
సాక్షి, హైదరాబాద్: ఇన్సూరెన్స్ మెడికల్ సర్విసెస్ (ఐఎంఎస్) డైరెక్టరేట్ పరిధిలోని కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అభ్యర్థుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. ఉద్యోగ ప్రకటననుంచి దరఖాస్తు ప్రక్రియ వరకు అపోహలు తలెత్తుతుండటం..దీనిపై అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఐఎంఎస్ ఆ«ద్వర్యంలో నిర్వహిస్తున్న ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో 231 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
అత్యవసర కేటగిరీకి చెందిన ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయాలంటూ కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణికుముదిని ఉత్తర్వులు జారీచేశారు. దీని ప్రకారం ఐఎంఎస్.. జిల్లాల వారీగా ఖాళీలను ప్రకటిస్తూ నోటిఫికేషన్లు ఇచ్చింది. వీటిని జిల్లా స్థాయి కమిటీల ద్వారా భర్తీ చేస్తారు. కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, ఐఎంఎస్ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడుకన్వీనర్గా, డీఎంహెచ్‌ఓ, డీసీహెచ్ఎస్, ఈఎస్‌ఐ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్‌లు సభ్యులుగా ఉంటారు.
దరఖాస్తు ప్రక్రియలో లోపాలు
దరఖాస్తులను మాన్యువల్ పద్ధతిలోనే స్వీకరించనున్నట్లు ఐఎంఎస్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. దరఖాస్తుల స్వీకరణకు ఐఎంఎస్ రీజినల్ డైరెక్టర్ కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు. సాధారణంగా మాన్యువల్ పద్ధతిలో దరఖాస్తు తీసుకున్నాక.. దరఖాస్తుకు జతచేసిన పత్రాలకు సంబంధించిన చెక్‌లిస్ట్‌ను అభ్యర్థికి రసీదు రూపంలో ఇవ్వాలి.
అయితే, ఇక్కడ అలాంటిదేమీ జరగట్లేదు. దీంతో పోస్టుల భర్తీలో అవకతవకలకు ఆస్కారం ఉందంటూ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు జిల్లాల వారీగా ఉద్యోగ ప్రకటనలో రోస్టర్, రిజర్వేషన్ అంశాలను ప్రస్తావించకపోవడాన్నీ తప్పుబడుతున్నారు.
కాంట్రాక్టు ఎప్పటివరకు?
కారి్మకశాఖ జారీచేసిన జీఓ 25 ప్రకారం ఐఎంఎస్లో 231 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి సంబంధించినఏడాది కాంట్రాక్టు గడువు ఈనెల 31తో ముగియనుంది. ఒకవైపు 31వ తేదీతో కాంట్రాక్టు గడువు ముగియనుండగా.. 29 వరకు దరఖాస్తులను స్వీకరిస్తుండటం గమనార్హం.
ఈనెల 30కల్లా ఇంటర్వ్యూలు నిర్వహించి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు వెనువెంటనే జారీచేసినా అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరే నాటికే కాంట్రాక్టు గడువు ముగుస్తుందని ఐఎంఎస్ అధికారులే చెబుతున్నారు. ఈ నిబంధన కూడా ఉద్యోగార్థుల్లో గందరగోళం రేకెత్తిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment