దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాల్లో రెసిషన్ భయాలు వెంటాడుతున్న తరుణంలో భారత్‌లో ఏ మాత్రం లాభసాటి లేని బిజినెస్‌లను షట్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వారం రోజుల వ్యవధిలోనే అమెజాన్ తన ఫుడ్ డెలివరీ,ఎడ్యుకేషన్ సర్వీస్‌ను మూసిసేంది. తాజాగా మరో బిజినెస్‌కు స్వస్తి పలికినట్లు సమాచారం.
అమెజాన్ దేశీయంగా డిస్ట్రిబ్యూషన్ సేవల్ని అందిస్తుంది. డిస్ట్రిబ్యూషన్ యూనిట్ కంపెనీల నుండి వినియోగదారులకు, రీటైలర్లకు సంబంధిత ప్రొడక్ట్‌లను డెలివరీ చేస్తుంది. అయితే ఆర్థిక మందగమనం నేపథ్యంలో డిస్టిబ్యూషన్ సర్వీస్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు చెప్పింది. కంపెనీ ఇప్పుడు ప్రధాన వ్యాపారాలపై మరింత దృష్టి పెడుతుందని పేర్కొంది.
అమెజాన్ అకాడమీ టూ అమెజాన్ ఫుడ్
అమెజాన్ ఇండియా తన వార్షిక నిర్వహణ ప్రణాళిక సమీక్ష ప్రక్రియలో భాగంగా ఫుడ్ డెలివరీ సర్వీసుల్ని నిలిపివేసింది. వారం రోజుల ముందు ఎడ్ టెక్ సర్వీస్, అమెజాన్ అకాడమీని సైతం షట్ డౌన్ చేసింది. ముఖ్యంగా కోవిడ్ -19 లాక్‌డౌన్ సమయంలో బైజూస్, అన్ అకాడమీ, వేదాంతు’లు భారీ లాభాల్లో గడిస్తున్న సమయంలో అమెజాన్ అకాడమీని ప్రారంభించిన విషయం తెలిసిందే.
చదవండి👉 ‘మీతో పోటీ పడలేం!’,భారత్‌లో మరో బిజినెస్‌ను మూసేస్తున్న అమెజాన్
Comments
Please login to add a commentAdd a comment