న్యూఢిల్లీ: ఇప్పటి వరకూ నగరవాసులు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు వేదికలను బుక్ చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ్యయప్రయాసాలకు తట్టుకొని ఫంక్షన్‌హాళ్లను బుక్ చేసుకోవాల్సి వచ్చేది. ఇక ఆ ఇబ్బందులు తొలగిపోనున్నా యి. ఇది ఢిల్లీవాసులకు పీడబ్ల్యూడీ విభాగం తెలియజేస్తున్న శుభవార్త. ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకోవడానికి ఆన్‌లైన్ బుకింగ్ ప్రాజెక్టును ప్రారంభించింది. అవసరమైన ప్రజలు పీడబ్ల్యూ వెబ్‌సైట్‌లో కమ్యూనిటీ హాళ్లను బుక్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. బుకింగ్ పారదర్శకంగా ఉంటుందని తెలిపారు.
అందుబాటులో ఇవే..: పీడబ్ల్యూడీకి చెందిన కమ్యూనిటీ హాళ్లు, బహిరంగ ప్రదేశాలు, పార్కులతోపాటు గులాబి బాగ్‌లో మూడు ఫంక్షన్‌హాళ్లు, కార్కాడూమా, కల్యానవాస్, తిమర్‌పూర్‌లలోని ఫంక్షన్ హాళ్ల సమాచారాన్ని తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ప్రస్తుతం బుక్ చేసుకోవడంతోపాటు నగదు చెల్లింపులు కూడా ఆన్‌లైన్ ద్వారానే చెల్లించుకోవచ్చన్నారు. సమయం ఆదా..: ఇంతకు ముందు ఢిల్లీ వాసులు ఢిల్లీ సెక్రటేరియట్‌కు వచ్చి కమ్యూనిటీ హాళ్లను బుక్ చేసుకోవడం వల్ల సమయం వృథా అయ్యేదని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.
ఈ పద్ధతి ద్వారా సమయం ఆదా అవుతోందని, సాధారణ ప్రజలు తమ కార్యక్రమానికి అనుకూలంగా ఇంటర్నెట్‌లో ఫంక్షన్‌హాళ్ల ఖాళీల వివరాలు తెలుసుకొని నిర్ణయించిన కాలపరిమితి (పెళ్లి కోసమైతే..45 రోజుల ముందు) బుక్ చేసుకోవచ్చు. ఇతర కార్యక్రమాలు పార్టీలు, పుట్టిన రోజు వాటికి నగరానికి చెందిన ఆమె/అతడు 20 రోజుల ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధ ంగా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తించవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే (పెళ్లికోసం-90 రోజుల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులైతే (పెళ్లి కోసం-60 రోజుల ముందుగానే ఫంక్షన్‌హాళ్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని పీడ బ్ల్యూడీ అధికారులు పేర్కొన్నారు.
ఆన్‌లైన్‌లో కమ్యూనిటీ హాళ్ల బుకింగ్
Published Thu, Dec 4 2014 10:21 PM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM
Advertisement
Advertisement