లోక్‌సభ ఎన్నికలు ఎంతోమంది ఆకలి బాధ తీరుస్తున్నాయి. తాత్కాలికంగానైనా ఉపాధి కల్పిస్తున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 దాకా ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండడం తెలిసిందే. ఈ ఎన్నికల సీజన్‌లో దేశవ్యాప్తంగా కనీసం 9 లక్షల తాత్కాలిక ఉపాధి అవకాశాలు లభిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా పలు రకాల అవసరాలను తీర్చే విధంగా ఉద్యోగాలుంటాయని ‘వర్క్ ఇండియా’ సీఈవో సహ వ్యవస్థాపకుడు నీలేశ్ దుంగార్‌వాల్ తెలిపారు. ప్రధానంగా డేటా ఎంట్రీ ఉద్యోగాలు, బ్యాక్ ఆఫీస్, డెలివరీ, డ్రైవర్లు, కంటెంట్ రైటింగ్, సేల్స్ వంటి రూపాల్లో ఉపాధి లభిస్తోంది. ఏప్రిల్ 19న తొలి విడత దశ పోలింగ్ నాటికే 2 లక్షల తాత్కాలిక ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచి్చనట్టు సీఐఈఎల్ హెచ్‌ఆర్ డైరెక్టర్ ఆదిత్య నారాయణన్ మిశ్రా తెలిపారు.
డేటా విశ్లేషణ, ప్రణాళిక, ప్రజలతో సంబంధాలు, మార్కెట్ సర్వే, మీడియా సంబంధాలు, కంటెంట్ డిజైన్, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఏఐ స్ట్రాటజీ, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో ఈ అవకాశాలు అందివచి్చనట్టు చెప్పారు. 8 నుంచి 13 వారాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్, ప్రింటింగ్, రవాణా, ఫుడ్, బెవరేజెస్, క్యాటరింగ్, సెక్యూరిటీ, ఐటీ నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్, అనలిటిక్స్‌లో 4 నుంచి 5 లక్షల మందిని తాత్కాలిక ప్రాతిపదికగా నియమించుకుంటున్నట్టు మిశ్రా అంచనా వేశారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment