contract jobs
-
కాంట్రాక్టు ఏఎన్ఎంలను తొలగించం
హైదరాబాద్: రెగ్యులర్ ఉద్యోగులను నియమించి నప్పటికీ, కాంట్రాక్టు ఏఎన్ఎంలను ఉద్యోగాల నుంచి తీసేయబోమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రిని ఏఎన్ఎంలు కలిసి తమ సమస్యలు విన్నవించారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. అయితే ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని మంత్రి తెలిపారు. ఏఎన్ఎం రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఈ నెల 29న నిర్వహించనున్న పరీక్ష యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు.ఈ పరీక్షకు హాజరయ్యే కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు 30 మార్కులు వెయిటేజీ ఇస్తున్నామని గుర్తుచేశారు. పోస్టుల సంఖ్యను పెంచాలని ఏఎన్ఎంలు కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం నోటిఫికేషన్లో ఇచ్చిన 1,931 పోస్టులకు అదనంగా మరో 323 పోస్టులను కలిపి, ఇదే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రెగ్యులర్ ఉద్యోగం రానివారిని, చివరి వరకూ కాంట్రాక్ట్ ఉద్యోగంలో కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఏఎన్ఎంలు కోరగా, సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
ఉద్యోగ భద్రత కోసం చంటి బిడ్డలతో టీచర్ల ధర్నా
అమరావతి: ‘డీఎస్సీ నుంచి మినహాయించి.. తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్స్ (సీఆర్టీ)గా కన్వర్ట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏడాది మూడు నెలల చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని ధర్నా చేస్తున్న ఈమె పేరు పి.పర్శిక. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూనవరం గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో సైన్స్ టీజీటీగా పనిచేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో తమ పోస్టులు కూడా ఉండడంతో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న తన ఉద్యోగం పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.దాదాపు 237 కిలోమీటర్ల దూరంలోని కూనవరం నుంచి విజయవాడకు వచ్చి తన ఉద్యోగానికి భరోసా కల్పించేలా కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్ (సీఆర్టీ)గా కన్వర్ట్ చేయాలని రోజుల తరబడి ధర్నా చేస్తోంది’.పర్శిక టీచర్‌తోపాటు వందలాది మంది తమ ఊరు, వాడ, గూడు వదిలి వచ్చి విజయవాడ ధర్నా చౌక్‌లో గత 13 రోజులుగా శాంతియుత నిరసన కొనసాగిస్తున్నా సర్కార్ కనికరించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని లోకేశ్ ఓఎస్డీ చెప్పిన గడువు శుక్రవారంతో ముగుస్తుందని, తమ డిమాండ్లపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని గిరిజన గురుకులాల ఔట్ సోర్సింగ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మీనాయక్ గురువారం నాటి కార్యక్రమంలో తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టంచేశారు. – సాక్షి, అమరావతి -
రైల్వే ఉద్యోగాల పేరిట టోకరా
సాక్షి, అమరావతి: రైల్వే ఉద్యోగం అంటే ఆసక్తి చూపంది ఎవరు? దాదాపు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. ఇప్పుడు దీన్నే అస్త్రంగా చేసుకున్న కొందరు మోసగాళ్లు భారీ మోసానికి తెరతీశారు. రైల్వేలో ఉద్యోగాలిస్తామని అభ్యర్థుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నారు. నిరుద్యోగులను నిలువునా ముంచుతున్నారు. రైల్వే శాఖ ఫెసిలిటేటర్ పేరుతో ఇచ్చిన నోటిఫికేషన్‌ను వక్రీకరిస్తూ.. నిరుద్యోగుల నుంచి భారీ వసూళ్లకు తెరతీశారు. కాస్త ఆలస్యంగా గుర్తించిన రైల్వే అధికారులు అసలు అది ఉద్యోగమే కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం విజయవాడ రైల్వే డివిజన్లోఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసగాళ్లు సాగిస్తున్న దందా ఇదీ.. ‘ఏటీవీఎం ఫెసిలిటేటర్’ కోసం రైల్వే శాఖ నోటిఫికేషన్.. రైల్వే స్టేషన్లలో టికెట్లు జారీ చేసే ‘ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు (ఏటీవీఎం) ఫెసిలిటేటర్ల’ కోసం దక్షిణ మధ్య రైల్వే ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. విజయవాడ డివిజన్ పరిధిలోని 26 రైల్వే స్టేషన్లలో 59 మంది ఫెసిలిటేటర్లను నియమిస్తామని అందులో పేర్కొంది. రైల్వే స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసే ఈ ఏటీవీఎం మెషిన్లలో వివరాలు నమోదు చేసి క్రెడిట్ / డెబిట్ కార్డుతో టికెట్ కొనుగోలు చేయొచ్చు. టికెట్ కౌంటర్లలో క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా టికెట్లు పొందేందుకు ఈ ఏటీవీఎం మెషిన్లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా వృద్ధులు, నిరక్షరాస్యులు తదితరులు ఈ మెషిన్లలో వివరాలు సరిగా నమోదు చేయలేరు.అందుకోసం మెషిన్ల వద్ద సహాయకులను నియమించాలని రైల్వే శాఖ భావించింది. మెషిన్ల ద్వారా ఫెసిలిటేటర్లు జారీ చేసే టికెట్లపై వారికి కమీషన్ చెల్లించాలని నిర్ణయించింది. విజయవాడ 9, అనకాపల్లి 3, అనపర్తి 1, బాపట్ల 1, భీమవరం టౌన్ 1, కాకినాడ టౌన్ 1, చీరాల 1, కాకినాడ పోర్ట్ 2, ఏలూరు 2, గూడూరు 4, కావలి 1, మచిలీపట్నం 2, నిడదవోలు 1, నిడుబ్రోలు 2, నెల్లూరు 5, నరసాపురం 1, ఒంగోలు 1, పిఠాపురం 1, పాలకొల్లు 1, రాజమహేంద్రవరం 5, సింగరాయకొండ 2, సామర్లకోట 1, తాడేపల్లిగూడెం 2, తెనాలి 5, తుని 2, యలమంచిలిలో 2 ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేసింది. బోగస్ వెబ్సైట్లతో టోకరా.. రైల్వే శాఖ ఇచి్చన ఈ నోటిఫికేషన్‌ను కొందరు మోసగాళ్లు తప్పుదోవ పట్టించారు. ఏటీవీఎం ఫెసిలిటేటర్ ఉద్యోగాలు రైల్వేలో రెగ్యులర్/కాంట్రాక్టు ఉద్యోగాలు అని నిరుద్యోగులను నమ్మిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. అందుకోసం ఏకంగా బోగస్ వెబ్సైట్లను సృష్టించి యువతను మభ్య పెడుతున్నారు. రైల్వే అధికారులు ఇచి్చన నోటిఫికేషన్‌ను మారి్ఫంగ్ చేసి ఆ నకిలీ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచి దరఖాస్తులు ఆహా్వనిస్తున్నారు.ఒక్కో పోస్టు కోసం రూ.లక్షల్లోనే వసూళ్లకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ఇతర రైల్వే స్టేషన్లలో కూడా ఏటీవీఎం ఫెసిలిటేటర్ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తారని చెబుతూ భారీగా నిరుద్యోగుల నుంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠాలో కొందరు రైల్వే ఉద్యోగులు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. దీంతో వారు అడిగినంత డబ్బులు ఇస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని పలువురు నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు నమ్మి మోసపోతున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే డబ్బులు చెల్లించిన పలువురు ఆ పోస్టుల భర్తీ గురించి రైల్వే ఉన్నతాధికారులను వాకబు చేస్తుండటం గమనార్హం.అవి ఉద్యోగాలు కానే కావు.. రైల్వే జీతాలు ఇవ్వదురైల్వే శాఖ స్పష్టికరణ ఏటీవీఎం ఫెసిలిటేటర్ల కోసం తాము ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీ కోసం కాదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఆ ఫెసిలిటేటర్ అనేది అసలు ఉద్యోగం కానే కాదని తేల్చిచెప్పింది. ఫెసిలిటేటర్‌కు రైల్వే జీతాలు ఇవ్వదని.. ఇతర ఎలాంటి ఉద్యోగ సంబంధమైన ప్రయోజనాలు కలి్పంచదని వెల్లడించింది. కేవలం రిటైర్డ్ రైల్వే సిబ్బంది / నిరుద్యోగుల కోసం జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌ను కొందరు వక్రీకరిస్తున్నారని పేర్కొంది. ఏటీవీఎంల ద్వారా టికెట్లు జారీ చేసే ఫెసిలిటేటర్‌కు ఆ టికెట్ల మొత్తంలో గరిష్టంగా 3 శాతం కమీషన్ మాత్రమే రైల్వే చెల్లిస్తుందని తెలిపింది.అది కూడా గరిష్టంగా 150 కి.మీ.లోపు దూరం ఉన్న స్టేషన్లకే ఏటీవీఎం మెషిన్ల ద్వారా టికెట్లు జారీ చేయడం సాధ్యపడుతుందని వెల్లడించింది. అంటే ఏటీవీఎం ఫెసిలిటేటర్లకు కమీషన్ మొత్తం నామమాత్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. కాబట్టి ఏటీవీఎం ఫెసిలిటేటర్ పోస్టులు అనేవి రెగ్యులర్ ఉద్యోగాలో, కాంట్రాక్టు ఉద్యోగాలో కాదనే విషయాన్ని నిరుద్యోగులు గుర్తించాలని విజయవాడ రైల్వే డీఆర్ఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రైల్వేలో ఉద్యోగాల కోసం రైల్వే శాఖ అధికారిక వెబ్సైట్ www. scr. indianrailways.gov.in ను సంప్రదించాలని సూచించింది. -
కదం తొక్కిన ఆశవర్కర్లు
సుల్తాన్‌బజార్(హైదరాబాద్): వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు సోమవారం ఇక్కడి కోఠి ఉమెన్స్ కళాశాల చౌరస్తాలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఒక్కసారిగా వేలసంఖ్యలో ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు తరలిరావడంతో ఉమెన్స్ కళాశాల చౌరస్తా జనసంద్రాన్ని తలపించింది. ఎక్కడికక్కడే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చాదర్‌ఘాట్ నుంచి కోఠి బ్యాంక్‌స్ట్రీట్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒక్కసారిగా వేలాదిమంది చౌరస్తాలో బైఠాయించడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. ఆశాలు, ఏఎన్‌ఎంలతోపాటు వైద్యశాఖలో పనిచేస్తున్న వివి ధ కేడర్ల కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగించారు. దీంతో ఈ ప్రాంతంలో పోలీసులు భారీ బలగాలను మోహరించారు. -
దరఖాస్తు గడువు నేడు.. కాంట్రాక్టు ముగిసేది ఎల్లుండి!
సాక్షి, హైదరాబాద్: ఇన్సూరెన్స్ మెడికల్ సర్విసెస్ (ఐఎంఎస్) డైరెక్టరేట్ పరిధిలోని కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అభ్యర్థుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. ఉద్యోగ ప్రకటననుంచి దరఖాస్తు ప్రక్రియ వరకు అపోహలు తలెత్తుతుండటం..దీనిపై అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఐఎంఎస్ ఆ«ద్వర్యంలో నిర్వహిస్తున్న ఈఎస్ఐ ఆస్పత్రుల్లో 231 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అత్యవసర కేటగిరీకి చెందిన ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయాలంటూ కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణికుముదిని ఉత్తర్వులు జారీచేశారు. దీని ప్రకారం ఐఎంఎస్.. జిల్లాల వారీగా ఖాళీలను ప్రకటిస్తూ నోటిఫికేషన్లు ఇచ్చింది. వీటిని జిల్లా స్థాయి కమిటీల ద్వారా భర్తీ చేస్తారు. కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, ఐఎంఎస్ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడుకన్వీనర్గా, డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్, ఈఎస్ఐ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్లు సభ్యులుగా ఉంటారు. దరఖాస్తు ప్రక్రియలో లోపాలు దరఖాస్తులను మాన్యువల్ పద్ధతిలోనే స్వీకరించనున్నట్లు ఐఎంఎస్ నోటిఫికేషన్లో పేర్కొంది. దరఖాస్తుల స్వీకరణకు ఐఎంఎస్ రీజినల్ డైరెక్టర్ కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు. సాధారణంగా మాన్యువల్ పద్ధతిలో దరఖాస్తు తీసుకున్నాక.. దరఖాస్తుకు జతచేసిన పత్రాలకు సంబంధించిన చెక్లిస్ట్ను అభ్యర్థికి రసీదు రూపంలో ఇవ్వాలి. అయితే, ఇక్కడ అలాంటిదేమీ జరగట్లేదు. దీంతో పోస్టుల భర్తీలో అవకతవకలకు ఆస్కారం ఉందంటూ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు జిల్లాల వారీగా ఉద్యోగ ప్రకటనలో రోస్టర్, రిజర్వేషన్ అంశాలను ప్రస్తావించకపోవడాన్నీ తప్పుబడుతున్నారు. కాంట్రాక్టు ఎప్పటివరకు? కారి్మకశాఖ జారీచేసిన జీఓ 25 ప్రకారం ఐఎంఎస్‌లో 231 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి సంబంధించినఏడాది కాంట్రాక్టు గడువు ఈనెల 31తో ముగియనుంది. ఒకవైపు 31వ తేదీతో కాంట్రాక్టు గడువు ముగియనుండగా.. 29 వరకు దరఖాస్తులను స్వీకరిస్తుండటం గమనార్హం. ఈనెల 30కల్లా ఇంటర్వ్యూలు నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్లు వెనువెంటనే జారీచేసినా అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరే నాటికే కాంట్రాక్టు గడువు ముగుస్తుందని ఐఎంఎస్ అధికారులే చెబుతున్నారు. ఈ నిబంధన కూడా ఉద్యోగార్థుల్లో గందరగోళం రేకెత్తిస్తోంది. -
ఎస్ఎస్ఏ పోస్టుల భర్తీలో టీడీపీ నేతల మాయాజాలం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: చేసిన పాపాలు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయంటారు పెద్దలు. అది నిజమని తెలుగుదేశం పార్టీ నేతల విషయంలో మరోసారి తేలిపోయింది. అప్పటికి అధికారం చేతిలో ఉంది కదా అని కాంట్రాక్టు ఉద్యోగుల భర్తీలో తెలుగు తమ్ముళ్లు అడ్డగోలుగా లక్షల రూపాయలు మింగేశారు. అధికారానికి చివరి ఘడియల్లో ఉన్న సమయంలో నాలుగేళ్ల క్రితం.. 2019లో ఈ అవినీతి బాగోతాన్ని గుట్టు చప్పుడు కాకుండా కానిచ్చేశారు. నాటి పోస్టుల భర్తీలో అన్యాయానికి గురైన కొందరు ఇటీవల అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు ఫిర్యాదు చేయడంతో టీడీపీ నాయకుల బండారం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కార్యాలయంలో నాటి ఫైళ్లను సీజ్ చేశారు. దీంతో నాడు పోస్టుల భర్తీలో చక్రం తిప్పిన అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ పోస్టుల మాయాజాలం వివరాలివీ.. నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతను 2019 జనవరిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎస్‌ఎస్‌ఏకి అప్పగించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్ఏలో ఖాళీగా ఉన్న 2,600 పైగా పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా నాటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 400 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. వీటిలో అన్ని కేటగిరీలకూ చెందిన 242 పోస్టులు భర్తీ చేశారు. ఇందులో ఇండియన్ సెక్యూరిటీ సర్వీసెస్ పేరుతో ఔట్సోర్సింగ్ ఏజెన్సీ, ఎస్ఎస్ఏ అధికారులు కీలక పాత్ర పోషించారు. భారీ పోటీయే అవకాశంగా.. మార్కులు, రోస్టర్ పాయింట్లు, కులం ప్రాతిపదికన ఏర్పాటు చేసిన మార్గదర్శకాలతో ఉద్యోగ నియామకానికి సమగ్ర శిక్ష అధికారులు ప్రకటన విడుదల చేశారు. పోస్టును బట్టి రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకూ జీతం ఉండటంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు పోటీ పడ్డారు. కాంట్రాక్టు పోస్టులే అయినప్పటికీ ప్రభుత్వంలో పని చేసిన సర్వీసు రికార్డు, ఎప్పుడైనా క్రమబద్ధీకరిస్తారనే ఆశతో మొత్తం 242 పోస్టులకు 3 వేల మందికి పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు నలుగురైదుగురి వరకూ పోటీ పడ్డారు. ఇదే అదనుగా తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగారు. కాకినాడ ఎస్ఎస్ఏ కార్యాలయంలో చక్రం తిప్పిన ఉద్యోగులతో కుమ్మక్కై లక్షల రూపాయలు దిగమింగి పోస్టింగులు ఇచ్చేశారు. పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ వసూలు చేసి మింగేశారు. తెలుగు తమ్ముళ్లే తెర వెనుక ఉండి ఈ మొత్తం వ్యవహారం నడిపించడంతో అప్పట్లో పెదవి విప్పేందుకు ఎవరూ సాహసం చేయలేదు. అయితే ఆ పాపం పండే రోజు రానే వచ్చింది. అనర్హులకు కూడా పోస్టింగులు ఇవ్వడంతో కడుపు మండిన అర్హుల్లో పలువురు ఈ బాగోతంపై ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో రాజమహేంద్రవరంలోని ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. నాటి పోస్టుల భర్తీకి సంబంధించి సమగ్ర సమాచారాన్ని రెండు రోజుల క్రితమే కాకినాడలోని ఎస్ఎస్ఏ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్నారు. నాడు జరిగిన పోస్టుల భర్తీ ప్రక్రియ, నియమితులైన వారి విద్యార్హతలు తదితర వివరాలు సేకరిస్తున్నారు. నాటి ముఖ్య ప్రజాప్రతినిధి ప్రమేయం! కాకినాడకు చెందిన అప్పటి టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధి, కాకినాడ ప్రభుత్వాసుపత్రి(జీజీహెచ్)లో ఔట్సోర్సింగ్ వ్యవహారాలను చక్కబెట్టిన, నాడు టీడీపీ ప్రచార బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు తెర వెనుక ఉండి ఈ బాగోతాన్ని నడిపించారు. వీరితో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు చక్రం తిప్పారనే కోణంలో విచారణ సాగుతోంది. పోస్టులను పంచేసుకుని ఒక్కో ఉద్యోగానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ వసూలు చేసిన ఉద్యోగులు ఎవరు, వారిలో ఎవరి పాత్ర ఎంత, వారికి సహకరించిన బయటి వ్యక్తులు ఎవరనే వివరాలను ఏసీబీ సేకరిస్తోంది. అర్హతల ఆధారంగా రోస్టర్ పాయింట్లు లేకపోవడం, లేని విద్యార్హతలు సృష్టించి పోస్టుల భర్తీలో అవకతవకలకు పాల్పడటం వంటివి జరిగాయని చెబుతున్నారు. ఈ పరిణామంతో నాడు పోస్టుల భర్తీలో తెలుగు తమ్ముళ్లతో మిలాఖత్ అయిన అధికారులు, ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పై నుంచి కింది స్థాయి వరకూ సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది ఒక్కొక్కరు నాలుగైదు పోస్టుల వంతున పంచేసుకుని.. రూ.లక్షలు దిగమింగిన విషయం ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది. -
ఒప్పంద కార్మికులకు పెరిగిన డిమాండ్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఒప్పంద కార్మికుల కోసం డిమాండ్ పెరిగిందని ఉద్యోగావకాశాలను తెలియజేసే పోర్టల్ ఇండీడ్ వెల్లడించింది. ఇండీడ్ నివేదిక ప్రకారం.. 2019తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–జూలై మధ్య ఉద్యోగార్థుల నుంచి ఒప్పంద, తాత్కాలిక ఉద్యోగాలు కావాలన్న అభ్యర్థనలు 150 శాతం పెరిగాయి. అలాగే ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్న ప్రకటనలు 119 శాతం అధికమయ్యాయి. ఒక్క జూలై నెలలో ఇండీడ్ వేదికగా ఒప్పంద ఉద్యోగాల కోసం చేసిన అన్వేషనలు మూడు రెట్లు పెరిగి 207 శాతం వృద్ధి సాధించాయి. మెయింటెనెన్స్ పర్సన్స్, సర్వీస్ ఇంజనీర్స్ కోసం (ఇన్స్టాలేషన్ విభాగం) డిమాండ్ అత్యధికంగా ఉంది. ఈ విభాగం 128 శాతం వృద్ధి సాధించింది. ఉద్యోగ ప్రకటనలు టెక్నాలజీ, సాఫ్ట్వేర్ విభాగంలో 43 శాతం, మీడియా 28, మార్కెటింగ్ 18.5, సేల్స్ 12, అడ్మినిస్ట్రేషన్‌లో 4 శాతం పెరిగాయి. మేనేజ్మెంట్ 0.8 శాతం, అకౌంటింగ్ 36.5, ఎడ్యుకేషన్ 38 శాతం మైనస్‌లోకి వెళ్లాయి. -
జీతం రాక పస్తులు
సాక్షి, అమరచింత : ఒకటి కాదు.. రెండు కాదు.. 11 నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో రక్షిత తాగునీటి పథకాల్లో పనిచేస్తున్న కార్మికులు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బకాయి వేతనాల కోసం ఎదురుచూస్తు అర్దాకలితో అలమటిస్తు ఆందోళనలకు పూనుకునే పరిస్థితి దాపురించింది. ఉమ్మడి జిల్లా పరిదిలోని 20 రక్షిత తాగునీటి పథకాలలో నాలుగువేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.6500 నుండి రూ.8500 ల వరకు నెలనెలా వేతనాలను సంబందిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెల్లించేవారు. ప్రస్తుతం నెలసరి వేతనాలను చెల్లించడానికి ప్రభుత్వం విముఖత చూపుతూ 14వ ఆర్థికసంఘం నిధులలోనే గ్రామపంచాయతీ ఆధీనంలో వాటర్వర్కర్లకు వేతనాలను చెల్లించాలని ఆదేశించారు. దీంతో 11 నెలలుగా ఇటు గ్రామపంచాయతీ గానీ, అటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గాని వేతనాల వ్యవహారంలో స్పష్టత చూపలేక పోతున్నారు. వాటర్‌గ్రిడ్ పథకాన్ని అనుసంధానం చేస్తున్నామని రక్షిత తాగునీటి పథకాలలో పనిచేస్తున్న సిబ్బందిని ఉద్యోగులుగా గుర్తిస్తామని ప్రభుత్వం చెప్పిన హామీలు కూడా నెరవేరక పోవడంతో 11 నెలల వేతనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు దాపరించాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.. పాలమూరు ఉమ్మడి జిల్లాలో 20 సంవత్సరాల క్రితం కొడంగల్ వద్ద కాగ్నా వద్ద రక్షిత తాగునీటి పథకాన్ని మొట్టమొదటి సారిగా ప్రారంభించారు. వీటితో పాటు రామన్‌పాడు, రాజోలి, రేవులపల్లి, మక్తల్, ఆత్మకూర్, దేవరకద్ర, బాలకిష్టాపురం, గోపన్‌పేట, అచ్చంపేట, ఆమన్‌గల్లు, కల్వకుర్తి, కోయిలకొండ, జడ్చర్ల, షాద్‌నగర్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ లలో రక్షిత తాగునీటి పథకాలను ఏర్పాటుచేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తాగునీటి సరఫరాను అందచేస్తున్నారు. వీటిలో సత్యసాయి తాగునీటి పథకానికి సంబందించిన వర్కర్లు ఎల్అండ్టీ కంపెనీ ఒప్పందంతో కేవలం 6 నెలల వేతనాలు పొందాల్సి ఉంది. మిగతా స్కీంలలో పనిచేస్తున్న సిబ్బంది 11 నెలలుగా వేతనాల కోసం పరితపిస్తున్నారు. కొంపముంచిన 14వ ఆర్థిక సంఘం నిధులు గ్రామపంచాయతీకి మంజూరైన 14వ ఆర్థికసంఘం నిధుల ద్వారానే రక్షిత తాగునీటి పథకాలలో పనిచేస్తున్న వాటర్వర్కర్స్కు ఆ యా గ్రామపంచాయతీలకు అందుతున్న తాగు నీటి సరఫరా ద్వారా సిబ్బందికి వేతనాలను పంచాయతీ ద్వారానే చెల్లించాలి. కాగా 14వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు తక్కువ మొత్తంలో వస్తున్న కారణంగా ఒక్కో కార్మికుడికి రూ.8,500 ఉన్న వేతనాన్ని చెల్లించలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో కాంట్రాక్టు వ్యవస్థ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అప్పట్లో రక్షిత తాగునీటి పథకాలలో పనిచేస్తున్న వర్కర్లకు వేతనాలను చెల్లించేవారు. పంచాయతీలకు మంజూరైన 14వ ఆర్థికసంఘం నిధులనే వేతనాల కోసం వాడుకోవాలని ఆదేశించడంతో కార్మికుల వేతనాల సమస్య తీవ్రరూపం దాల్చింది. -
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల భర్తీ
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు పద్ధతిలో 101 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పోస్టుల భర్తీకి అనుమ తిస్తూ పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా మంగళ వారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది కాలానికి అభ్యర్థులను ఈ ఉద్యోగాల్లో నియమి స్తారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కాంట్రాక్టును పొడిగిస్తారు. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 29%, వికలాంగులకు 3% రిజర్వేషన్ అమలు చేస్తారు. ఈ కమిటీలో పశుసంవర్థకశాఖ డైరెక్టర్, జాయింట్ సెక్రటరీ, పీవీఎన్ఆర్ వెటర్న రీ వర్సిటీ డీన్లు ఉన్న రాష్ట్రస్థాయి ఎంపిక కమిటీ ఈ పోస్టులను భర్తీచేయ నుంది. ఈ పోస్టులకు బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండ రీ (బీవీఎస్సీ అండ్ ఏహెచ్) డిగ్రీ ఉన్న వారు అర్హులు. వారికి రూ. 35 వేలు వేతనంగా నిర్ధారించారు. నియామకాలు పొందిన వారిని ఎటువంటి షరతులు లేకుండా 30 రోజుల నోటీసుతో ఎప్పుడైనా తొలగించే అవకాశముంది. -
కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు
కాజీపేట రూరల్ : హన్మకొండ మండలం కడిపికొండలోని కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. కేంద్రీయ విద్యాలయంలో హిందీ, ఇంగ్లిష్, సాంఘిక, ప్రాథమిక తరగతులను బోధించేందుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ హనుముల సిద్దరాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా ఈనెల 26వ తేదీన కేంద్రీయ విద్యాలయంలో జరిగే ఇంటర్వూ్యలకు హాజరుకావాలని కోరారు. వివరాల కోసం వెబ్ సైట్ ఠీఠీఠీ జుఠిఠ్చీట్చnజ్చl.ౌటజలో చూడాలని తెలిపారు. -
ఎస్కే వర్సిటీలో విద్యార్థుల ధర్నా
అనంతపురం: కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ విద్యార్థులు సోమవారం భారీ ధర్నాకు దిగారు. అనంతరంపురంలోని వర్సిటీ సమీపంలో జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ధర్నాతో రహదారిపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో చర్చిస్తున్నారు. -
అమ్మకానికి ఆపరేటర్ పోస్టులు..!
సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్టు ఉద్యోగాలకు బేరం 50 పోస్టుల భర్తీకి రూ. కోటి వసూలు చేసిన మధ్యవర్తులు నిరుద్యోగుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్న అధికారపార్టీ నేతలు సాక్షి, కర్నూలు : విద్యుత్తు సబ్స్టేషన్లలో కాంట్రాక్టు ఉద్యోగాలకు అధికారపార్టీ నేతలు బేరం పెట్టారు. లోఓల్జేజీ సమస్య పరిష్కారం, నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసేందుకు ఉన్న సబ్స్టేషన్లు, ప్రస్తుతం నూతనంగా నిర్మించిన పలు విద్యుత్తు ఉపకేంద్రాలు కొందరు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసే షిఫ్టు ఆపరేటర్లు, నైట్‌వాచ్‌మెన్ పోస్టులు కర్నూలు జిల్లాలో రూ. లక్షలు పలుకుతున్నాయి. నిరుద్యోగ యువత నుంచి బాగా డిమాండ్ ఉండడంతో ఒక్కో పోస్టు రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు పలుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ పోస్టుల భర్తీకి ఆ పార్టీ నేతల సిఫారసులు అధికమయ్యాయి. ఇప్పటికే ఓ 50 పోస్టుల భర్తీ వ్యవహారంలో మధ్యవర్తులు రూ. కోటి వరకు వసూలు చేసినట్లు అంచనా. ఒక్కో సబ్‌స్టేషన్‌లో నలుగురు షిప్టు ఆపరేటర్లు, ఒక నైట్ వాచ్మెన్ పనిచేయాల్సి ఉంది. నాలుగు డివిజన్లలోని 199 సబ్-స్టేషన్లకు కలిసి మొత్తం 130 ఖాళీ పోస్టులున్నాయి. వీరిని కాంట్రాక్టు పద్ధతిలో డిస్కం అధికారులు నియమిస్తారు. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్న కొందరు అధికారపార్టీ నేతలు ఆ పోస్టులను విక్రయించే సంప్రదాయానికి తెరలేపారు. షిఫ్టు ఆపరేటర్ పోస్టుకు ఐటీఐ ఎలక్ట్రికల్ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. నైట్‌వాచ్‌మెన్ పోస్టుకు మాత్రం ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. అయితే కాంట్రాక్టు పద్ధతి అయినా ఉద్యోగం పొందితే పర్మినెంట్ చేసే అవకాశం, ఇతరత్రా పోస్టులకు పదోన్నతి పొందే వీలుండడంతో నిరుద్యోగుల నడుమ తీవ్ర పోటీ నెలకొంది. సబ్స్టేషన్లలోని పోస్టులు పరిమితంగా ఉండడం, అవకాశం అరుదుగా రావడంతో ఒక్కో పోస్టుకు వందలాది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీటితోపాటు కర్నూలు, డోన్, ఆదోని, నంద్యాల డివిజన్లలో సుమారు 8 వరకు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం ఇటీవల పూర్తయింది. ఈ సబ్‌స్టేషన్లలోనూ షిప్టు ఆపరేటర్లు, నైట్ వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. నాయకుల చేతివాటం.. పోస్టులు తక్కువ, అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో పోటీ ఎక్కువైంది. ప్రస్తుతం ఉన్న ఖాళీలతోపాటు ఆదోని, నంద్యాలలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్లలో పోస్టులు భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదే అదనుగా షిఫ్టు ఆపరేటర్, నైట్‌వాచ్‌మెన్ పోస్టులను కొందరు అధికారపార్టీ నాయకులు విక్రయించడం ప్రారంభించారు. నిరుద్యోగుల పోటీని బట్టీ ఒక్కో పోస్టును రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు చెపుతున్నారు. ఉద్యోగం వస్తుందనే ఆశతో కొందరు నిరుద్యోగులు ఇప్పటికే మొదటి విడతగా రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు మధ్యవర్తులకు అప్పగించారు. మరికొందరు తాము ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువత నుంచి అందినంత మేర దండుకునే పనిలో నిమగ్నమయ్యారు. వీటితో పాటు నూతనంగా నిర్మించిన సబ్స్టేషన్లలో ఏర్పడిన ఖాళీ పోస్టులకు ఇదే విధంగా రూ. లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ఇక పర్మినెంట్
192 మంది పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణ ఆమోదించిన జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు సిద్ధం చేస్తున్న అధికారులు డిగ్రీ విద్యార్హతే ప్రామాణికం 15 వేల నిరుద్యోగ అభ్యర్థులకు మిగిలేవి 6 పోస్టులే ! సాక్షి, సంగారెడ్డి: కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త. చాలీచాలని వేతనాలతో ఏళ్ల తరబడి ఊడిగం చేస్తున్న ‘కాంట్రాక్టు’ ఉద్యోగులు ఎట్టకేలకు పర్మినెంట్ అయ్యారు. డిగ్రీ విద్యార్హత కలిగిన 192 మంది కాంట్రాక్టు కార్యదర్శులను క్రమబద్దీకరిస్తూ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం అధికారులు ఉద్యోగుల క్రమబద్దీకరణ ఉత్తర్వులు సిద్ధం చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో కాంట్రాక్టు కార్యదర్శుల చేతికి ఈ ఉత్తర్వులు అందనున్నాయి. కాంట్రాక్టు కార్యదర్శుల గత సర్వీసు కాలాన్ని పరిగణలోకి తీసుకోకుండా కొత్తగా ఉద్యోగంలో చేరినట్లు సర్వీసును లెక్కించనున్నారు. క్రమబద్దీకరణ తర్వాత వీరికి రూ.7,520-రూ.22,430 పే స్కేల్ అమలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యూనల్ మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా క్రమబద్దీకరణ తంతు పూర్తి చేసినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 204 మంది కాంట్రాక్టు కార్యదర్శులు పనిచేస్తుండగా వారిలో డిగ్రీ విద్యార్హత కల్గిన వారు 192 మందిని పర్మినెంట్ చేశారు. ఇక ఇంటర్ విద్యార్హత గల మిగిలిన 12 మందిని విధుల తొలగించకుండా కాంట్రాక్టు ప్రాతిపదికన కొనసాగిస్తామని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. భవిష్యత్తులో వారు డిగ్రీ విద్యార్హత సాధిస్తే ఉద్యోగాన్ని క్రమబద్దీకరించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. మిగిలినవి ఆ..రు పదిహేను వేల మందికి పైగా అభ్యర్థులు.. పోస్టులేమో ఆరు !. ప్రస్తుతం ఈ విచిత్ర పోటీ పంచాయతీ కార్యదర్శుల భర్తీలో ఏర్పడింది. 210 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్ 31న జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేయగా, గడువులోగా 15,432 దరఖాస్తులొచ్చిన విషయం తెలిసిందే. ట్రిబ్యూనల్ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం..డిగ్రీ అర్హత గల 192 కాంట్రాక్టు కార్యదర్శుల క్రమబద్దీకరించడంతో పాటు ఇంటర్ అర్హత గల 12 మంది కార్యదర్శుల పోస్టులను ఎవరికీ కేటాయించకుండా తుది ఆదేశాలు విడుదలయ్యే వరకు రిజర్వు చేసి పెట్టనున్నారు. ఎంటెక్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ తదితర ఉన్నత విద్య కోర్సులు చదివిన వేల మంది నిరుద్యోగుల పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్-4) పోస్టుల కోసం అప్పట్లో దరఖాస్తు చేసుకున్నారు. 210 పోస్టుల్లో 204 పోస్టులు కాంట్రాక్టు కార్యదర్శులకు పోగా..ఇక నిరుద్యోగ అభ్యర్థులకు 6 పోస్టులు మాత్రమే మిగిలాయి. మెరిట్ ప్రాతిపదికన ఈ ఆరు పోస్టులను నిరుద్యోగ అభ్యర్థులతో భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు.