Amazon Issued Public Notice On Reliance Deal: రెండేళ్లుగా నలుగుతున్న ఫ్యూచర్ అమెజాన్ రిలయన్స్ డీల్ వివాదం మరో మలుపు తీసుకుంది. రేపోమాపు ముగింపుకు వస్తుందని అంతా భావిస్తుండగా అమెజాన్ ట్విస్ట్ ఇచ్చింది. తమ అభ్యంతరాలను పరిష్కరించకుండా ముందుకు సాగితే కుదరదంటూ అమెజాన్ బహిరంగంగా తేల్చి చెప్పింది.
బిగ్‌బజార్, ఫాంటాలూన్స్ పేరుతో భారీ రిటైల్ నెట్‌వర్క్‌ను కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూపు నెలకొల్పింది. ఈ క్రమంలో ఫ్యూచర్ గ్రూపులో పెట్టుబడులు పెట్టి మైనర్ వాటాలను అమెజాన్ కొనుగోలు చేసింది. అయితే అమెజాన్ నిర్ణయాలను పరిగణలోకి తీసుకోకుండా ఫ్యూచర్ గ్రూపు మొత్తాన్ని రిలయన్స్‌కి 3.4 బిలియన్ డాలర్లకు అమ్మేస్తూ డీల్ చేసుకున్నారు.
తమ అభిప్రాయానలు పరిగణలోకి తీసుకోకుండా ఫ్యూచర్‌ను రిలయన్స్ ఎలా టేకోవర్ చేస్తుందంటూ అమెజాన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు కోర్టు విచారిస్తోంది. అయితే ఫ్యూచర్ ఆధీనంలో దేశవ్యాప్తంగా విస్తరించిన రిటైల్ స్టోర్లను క్రమంగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటోంది రిలయన్స్ సంస్థ. ఫ్యూచర్ గ్రూపు స్టోర్లను రీబ్రాండ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.
చదవండి: రిలయన్స్ ఆధీనంలోకి ఫ్యూచర్ రిటైల్ స్టోర్స్
వివాదం సుప్రీం కోర్టు పరిధిలో ఉండగా ఫ్యూచర్, రిలయన్స్‌ను రహ్యసంగా ఒప్పందాలు చేసుకుంటున్నాయంటూ అమెజాన్ పబ్లిక్ నోటీస్ పేరుతో ప్రకటన జారీ చేసింది. కోర్టు విచారణలో ఉండగా చట్ట విరుద్ధంగా రహస్య పద్దతుల్లో ఫ్యూచర్, రిలయన్స్ డీల్ చేస్తున్నాయంటూ ఆరోపణలు గుప్పించింది.
వ్యాపార దిగ్గజ కంపెనీల మధ్య పోరు కావడంతో ఫ్యూచర్ వివాదం దేశవ్యాప్తంగా చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా అమెజాన్ ఇచ్చిన పబ్లిక్ నోటీస్‌పై రియలన్స్, ఫ్యూచర్ గ్రూపుల నుంచి ఇంకా స్పందన రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment