సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లా ఉండవల్లిలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పీడబ్ల్యూడీ వర్క్ షాపు ఉన్న వద్ద ఇళ్లను ఖాళీ చేయించడానికి అధికారులు సిద్ధం అయ్యారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలోని ఇళ్లకు విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. దీంతో తమకు ప్రత్యామ్నయం చూపాలంటూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. నిర్వాసితుల ఆందోళనుకు వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వామపక్ష నేతలు మద‍్దతు తెలిపారు. కోర్టులో కేసు నడుస్తుండగా ఇళ్లను ఎలా తొలగిస్తారని మండిపడ్డారు. ఒక్కొక్కరికి 5 సెంట్ల స్థలం, రూ.5 లక్షల నగదు ఇవ్వాలని ఎమ్మెల్యే ఆర్కే డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment