట్రామ్‌లను తెచ్చేందుకు దోహదపడుతోంది. ఢిల్లీలో అరవయ్యో దశకం వరకు ట్రామ్‌లు నడిచాయి. 1908 లో లార్డ్ హార్డింగ్ చేతుల మీదుగా ప్రారంభమైన ట్రామ్ సేవలను 1921లో విస్తరించారు. అప్పట్లో 15 కి.మీల ట్రామ్ ట్రాక్ ఉండేది.. ట్రాక్‌పై 24 కార్ల తో కూడిన ట్రామ్ నడిచేదని అంటారు. అప్పట్లో చాందినీచౌక్, జామా మసీదు, సదర్‌బజార్ తదితర ప్రాంతాలలో ట్రామ్ సేవ అందుబాటులో ఉండేది. 1963లో ట్రామ్ సేవ రద్దయింది. ఢిల్లీచరిత్రలో భాగమైన ట్రామ్‌లను మళ్లీ పాత ఢిల్లీలో ప్రవేశపెట్టాలని లెఫ్టినె ంట్ గవర్నర్ న జీబ్జంగ్ భావించారు. పాత ఢిల్లీ చారిత్రక నేపథ్యం దృష్ట్యా ట్రామ్ సేవను ప్రవేశపెట్టాలన్న జంగ్ సూచనమేరకు పీడబ్ల్యూడీ విభాగం ప్రాజెక్టు నివేదిక రూపొందించింది. దీనిని యూటీప్యాక్ ఆమోదం కోసం పంపగా ఆ సంస్థ కూడా ఆమోదం తెలిపింది. ట్రామ్ సేవ కోసం 7.5 మీటర్ల వెడల్పు క్యారేజ్‌వే రూపొందించవలసి ఉం టుంది. చాందినీచౌక్‌ను అందంగా తీర్చిదిద్దే పథకానికి సంబంధిం చిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యా యి, పీడబ్ల్యూడీ విభాగం ఈ పథకం పనులు ప్రారంభించింది. షాజహనాబాద్ పునరాభివృద్ధి బోర్డు కూడా జామామసీదు పథకానికి సంబంధించి పను లు మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేసింది. అయితే కేవలం ట్రామ్ మార్గాన్ని మెట్రోస్టేషన్‌తో అనుసంధానించడంతో సరిపోదని మొత్తం షాజ హానాబాద్ అంతటా ఈ సేవను అందుబాటులోకి తేవాలని అనుకుంటున్నారు. చాందినీచౌక్, రైల్వే స్టేషన్, జామా మసీదు వాటి పరిసర ప్రాంతాలను కలుపు తూ ప్రజారవాణా వ్యవస్థను రూపొందించడం వల్ల షాజహానాబాద్ ప్రాంతంలో పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు మార్కెట్‌కు వచ్చే జనాల సంఖ్య పెరుగుతుంది. దాంతో పాటు ట్రాఫిక్ సమస్యకు కూడా పరిష్కా రం లభిస్తుందని భావిస్తున్నా రు. ఇరుకు రోడ్లు, వీధులతో కూడిన పాత ఢిల్లీలో వాహనాల రాకపోకలు అటుంచి కాలినడకన సంచరించడం కూడా కష్టతరమే. -
పాతఢిల్లీలో ఐదు సబ్‌వేలు
న్యూఢిల్లీ: సెంట్రల్ సెక్రటేరియట్-కాశ్మీరీ గేట్ కారిడార్‌లో భాగంగా పాత ఢిల్లీలో ఐదు స్టేషన్ల ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాలు, పాదచారుల కోసం సబ్‌వేలను నిర్మించాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్ణయించింది. 2015 కల్లా వీటిని పూర్తిచేయాలని ప్రతిపాదనలు తయారుచేసినట్లు డీఎంఆర్సీ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఐదు సబ్‌వేలను ఢిల్లీ గేట్, జామా మసీద్, లాల్‌ఖిలా మెట్రో స్టేషన్లలో నిర్మించనున్నట్లు తెలిపారు. వీటినే ఎప్పుడూ బిజీగా ఉండే రోడ్లు దాటేందుకు పాదచారులు సైతం సబ్వేలుగా ఉపయోగించుకునేలా రూపకల్పన చేయనున్నారు. ఢిల్లీ గేట్ వద్ద బహదూర్ షా మార్గ్ కింది నుంచి నిర్మించున్న సబ్వే ఫిరోజ్‌షా కోట్లా, అంబేద్కర్ స్టేడియం మధ్య దూరాన్ని తగ్గించనుంది. అలాగే జవహర్లాల్ నెహ్రూ మార్గ్, అసఫ్ అలీ రోడ్ కింది నుంచి నిర్మించనున్న సబ్ వే ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ భవనంతో లోక్‌నాయక్ జైప్రకాష్ ఆస్పత్రిని కలుపుతోంది. ఇదిలా ఉండగా, జామా మసీద్ మెట్రో స్టేషన్ వద్ద నేతాజీ సుభాష్ మార్గ్‌ను, జామా మసీద్‌ను అనుసంధానపరుస్తూ సబ్వేను నిర్మించనున్నారు. అలాగే నేతాజీ సుభాష్ మార్గ్ నుంచి ఎర్రకోట వైపు ఉన్న రోడ్డుకు కలుపుతూ మరో రెండు సబ్‌వేలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ సబ్‌వేల నిర్మాణం వల్ల స్థానికంగా ఉంటున్న ప్రజలకు చాలా ఇబ్బందులు తగ్గనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.ప్రస్తుతం చాలా పరిమితంగా ఉన్న పాదచారుల సబ్‌వేలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు వీరి అవసరాలను తీర్చలేకపోతున్నాయి. దీంతో వీటిని కూడా ఫేజ్ -3 పనుల్లో భాగంగా మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్ర్కమణ మార్గాలుగా మార్చేందుకు ఢిల్లీ మెట్రో యత్నిస్తోంది. ఇదేవిధంగా రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్లలో కూడా అవసరమైన సదుపాయాలను ఏర్పాటుచేయాలని ఢిల్లీ మెట్రో యోచిస్తోంది. ఫేజ్-3 ప్రాజెక్టులో భాగంగా నగరంలోని 138 కి.మీ.ల మేర విస్తరించాలని ఢిల్లీ మెట్రో ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.