సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఒప్పంద కార్మికుల కోసం డిమాండ్ పెరిగిందని ఉద్యోగావకాశాలను తెలియజేసే పోర్టల్ ఇండీడ్ వెల్లడించింది. ఇండీడ్ నివేదిక ప్రకారం.. 2019తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–జూలై మధ్య ఉద్యోగార్థుల నుంచి ఒప్పంద, తాత్కాలిక ఉద్యోగాలు కావాలన్న అభ్యర్థనలు 150 శాతం పెరిగాయి. అలాగే ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్న ప్రకటనలు 119 శాతం అధికమయ్యాయి. ఒక్క జూలై నెలలో ఇండీడ్ వేదికగా ఒప్పంద ఉద్యోగాల కోసం చేసిన అన్వేషనలు మూడు రెట్లు పెరిగి 207 శాతం వృద్ధి సాధించాయి. మెయింటెనెన్స్ పర్సన్స్, సర్వీస్ ఇంజనీర్స్ కోసం (ఇన్‌స్టాలేషన్ విభాగం) డిమాండ్ అత్యధికంగా ఉంది. ఈ విభాగం 128 శాతం వృద్ధి సాధించింది. ఉద్యోగ ప్రకటనలు టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ విభాగంలో 43 శాతం, మీడియా 28, మార్కెటింగ్ 18.5, సేల్స్ 12, అడ్మినిస్ట్రేషన్‌లో 4 శాతం పెరిగాయి. మేనేజ్‌మెంట్ 0.8 శాతం, అకౌంటింగ్ 36.5, ఎడ్యుకేషన్ 38 శాతం మైనస్‌లోకి వెళ్లాయి.
Comments
Please login to add a commentAdd a comment