సాక్షి, చెన్నై: ప్రియురాలితో కలిసి బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంలో బయలుదేరిన ప్రియుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన తిరువళ్లూరు సమీపంలో చోటు చేసుకుంది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు ప్రాంతానికి చెందిన కుప్పన్ కుమారుడు శాంతకుమార్(30) అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో మూడేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరి ప్రేమ వ్యవహరం తెలిసి ఇరు కుటుంబీకులు ఇటీవల నిశ్చితార్థం చేసి త్వరలోనే వివాహం చేయాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో కాబోయే భార్యతో కలిసి శాంతకుమార్ శనివారం రాత్రి ఈకాడులోని బంధువుల ఇంటికి బైక్‌లో బయలుదేరాడు. తిరువళ్లూరు సమీపంలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతి స్వల్ప గాయాలతో బయటపడగా, యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తిరువళ్లూరు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమి త్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి కుప్పన్ ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment