వానరాల సేవకుడు | Vanara servant | Sakshi
Sakshi News home page

వానరాల సేవకుడు

Published Tue, Nov 18 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

వానరాల సేవకుడు

వానరాల సేవకుడు

 సమయం ఉదయం ఏడు గంటలు.... అసలే పర్యాటక ప్రాంతం... సమీపంలోని మ్యూజియంకు పర్యాటకుల రాక అప్పుడే మొదలై ఎవరి హడావిడిలో వారున్నారు....తనకేమీ పట్టనట్టు ఓ యువకుడు మాత్రం ఎదురుచూస్తున్నాడు. నిన్న డల్‌గా కనిపించిన చిన్నారి వానరం జాడలేదు.....మొన్న పర్యాటకుని చేతిలో గాయపడిన వానరం ఎటూ పోయి ఉందో అంటూ తన సేననూ  లెక్కగట్టసాగాడు .... ఇంతలోనే ఒక వ్యక్తి సార్ నాకు ఈ అడ్రస్ కాస్త చెబుతారా అంటూ అడగ్గా...ఐదు నిమిషాలు ఆగండి.... పెద్ద వానరాలు రాకముందే చిన్నవాటికి బిస్కెట్‌లు(టిఫిన్) పెట్టాలి...పెద్దవి వస్తే చిన్నవాటికి ముక్క కూడా దొరకదు అంటూ తన పెంపుడు కోతుల సేవలో నిమగ్నమయ్యాడు వెంకటేశ్. నాలుగేళ్ల నుంచి దాదాపు 50 కోతులకు ఆకలి తీర్చుతూ ఆదర్శంగా నిలుస్తున్న యువకుడి కథలోకి వెళితే...
 
 తిరువళ్లూరు:
 తిరువళ్లూరు జిల్లా పూండికి చెందిన పీడబ్ల్యూడీ అధికారి నీలమేఘం కుమారుడు వెంకటేశన్. హోంగార్డుగా రెండేళ్ల క్రితం వరకు విధులు నిర్వహించి రాజీనామా చేసి ప్రస్తుతం ప్రైవేటు కంపెనీలో సీనియర్ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య నదియా, పిల్లలు తరుణ్, రేష్మ  ఉన్నారు.  తండ్రి పీడబ్ల్యూడీ అధికారి కావడంతో డ్యూటీ మొత్తం పూండి రిజర్వాయర్ వద్దే సాగేది. ఇలా రిజర్వాయర్ వద్ద విధులు నిర్వహిస్తున్న తండ్రికి భోజనం తీసుకె ళ్లే తల్లితో పాటు వెళ్లే సమయంలో వానరాలు ఆహారం కోసం పడుతున్న పాట్లు వెంకటేశ్‌ను కంటతడి పెట్టించాయి. అప్పుడే రోజుకు కనీసం పది రూపాయలకు బిస్కెట్లను కొనిపెట్టి కొన్నింటికి అయినా ఆకలి తీర్చేవారు. అప్పుడే నిర్ణరుుంచుకున్నాడు పదేళ్ల తరువాతైనా రోజుకు కనీసం 50 కోతులకైనా ఆకలి తీర్చాలని.
 
 పార్‌‌టటైమ్ పని చేసి..
 తన లక్ష్యం ప్రకారం నాలుగేళ్ల నుంచి కోతులకు బిస్కెట్‌లు పెట్టడం ప్రారంభించారు. అయితే హోంగార్డు ఉద్యోగం ద్వారా వచ్చే వేతనం ఇంటికి తన పెంపుడు కోతులకు కుటుంబానికి సరిపడకపోవడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రైవేటు ఉద్యోగంలో చేరాడు. ప్రతి రోజు మూడు గంటల పాటు ఎలక్ట్రికల్ వైరింగ్ పనులను పార్ట్‌టైమ్‌గా చేసి తద్వారా వచ్చే ఆదాయంతో వానరాలను పెంచుతున్నట్టు వివరించారు వెంకటేశన్. తాను కోతులను పెంచడం ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు అయినా  కేవలం పదేళ్లపాటు మాత్రమే జీవించగలిగే కోతులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై వుందన్నదే తన ఆశయంగా వివరించేవాడు.
 
 వెంకటేశన్ ఏమంటున్నారంటే....
 కోతులు దాడి చేస్తాయని వాటిని శారీరకంగా హింసించడాన్ని ప్రత్యక్షంగా చూస్తాం. వాస్తవానికి సహజంగా దొరికే ఆహారం కోతులకు దొరకనప్పుడు మాత్రమే అవి దాడి చేస్తాయి. సర్కస్‌కు, యాచనకు కోతులను ఉపయోగించే వారు వాటి ద్వారా వచ్చే సంపాదనలో కేవలం పది శాతం మాత్రమే వాటికి ఖర్చు చేస్తారు. తన యజమాని తన కోసం చూపిన ఆప్యాయతనూ దృష్టిలో వుంచుకుని అతను చెప్పిందల్లా కోతులు చేస్తున్నారుు.  ఒక వ్యక్తి ఒక వానరాన్ని దత్తత తీసుకున్నా భవిష్యత్తులో మానవుడు ఉద్భవించిన తీరును వివరించడానికి వుపయోగపడుతుంది. నాలుగేళ్ల క్రితం ఇంటి వద్దే చిన్నగుడిసె వేసి కోతులను పెంచాను. బ్లూ క్రాస్ నుంచి ఇబ్బందులు వస్తాయని కొందరు భయపెడితే, మరి కొందరు కోతుల నుంచి ఇబ్బందులు వున్నాయని నాపై గొడవలకు దిగారు. దీంతో వేరే ప్రాంతంలో పెంచుతున్నాను. తన దరఖాస్తుకు స్పందించి కోతుల పెంపకానికి  బ్లూక్రాస్ అనుమతి ఇస్తే ఇష్టంగా పెంచుకుంటాను.
 
 ఐదు గంటలు గడిపేస్తా
 ఒక్క రోజు నా రాముడు, లక్ష్మీ, పెరుమాల్, శివ, అజిత్, జిమ్మీ(ఇవి కోతుల పేర్లు) చూడకపోతే ఏదోలా వుంటుంది. అందుకే ఎక్కడికి వెళ్లినా రాత్రికంతా వానరాల వద్దకు వచ్చి విజిల్ వేస్తే ఎక్కడున్నా అవే పరిగెత్తుకొస్తాయి. ఇలా నా కోసం 50 ప్రాణులు ఉన్నాయా అనే విషయాన్ని గుర్తించి బిస్కెట్‌లు వేయడానికి వస్తుంటా ను. నేను ఒక్క రోజు రాకుంటే వానరాలు ఎదురుచూస్తున్నాయని ఫ్రెండ్స్ నాకు చెబుతుంటే, ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక్క రోజు సెలవు దొరికితే ఐదు గంటల పాటు వాటితోనే గడిపేస్తాను.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement