సాక్షి,హైదరాబాద్: తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు ప్రమాదకరంగా క్షీణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో కొత్త ఐటీ ఉద్యోగాలు 2023-24లో మూడింట ఒక వంతుకు పడిపోయాయన్నారు. ఈ మేరకు మంగళవారం(ఆగస్టు 6) కేటీఆర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
2022-23లో తెలంగాణలో ఐటీ రంగంలో 1,27,594 కొత్త ఉద్యోగాల సృష్టి జరగగా 2023-24లో కేవలం 40,285 కొత్త ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వృద్ధికి ఆజ్యం పోసే కీలకమైన ఇంజన్ ఐటీ రంగమని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో అనేక కొత్త విధానాలు, టీఎస్‌ఐపాస్ సింగిల్ విండో పాలసీ చొరవ కారణంగా ఐటీ రంగం అపూర్వమైన వృద్ధిని సాధించిందన్నారు.
ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రెడేషన్, లా అండ్ ఆర్డర్ ఖచ్చితమైన నిర్వహణ రాష్ట్రంలో ఐటీ రంగం వృద్ధిని కొనసాగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. ఈ రెండు రంగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment