ESI hospitals
-
రాజమండ్రిలో వైద్యసేవలందించేందుకు సిద్ధమవుతోన్న ESI హాస్పిటల్
-
దరఖాస్తు గడువు నేడు.. కాంట్రాక్టు ముగిసేది ఎల్లుండి!
సాక్షి, హైదరాబాద్: ఇన్సూరెన్స్ మెడికల్ సర్విసెస్ (ఐఎంఎస్) డైరెక్టరేట్ పరిధిలోని కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అభ్యర్థుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. ఉద్యోగ ప్రకటననుంచి దరఖాస్తు ప్రక్రియ వరకు అపోహలు తలెత్తుతుండటం..దీనిపై అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఐఎంఎస్ ఆ«ద్వర్యంలో నిర్వహిస్తున్న ఈఎస్ఐ ఆస్పత్రుల్లో 231 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అత్యవసర కేటగిరీకి చెందిన ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయాలంటూ కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణికుముదిని ఉత్తర్వులు జారీచేశారు. దీని ప్రకారం ఐఎంఎస్.. జిల్లాల వారీగా ఖాళీలను ప్రకటిస్తూ నోటిఫికేషన్లు ఇచ్చింది. వీటిని జిల్లా స్థాయి కమిటీల ద్వారా భర్తీ చేస్తారు. కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, ఐఎంఎస్ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడుకన్వీనర్గా, డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్, ఈఎస్ఐ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్లు సభ్యులుగా ఉంటారు. దరఖాస్తు ప్రక్రియలో లోపాలు దరఖాస్తులను మాన్యువల్ పద్ధతిలోనే స్వీకరించనున్నట్లు ఐఎంఎస్ నోటిఫికేషన్లో పేర్కొంది. దరఖాస్తుల స్వీకరణకు ఐఎంఎస్ రీజినల్ డైరెక్టర్ కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు. సాధారణంగా మాన్యువల్ పద్ధతిలో దరఖాస్తు తీసుకున్నాక.. దరఖాస్తుకు జతచేసిన పత్రాలకు సంబంధించిన చెక్లిస్ట్ను అభ్యర్థికి రసీదు రూపంలో ఇవ్వాలి. అయితే, ఇక్కడ అలాంటిదేమీ జరగట్లేదు. దీంతో పోస్టుల భర్తీలో అవకతవకలకు ఆస్కారం ఉందంటూ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు జిల్లాల వారీగా ఉద్యోగ ప్రకటనలో రోస్టర్, రిజర్వేషన్ అంశాలను ప్రస్తావించకపోవడాన్నీ తప్పుబడుతున్నారు. కాంట్రాక్టు ఎప్పటివరకు? కారి్మకశాఖ జారీచేసిన జీఓ 25 ప్రకారం ఐఎంఎస్‌లో 231 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి సంబంధించినఏడాది కాంట్రాక్టు గడువు ఈనెల 31తో ముగియనుంది. ఒకవైపు 31వ తేదీతో కాంట్రాక్టు గడువు ముగియనుండగా.. 29 వరకు దరఖాస్తులను స్వీకరిస్తుండటం గమనార్హం. ఈనెల 30కల్లా ఇంటర్వ్యూలు నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్లు వెనువెంటనే జారీచేసినా అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరే నాటికే కాంట్రాక్టు గడువు ముగుస్తుందని ఐఎంఎస్ అధికారులే చెబుతున్నారు. ఈ నిబంధన కూడా ఉద్యోగార్థుల్లో గందరగోళం రేకెత్తిస్తోంది. -
ఈఎస్ఐ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్!
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో పనిచేసే ఉద్యోగులు విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే అన్ని ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రధాన ఆస్పత్రుల్లో ఇప్పటికే బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ మెషీన్లు నామమాత్రంగా పనిచేయడం... తరచూ మొరాయించడంతో పాత విధానాన్నే అనుసరిస్తున్నారు. తాజాగా ప్రతి ఆస్పత్రికి బయోమెట్రిక్ మెషీన్లు కొనుగోలు చేసి పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. గతవారం సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి బయోమెట్రిక్ హాజరుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు రెండ్రోజుల క్రితం ఈఎస్ఐ డైరెక్టరేట్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. డిసెంబర్ నెలాఖరు కల్లా.... రాష్ట్రంలో ఈఎస్ఐ పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు మరో మూడు ఆస్పత్రులు, 70 డిస్పెన్సరీలు ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని ఈఎస్ఐసీ నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని మిగతా 3 ఆస్పత్రులు, 70 డిస్పెన్సరీల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. అధికారులు చేసిన పత్రిపాదనలకు ప్రభుత్వ ఆమోదం రాగానే పది రోజుల్లో మెషీన్లు ఏర్పాటు చేయనున్నారు. మెషీన్ల నిర్వహణ కోసం తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్‌తో అవగాహన కుదుర్చుకోనున్నట్లు సమాచారం. అలసత్వం వహిస్తే వేతనం కట్... ఉద్యోగులకు ప్రతి నెలా హాజరు శాతానికి అనుగుణంగానే వేతనాలు ఇవ్వనున్నట్లు మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించిన వారిపైనా చర్యలు తీసుకుంటామని, ప్రతి ఆస్పత్రిలో ఫిర్యాదుల పెట్టెతో పాటు వాట్సాప్, సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు స్వీకరించేలా ప్రత్యేక విభాగాన్ని నిర్వహించాలని యోచిస్తున్నట్లు మంత్రి చెప్పారు. -
పరీక్షల్లేవు... మందుల్లేవు
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అందుతున్న వైద్యసేవలకు తార్కాణమిది. ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన ఈఎస్ఐ ఆస్పత్రులు సంకట స్థితిలో ఉన్నాయి. పలు విభాగాల్లో సంతృప్తికరస్థాయిలో వైద్యులు, సిబ్బంది ఉన్నా మౌలిక వసతుల లేమి రోగులను వెక్కిరిస్తోంది. వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన బాధితులు బిత్తరపోతున్నారు. వైద్య పరికరాలు లేని కారణంగా డాక్టర్లే ప్రైవేటు బాట పట్టిస్తున్నారు. కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, నాలుగు ప్రధాన ఆస్పత్రులు, రెండు డయాగ్నస్టిక్ కేంద్రాలు, 70 డిస్పెన్సరీలున్నాయి. ఇందులో సనత్‌నగర్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తిగా ఈఎస్ఐసీ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతుండగా.. నాచారం, ఆర్సీపురం, సిర్పూర్–కాగజ్‌నగర్, వరంగల్ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కార్మిక రాజ్య బీమా విభాగం వైద్యసేవలను పర్యవేక్షిస్తోంది. ఆ ఆస్పత్రి మినహా తక్కిన ఆస్పత్రుల్లో వైద్యసేవలు గందరగోళంలో పడ్డాయి. పర్యవేక్షణ లోపం, మౌలికవసతుల కల్పన తదితర కారణాలతో ఇక్కడికి వచ్చే బాధితులకు సకాలంలో సరైన వైద్యం అందకప్రైవేటు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి. ఈ ఆస్పత్రులు విభిన్నం... సాధారణంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆస్పత్రులతో ఈఎస్ఐ ఆస్పత్రులను పోల్చలేం. రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిగా ప్రభుత్వ బడ్జెట్‌తో నిర్వహిస్తారు. ఇక్కడ రోగుల నుం చి ఎలాంటి ఫీజులు స్వీకరించరు. కానీ ఈఎస్ఐ ఆస్పత్రుల నిర్వహణ పూర్తిగా చందాదారుల నుంచి స్వీకరించే ప్రీమియం నుంచే ఖర్చు చేస్తారు. ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు చెల్లించే నెలవారీ చందాతో వీటిని నిర్వహిస్తారు. ఒక్కో ఉద్యోగి నెలకు రూ.100–450 వరకు చందా రూపంలో చెల్లిస్తున్నారు. రాష్ట్రంలో 20.78 లక్షల మంది ఈఎస్ఐ చందాదారులున్నారు. వీరి కుటుంబ సభ్యులు, వీరిపై ఆధారపడ్డవారిని కలిపితే లబ్ధిదారుల సంఖ్య 80 లక్షలు ఉంటుంది. ఓపీ సేవలతో సరి రాష్ట్రంలోని నాలుగు ఈఎస్ఐ ప్రధాన ఆస్పత్రులు కేవలం అవుట్‌పేషెంట్ (ఓపీ) సర్వీసులతోనే సరిపెడుతున్నాయి. జనరల్ డాక్టర్లతోపాటు స్పెషలైజ్డ్ వైద్యులు ఉన్నప్పటికీ సరైన మౌలికవసతులు లేవు. దీంతో వారంతా సాధారణ ఓపీ చెకప్‌కే పరిమితమవుతున్నారు. శస్త్రచికిత్సలు, ఇతర అత్యాధునిక వైద్య సేవలు అవసరముంటే సనత్‌నగర్ ఆస్పత్రికి రిఫర్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ప్రధాన ఆస్పత్రుల్లో సేవలందించే వీలున్నప్పటికీ చిన్నపాటి పరీక్షల కోసం ప్రైవేటు కేంద్రాలకు వెళ్లాల్సి రావడం, అటూఇటూ చక్కర్లు కొట్టడం అటు బాధితులకు, వారి వెంట ఉన్న సహాయకులకు ఇబ్బందికరంగా మారింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు. జాడలేని సీటీ, ఎంఆర్ఐ సనత్‌నగర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మినహాయిస్తే ప్రధాన ఆస్పత్రుల్లో ఎక్కడా ఎంఆర్ఐ, సీటీ స్కాన్, 2డీ ఇకో యంత్రాలు లేవు. ఆ సేవల కోసం సనత్‌నగర్‌కు పరుగులు పెట్టాల్సిందే. దీంతో ప్రధాన ఆస్పత్రుల నుంచి రోగులు పెద్దసంఖ్యలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్తుండగా... అక్కడ ఒత్తిడి తీవ్రం కావడంతో స్కానింగ్ తీసుకునేందుకు రోజు ల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. పారిశ్రామికవాడలు, వాణిజ్య సముదాయాల మధ్య ఉన్న నాచారం, ఆర్సీపురం ఆస్పత్రుల్లో సేవలు కాస్త మెరుగ్గానే ఉన్నా.. సిర్పూర్–కాగజ్‌నగర్, వరంగల్ ఆస్పత్రుల్లో సేవలు అధ్వానంగా ఉన్నాయి. ఈ రెండిట్లో కనీసం ఎక్స్‌రే యంత్రాలు కూడా లేవు. వరంగల్‌లో కొన్ని రక్త పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుండగా, సిర్పూర్–కాగజ్‌నగర్‌లో అది కూడా లేదు. ప్రైవేటు ల్యాబ్‌లో చేయించిన రిపోర్టులను అక్కడి డాక్టర్లు పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో రెండిట్లో 95 శాతం బెడ్లు ఖాళీగా ఉంటున్నాయి. ఒక రకంగా ఇక్కడ ఐపీ సేవలు నిలిచిపోయాయని చెప్పొచ్చు. వస్తారు... వెళ్తారు వరంగల్, సిర్పూర్–కాగజ్‌నగర్ ఆస్పత్రుల్లో ఐపీ సేవలు నిలిచిపోవడంతో అక్కడ వైద్యులు, సిబ్బంది విధులను మొక్కుబడిగా నిర్వర్తిస్తున్నారు. గంట, రెండు గంటల పాటు కాలక్షేపం చేసి ఇంటికెళ్తున్నారు. ఇక్కడ మెజార్టీ వైద్యులు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి విధులకు ఎగనామం పెట్టే వైద్యులు కూడా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అటకెక్కిన పర్యవేక్షణ ఈఎస్ఐ ఆస్పత్రుల్లో పర్యవేక్షణ గాడితప్పింది. ఆకస్మిక తనిఖీలు, పర్యవేక్షణ నిర్వహించేందుకు రాష్ట్ర కార్యాలయంలో డైరెక్టర్, సంయుక్త సంచాలకుల పాత్ర కీలకం. అదేవిధంగా వరంగల్, హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్లు సైతం తమ పరిధిలోని ఆస్పత్రుల్లో తనిఖీలు చేయాలి. కానీ కొన్నేళ్లుగా ఇలాంటి పర్యవేక్షణలు మచ్చుకైనా లేవు. దీంతో వైద్యు లు, సిబ్బంది హాజరు ఇష్టారాజ్యంగా మారింది. ఎలాంటి అనుమతులు లేకుండా రోజుల తరబడి సెలవులు పెట్టడం, వాటిని రెన్యువల్ చేసుకోవడంలాంటి తంతు ఏళ్లుగా జరుగుతోంది. డైరెక్టర్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (డీఐఎంఎస్) విభాగాధిపతి హోదాలో రెండున్నరేళ్లుగా ఇన్చార్జ్ అధికారి ఉన్నందునే ఈ పరిస్థితి వచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ చిత్రంలోని వ్యక్తి పేరు ఎం.ప్రవీణ్‌కుమార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని ఐటీసీకి చెందిన బీపీఎల్ కంపెనీలో పనిచేస్తున్నారు. డస్ట్ ఎలర్జీతో బాధపడుతూ ఆస్తమా బారిన పడ్డాడు. సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ ఖర్చుకు భయపడి వరంగల్ ఈఎస్ఐ ఆస్పత్రికెళ్లాడు. వైద్యుడు మాత్రలు రాయడంతోపాటు చెస్ట్ ఎక్స్‌రే, స్కానింగ్ తీయించాలని సూచించారు. కానీ అక్కడ ఈ రెండు వసతులు లేవు. దీంతో వాటికోసం ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్‌కు పరుగుపెట్టాడు. అన్నిరకాల సేవలు దొరుకుతాయని భావించి 180 కి.మీ. దూరం నుంచి వచ్చిన ఆయనకు నిరాశ తప్పలేదు. 11 గంటలైనా తాళాలు తీయలే వరంగల్ ఆస్పత్రిలో వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి అత్యవసర పరిస్థితుల్లో వచ్చేవారిని హైదరాబాద్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్‌రే, సీటీ స్కాన్ తదితర పరికరాలు లేకపోవడంతో రోగులు తిప్పలు పడుతున్నారు. వరంగల్ ఈఎస్ఐ ఆస్పత్రిలో ఉదయం 11 గంటలు అయినా డాక్టర్ రాకపోవడంతో ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీ శుక్రవారం ఈ ఆస్పత్రిని ‘సాక్షి’విజిట్ చేయగా ఉదయం 11 గంటలకు కూడా పిల్లలు, ఆర్థోపెడిక్ విభాగాల తాళం కూడా తీయలేదు. గైనకాలజిస్టు, డెంటిస్టు, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇక్కడికొచ్చే రోగుల సంఖ్య బాగా తగ్గిందని సిబ్బంది చెబుతున్నారు. వారం రోజులుగా తిరుగుతున్నా.. నిజామాబాద్‌కు చెందిన ఇతని పేరు నాగభూషణం. ఇతనికి గుండె ఆపరేషన్ జరిగింది. ప్రతి నెలా మందుల కోసం నిజామాబాద్ న్యాల్కల్ రోడ్డులోని ఈఎస్ఐ ఆస్పత్రికి వస్తుంటారు. వైద్యులు రాసిన పది రకాల మందుల కోసం ప్రిస్కిప్షన్ తీసుకుని ఇక్కడకు వస్తే ఏ ఒక్క మాత్ర ఉండడం లేదు. వారం రోజులుగా తిరుగుతున్నప్పటికీ ఇవ్వడం లేదు. బయట మాత్రలు కొనుగోలు చేసే స్తోమత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్చులు తడిసిమోపెడు నేను కొన్నేళ్లుగా నరాల సమస్యతో ఇబ్బంది పడుతున్నా. తూప్రాన్ డిస్పెన్సరీ వైద్యుల సూచనతో ఆర్సీపురం ఆస్పత్రికి వచ్చాను. అయితే ఎంఆర్ఐ, సీటీ స్కాన్ అందుబాటులో లేవని డాక్టర్లు చెప్పారు. దీంతో సనత్‌నగర్ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించాను. ఆయా రిపోర్టులను తిరిగి ఆర్సీపురం వైద్యులకు చూపించి మందులు రాయించుకున్నా. దీనికోసం ఆరేడుసార్లు తిరిగాను. ప్రయాణ ఖర్చులు సైతం తడిసి మోపెడవుతున్నాయి. – సత్యనారాయణ, తూప్రాన్ -
2021లో కొత్త ఈఎస్ఐ ఆస్పత్రులను నెలకొల్పలేదు: రామేశ్వర్ తేలి
సాక్షి, ఢిల్లీ: కొత్త ఈఎస్ఐ ఆస్పత్రుల ఏర్పాటు నిరంతర ప్రక్రియ అని, ఆయా ప్రాంతాల్లో ఈఎస్ఐ సభ్యుల సంఖ్య, తదితర వివరాల ఆధారంగా ఆస్పత్రి ఏర్పాటు జరుగుతుందని కేంద్ర కార్మికశాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. సోమవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ఎంపీ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలో మొత్తం 160 ఈఎస్ఐ ఆస్పత్రులు ఉన్నాయని, వాటిలో 50 ఆస్పత్రులను ఈఎస్ఐ కార్పొరేషన్ నిర్వహిస్తుండగా, 110 ఆస్పత్రులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఈఎస్ఐ డైరక్టరేట్లు నిర్వహిస్తున్నాయని తెలిపారు. 2019లో ఒడిశాలోని అంగుల్, ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లో ఈఎస్ఐ ఆస్పత్రుల ఏర్పాటు జరిగిందని చెప్పారు. 2020లో కోర్బా(చత్తీస్‌గఢ్), ఉదయ్‌పూర్(రాజస్థాన్), రాయ్‌పూర్(చత్తీస్‌గఢ్)లో ఏర్పాటు చేశామని తెలిపారు. 2021లో కొత్త ఈఎస్ఐ ఆస్పత్రులను నెలకొల్పలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూర్యాపేట సహా మరెక్కడైనా ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగులో లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. -
కిట్ల పేరిట రూ.కోట్లు కొట్టేశారు, రూ.3 వేలకు 16 వేలు
సాక్షి, అమరావతి: అధీకృత డీలర్ వద్ద ఓ ల్యాబ్ కిట్ ధర రూ.3 వేలు. ఆ కిట్ కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం చెల్లించిన ధర రూ.16వేలు. టీడీపీ హయాంలో ఈఎస్ఐ ఆస్పత్రులకు అవసరమైన మందుల కొనుగోళ్లలో యథేచ్ఛగా సాగిన అవినీతి బాగోతం ఎంతటిదో తెలియడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. 2014–19 మధ్య ఈఎస్ఐ ఆస్పత్రులకు మొత్తం రూ.975.79 కోట్ల విలువైన మందులు, పరికరాల కొనుగోళ్ల కుంభకోణంపై ఏసీబీ విచారణలో కొత్త విషయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అప్పటి ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరించిన టీడీపీ నేత అచ్చెన్నాయుడును గతంలోనే అరెస్ట్ చేసిన ఏసీబీ విచారణ కొనసాగిస్తోంది. ఆయన ప్రస్తుతం బెయిల్‌పై విడుదల అయ్యారు. కాగా ఏసీబీ అధికారులు తాజాగా బుధవారం మరో నలుగుర్ని అరెస్ట్ చేశారు. వారిలో అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్, ప్రస్తుతం విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డా.బాల రవికుమార్ సైతం ఉండగా.. హైదరాబాద్‌లోని ఓమ్ని మెడి, ఓమ్ని ఎంటర్‌ప్రైజస్ యజమాని కంచర్ల శ్రీహరి, ఆయన భార్య, ఓమ్ని హెల్త్‌కేర్ యజమాని కంచర్ల సుజాత, ఓమ్ని మెడి మేనేజర్ బండి వెంకటేశ్వర్లును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు. వారిని న్యాయస్థానంలో హాజరుపర్చి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ నలుగురితో పాటు ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటివరకు 21 మందిని అరెస్ట్ చేశారు. 4 షెల్ కంపెనీలు.. 400 శాతం అధికంగా.. టీడీపీ ప్రభుత్వంలో పెద్దల అండతో ఈఎస్ఐ ఆస్పత్రులకు పరికరాలు, మందుల కొనుగోలులో యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. ఈ కేసులో ఏ–19గా ఉన్న కంచర్ల శ్రీహరిబాబు హైదరాబాద్‌లో ఓమ్ని మెడి పేరుతో ఓ ఫార్మసీ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు. అతనే ఓమ్ని ఎంటర్ప్రైజెస్ పేరుతో మరో కంపెనీ, తన భార్య సుజాత పేరుతో ఓమ్ని హెల్త్‌కేర్ అనే ఇంకో కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ మూడు కంపెనీలు హైదరాబాద్‌లో ఒకే అడ్రస్‌తో రిజిస్టర్ అయ్యాయి. శ్రీహరిబాబు తన బినామీ కె.కృపాసాగర్ రెడ్డి పేరున లేజండ్ ఎంటర్ప్రైజెస్ అనే మరో కంపెనీని కూడా సృష్టించారు. ఈ నాలుగు కంపెనీల మధ్య మందులు, వైద్య పరికరాల వ్యాపారం జరిగినట్టుగా రికార్డుల్లో చూపించి వాటి ధరను ఏకంగా 400 శాతం పెంచేశారు. అనంతరం ఆ పెంచిన ధర ప్రకారం ఈఎస్ఐ ఆస్పత్రులకు మందులు, వైద్య పరికరాలు సరఫరా చేశారు. దీనికి అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్, ప్రస్తుతం విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ బి.రవికుమార్ సహకరించారు. ఆ విధంగా కేవలం ఓమ్ని మెడి నుంచి జరిపిన రూ.92 కోట్ల మేర కొనుగోళ్లలో రూ.35 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. టెండర్లు పిలవకుండా.. నోట్ ఫైల్స్ సైతం లేకుండా.. టీడీపీ ప్రభుత్వంలో 2014 జూన్ నుంచి 2019 మార్చి మధ్యలో ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా, టెండర్లు లేకుండా ఈఎస్ఐ ఆస్పత్రుల కోసం ఏకంగా రూ.975.79 కోట్ల మేర మందులు, వైద్య పరికరాలు కొనుగోలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు అప్పగించాలని టీడీపీ ప్రభుత్వంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సిఫార్సు చేయడంపై దర్యాప్తు ఇప్పటికే కొనసాగుతోంది. మరోవైపు ఇతర సంస్థల నుంచి కూడా టెండర్లు పిలవకుండానే కనీసం నోట్ ఫైళ్లు సైతం లేకుండానే మందులు, వైద్య పరికరాలు, ల్యాబ్ కిట్లు, సర్జికల్ పరికరాలు, ఫర్నిచర్ మొదలైనవి కొన్నారని ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. ఆర్థిక శాఖ విధి విధానాలు, ఈఎస్ఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా నాన్ రేట్ ఫర్మ్ నుంచి దాదాపు 50 శాతం అధిక ధరలకు కొనుగోలు చేశారు. డైరెక్టర్లు, సెంట్రల్ డ్రగ్ స్టోర్ సిబ్బంది నకిలీ కొటేషన్లు సమర్పించి పోటీ లేకుండా చేశారు. కొందరు తమ బంధువులు, సన్నిహితుల పేరిట సంస్థలను సృష్టించి మరీ వాటి నుంచి కొనుగోలు చేయడం గమనార్హం. ఇక ల్యాబ్ కిట్లు, కన్జూమబుల్స్లను కేవలం మూడు సంస్థల నుంచే కొనుగోలు చేశారు. ఆ మూడు సంస్థలు కూడా అధీకృత డీలర్లు కావు. కనీసం అధీకృత డీలర్లతో ఎంవోయూ కూడా చేసుకోని సంస్థల నుంచి మందులు, వైద్య పరికరాలు కొనుగోలు చేయడం గమనార్హం. -
ఈఎస్ఐ సేవలు @ ఆన్లైన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్ఐ ఆస్పత్రుల్లో భారీ సంస్కరణల దిశగా ముందుకు వెళుతోంది. గత ప్రభుత్వ హయాంలో కార్మీకులకు వైద్యం కాదు కదా.. వచి్చన నిధులన్నీ కాంట్రాక్టర్లు, మంత్రులు, నేతల చేతుల్లోకి వెళ్లి, కార్మీకరాజ్య బీమా ఆస్పత్రులు నిర్వీర్యం అయిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్ఐ కార్మికులకు ఆన్లైన్లో డాక్టరు అపాయింట్మెంట్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తోంది. జబ్బు చేస్తే ఈఎస్ఐ డిస్పెన్సరీకి వెళ్లినా డాక్టరు లేకపోవడం వంటి కారణాలతో వెనక్కు రావాల్సి వచ్చేది. దీంతో కార్మీకులకు వైద్యం సరిగా అందేది కాదు. ఇకపై అలాకాకుండా జబ్బు చేసిన రోజు వైద్యానికి వెళ్లగానే చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 13 లక్షల మందికిపైగా కార్మీకులున్నారు. వీరి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 40 లక్షల మందిపైనే ఉన్నారు. వీళ్లకోసం కార్మీక రాజ్యబీమా సంస్థ ‘ఏఏఏప్లస్’ అనే యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఏ డిస్పెన్సరీకి వెళ్లాలో దరఖాస్తు చేసుకోవచ్చు. డాక్టరు దగ్గరకు వెళ్లే గంట ముందు యాప్‌లో వివరాలు పంపిస్తే చాలు.. పేషెంటు వెళ్లేసరికి విధిగా అక్కడ వైద్యులు ఉంటారు. పేషెంటు వేచి ఉండకుండా వెంటనే పరీక్షించి అవసరమైన మందులు ఉచితంగా ఇస్తారు. ఇప్పటికే గుణదలలోని ఆస్పత్రిని మోడల్ డిస్పెన్సరీగా తీర్చిదిద్దారు. మొత్తం 78 డిస్పెన్సరీలకు ఆన్లైన్ సేవలు విస్తరిస్తున్నారు. దీనివల్ల డాక్టర్లు గైర్హాజరవడానికి వీలుండదు. ఏరోజుకారోజు ఆన్లైన్ వివరాలుఅందుతాయి. 13 ఏళ్ల తర్వాత నర్సుల నియామకాలు గడిచిన 13 ఏళ్లుగా ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఒక్క నియామకమూ జరగలేదు. 13 ఏళ్ల తర్వాత ఒకేసారి 101 మంది నర్సుల నియామకం జరుగుతోంది. ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించి పరిశీలించారు. కొద్ది రోజుల్లో నర్సులు విధుల్లో చేరనున్నారు. దీనివల్ల నర్సింగ్ కేర్ సేవలు మెరుగు పడనున్నాయి. ఇకపై అన్నీ ఆన్లైన్ సేవలే తాజాగా కార్మికులకు ఆన్లైన్ అపాయింట్మెంట్ సేవలు అందుబాటులోకి తెస్తున్నాం. మందుల కొనుగోళ్లు, ఇన్వెంట్రీ, ఇండెంట్ అన్నీ ఆన్లైన్ పరిధిలోకి తీసుకురాబోతున్నాం. గతంలో పెండింగ్‌లో ఉన్న పేషెంట్ల బిల్లులన్నీ ఆన్లైన్ చేశాం. ప్రైవేటు ఆస్పత్రుల వివరాలను కూడా ఆన్లైన్ చేయబోతున్నాం. దీనివల్ల పారదర్శకంగా పనులు జరుగుతాయి. ఎక్కడా అవినీతికి ఆస్కారం ఉండకుండా సేవలు అందేలా చేస్తున్నాం. రెండు నెలల్లో అన్ని ఆస్పత్రులను ఆన్లైన్ అపాయింట్మెంట్ పరిధిలోకి తెస్తాం. – డాక్టర్ కుమార్ లక్కింశెట్టి, డైరెక్టర్,కార్మీకరాజ్య బీమా సంస్థ -
ఈఎస్ఐలో ధన్వంతరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్మిక రాజ్యబీమా (ఈఎస్ఐ) ఆస్పత్రుల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. గత ప్రభుత్వ హయాంలో రూ.వందలాది కోట్ల నిధులు దుర్వినియోగమైన విషయం తెలిసిందే. ఇకపై ఇలాంటి కొనుగోళ్లలో అవినీతికి తావు లేకుండా ఇ–ఔషధి తరహాలోనే ‘ధన్వంతరి’ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. గతంలోనే ధన్వంతరి సాఫ్ట్వేర్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర కార్మిక శాఖ ఆంధ్రప్రదేశ్‌కు పదేపదే సూచించింది. ఈ విధానం అమల్లోకి తెస్తే.. అవినీతికి ఆస్కారం ఉండదని, నిధులు కాజేసేందుకు అవకాశం ఉండదన్న ఉద్దేశంతో చంద్రబాబు సర్కారు దీనిని పక్కన పడేసింది. అన్ని విభాగాల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించిన ప్రస్తుత ప్రభుత్వం ఈ నెలాఖరు నాటికి ఈ విధానం అమల్లోకి తీసుకు రావాలని నిర్ణయించింది. దీనివల్ల 14 లక్షల మంది కార్మికులతో పాటు మరో 30 లక్షల మందికి పైగా కార్మికుల కుటుంబ సభ్యులకూ మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో 78 డిస్పెన్సరీలు, 4 ప్రాంతీయ ఆస్పత్రులు, 4 డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లే కార్మికులకు కొత్త విధానం వల్ల ఊరట కలగనుంది. ప్రస్తుతం ఢిల్లీలో మాత్రమే ధన్వంతరి విధానం అమల్లో ఉంది. ఆన్‌లైన్‌లోకి రిఫరల్ ఆస్పత్రులు ఈఎస్ఐ ఆస్పత్రుల్లో తగిన వైద్యం అందుబాటులో లేకపోతే రిఫరల్ ఆస్పత్రులుగా గుర్తించిన ప్రైవేట్ ఆస్పత్రులకు కార్మికులు వెళ్లేవారు. అక్కడ పూర్తిగా మాన్యువల్ బిల్లులే ఉండేవి. దీంతో కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు కార్మికుల పేరిట నకిలీ బిల్లులు సృష్టించి రూ.కోట్లు కొల్లగొట్టేవారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈఎస్ఐ పరిధిలో ఉండే 120 రిఫరల్ ఆస్పత్రులు ధన్వంతరి సాఫ్ట్వేర్ పరిధిలోకి రానున్నాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ఏ విధంగా బిల్లులు చెల్లిస్తున్నారో.. వీటికి కూడా అదే తరహాలోనే చెల్లింపులు చేస్తారు. 10 కిలోమీటర్ల దూరంలో ఈఎస్ఐ ఆస్పత్రి లేకపోతే అక్కడి కార్మికుడు నేరుగా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లచ్చు. ఆస్పత్రి నుంచి పేషెంట్ వివరాలు ఈఎస్ఐకి అందించాలి. ఆ వెంటనే ఇక్కడ నుంచి అనుమతులు ఇస్తారు. రోగుల చేరిక, ఓపీ, ఐపీ, బిల్లులు పెట్టడం ఇకపై అన్నీ ఆన్లైన్లో చేయాల్సిందే. మందుల కొనుగోళ్లకూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఆన్లైన్లో మందులు కొంటున్నది ఏపీఎంఎస్ఐడీసీ పరిధిలోనే. ఇప్పుడు అదే విధానాన్ని ఈఎస్ఐలోనూ అనుసరించబోతున్నారు. ఇప్పటివరకు మందుల కొనుగోలు పేరిట రూ.వందల కోట్లు దుర్వినియోగమయ్యాయి. గతంలో పితాని సత్యనారాయణ, అచ్చెన్నాయుడు మంత్రులుగా ఉన్న సమయంలో ఇదే తంతు జరిగింది. ఇకపై అలా కాకుండా ఏ ఆస్పత్రికి ఎన్ని మందులు అవసరమో డాక్టర్లు ఇండెంట్ ఇస్తే.. ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేసేలా ఈఎస్ఐ అధికారులు ఏపీఎంఎస్‌ఐడీసీతో మాట్లాడుతున్నారు. పక్కాగా పేషెంట్ల రిజిస్ట్రీ రాష్ట్రంలో ఈఎస్ఐ సౌకర్యం గల కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కలిపి 44 లక్షల మంది పైనే ఉన్నారు. వీరిలో ఎవరైనా ఈఎస్ఐ ఆస్పత్రులకు వెళితే వారి పేరు, వివరాలు, ఐడీ నంబర్ పక్కాగా ఆన్లైన్లో నమోదు చేస్తారు. వారికి ఏయే మందులు, ఎన్నెన్ని ఇచ్చారు, ఏ డాక్టర్ చికిత్స చేశారు, రక్త పరీక్షలేమైనా చేశారా వంటి వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేయాల్సిందే. ఏ ఒక్క రోగికి సంబంధించిన పేరు నమోదు చేయకపోయినా ఆ డిస్పెన్సరీ ఉద్యోగులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇక అన్నీ ఆన్లైన్లోనే.. ‘ధన్వంతరి’ సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తెస్తున్నాం. రిఫరల్ ఆస్పత్రుల నమోదు పూర్తయింది. పేషెంట్ రిజిస్ట్రీ ఆన్లైన్ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇకపై మాన్యువల్‌గా చేసేవేవీ ఉండవు. అన్నీ ఆన్లైన్లో వస్తే అనుమతులు ఇస్తాం. వేలాదిమంది రోగులకు చెల్లించాల్సిన బకాయిలన్నీ చెల్లిస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా వారికి బిల్లులు చెల్లించలేదు. –డాక్టర్ కుమార్ లక్కింశెట్టి, డైరెక్టర్, ఈఎస్ఐ -
ఏపీలో మరో 7 ఈఎస్ఐ ఆస్పత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరు, విజయనగరం, కాకినాడ, పెనుగొండ, విశాఖ, శ్రీసిటీ నెల్లూరు, అచ్యుతాపురంలలో ఈఎస్ఐ నూతన ఆస్పత్రులకు సూత్రప్రాయ అనుమతిచ్చినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ రాజ్యసభలో తెలిపారు. మార్చి 2023లోగా రూ.73.68 కోట్లతో విజయనగరంలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. బుధవారం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కె.రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. గృహ రుణాల వడ్డీపై రాయితీ చెల్లింపు పథకం (సీఎల్ఎస్ఎస్)ను ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ హర్దీప్సింగ్ పురి తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(అర్బన్) కింద అర్హులైన మధ్యతరగతి ప్రజల గృహ రుణాలపై వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో చెల్లిస్తుందని విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. కర్నూలు–విజయవాడ, విజయవాడ–కర్నూలు విమాన సరీ్వసులు ఇంకా ప్రారంభం కాలేదని వైఎస్సార్సీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రకాశం బ్యారేజీ–హైదరాబాద్, విజయవాడ–నాగార్జున సాగర్ మధ్య సీ–ప్లేన్ సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. గత 19 నెలల్లో ఏపీలోని హిందూ దేవాలయాలపై 140కి పైగా దాడులు, దేవతా విగ్రహాలను కూల్చివేసి, అపవిత్రం చేయడం వంటి ఘటనలు జరిగాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ జీరో అవర్‌లో ప్రస్తావించారు. చేనేత రంగాన్ని ఆదుకోవాలి ఏపీ సహా దేశవ్యాప్తంగా చేనేత రంగాన్ని ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మౌలిక సదుపాయాల రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వైఎస్సార్సీపీ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. చెన్నై–బెంగళూరు–మైసూరు హైస్పీడ్ రైలుపై వైఎస్సార్సీపీ ఎంపీ రెడ్డప్ప అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ బదులిచ్చారు. అనంతపురం నుంచి ఢిల్లీలోని ఆదర్శనగర్ వరకూ కిసాన్ రైలు సేవలు అందిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. వైఎస్సార్సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, ఎన్.రెడ్డెప్ప, బి.సత్యవతి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సంబంధిత కేంద్రమంత్రులు సమాధానమిచ్చారు. పుణేలోని సీ–డాక్లో జాతీయ కృత్రిమ మేథస్సు సూపర్ కంప్యూటర్ ‘పరం సిద్ధి’ ఏర్పాటుకు రూ.72.25 కోట్లు ఖర్చు చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ తలారి రంగయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకరప్రసాద్ బదులిచ్చారు. -
వ్యవస్థల్లో అవినీతిని ఏరిపారేయండి
సాక్షి, అమరావతి: వ్యవస్థల్లో అవినీతిని ఏరిపారేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో అవినీతి ఉండకూడదని, అవినీతి వల్ల పేదలైన కార్మికులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన కార్మికుల సంక్షేమం, వారికి అందుతున్న వైద్య సౌకర్యాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ ఆసుపత్రుల్లో జరిగిన అవినీతి గురించి సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. మందులు కొనాల్సిన డబ్బులతో కాస్మొటిక్స్ కొన్నారని అధికారులు వివరించారు. ఎల్ఐసీ నుంచి బీమా చెల్లింపులు నిలిచిపోయాయని, ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ.. బీమా చెల్లింపుల కోసం ప్రధానికి లేఖ రాస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఈఎస్ఐ ఆసుపత్రుల్లో సేవలు మెరుగు పరచడం, మందుల కొనుగోళ్లు తదితర అంశాలపై ఆయన అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సీఎం సూచనలు, ఆదేశాలు - మందుల కొనుగోలులో పూర్తిస్థాయి పారదర్శకత ఉండాలి. - ఈఎస్ఐ కొనుగోలు చేసిన మందుల్లో జీఎంపీ (గుడ్ మానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్) ప్రమాణాలు ఉండాలి. - ఈఎస్ఐ బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల చేయాలి. - వైద్య సేవల్లో నాణ్యత కోసం ఇప్పటికే నిర్దేశించుకున్న ప్రమాణాలు ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఉండేలా చూడాలి. - ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక టీచింగ్ ఆసుపత్రి, నర్సింగ్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నాం. - ఇప్పుడున్న టీచింగ్ ఆస్పత్రుల సంఖ్యను 11 నుంచి 27కు పెంచుతున్నాం. - ఈ కాలేజీల నుంచి పెద్ద సంఖ్యలో వైద్యులు అందుబాటులోకి వస్తారు. - వీరి సేవలను కూడా ఈఎస్ఐ ఆస్పత్రుల్లో వినియోగించుకునేలా చూడాలి. - వైద్య ఆరోగ్య శాఖతో అనుసంధానమైన ఈఎస్ఐ ఆస్పత్రులను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. - కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై వెంటనే అధికారులు దృష్టి పెట్టాలి. - ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఏమైనా సేవలు మెరుగుపరిచేందుకు ప్రతిపాదనలు పంపితే ఆ మేరకు చర్యలు తీసుకుంటాం. - కాలుష్య నివారణపైనా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలి. రాష్ట్రాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడుకోవాలి. - కాలుష్యం వల్ల కార్మికుల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాలుష్య నివారణ ప్రమాణాలు ప్రదర్శించాలి. - సముద్రంలోకి విచ్చలవిడిగా వ్యర్థాలను వదిలేయడం వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది. దీంతో భావితరాలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటాయి. దీన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. -
ఈఎస్ఐ కుంభకోణాన్ని నిరసిస్తూ సీపీఎం ధర్నా
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఈఎస్ఐ ఆసుపత్రుల్లో కనీస మందులు, వైద్యులు లేకున్నా పట్టించుకోకుండా గత పాలకులు వందల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడటం దారుణం అని సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఐదేళ్లలో సుమారు రూ.600 కోట్లకు పైగా అవినీతి బట్టబయలైందని స్పష్టం చేసింది. టెలిమెడిసిన్ పేరుతో, మందుల కొనుగోళ్లలో, ఆపరేషన్లలో కార్మికుల సొమ్మును దోచుకున్నారని ధ్వజమెత్తింది. గత ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వ అధికారులు దీనికి బాధ్యత వహించాలని.. ఇందుకు కారణమైన వారందరిపై ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం విజయవాడలోని గుణదలలో ఈఎస్ఐ కార్యాలయం ఎదుట ఆ పార్టీ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా కార్మికులు, ఉద్యోగుల సొమ్మును దోచుకున్న ఈఎస్ఐ అధికారులు, రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు నినాదాలు చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. టెండర్లు పిలవకుండా నామినేషన్ పద్ధతిలో దోచుకున్న సొమ్మును వారి వద్ద నుంచి రికవరీ చేయాలన్నారు. ఈఎస్ఐలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని, చందాదారులైన కార్మికులు, ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈఎస్ఐలో కనీస మందులు లేవని, డాక్టర్లు కూడా సరిగా ఉండరన్నారు. విజయవాడ ఆస్పత్రి కూలిపోతుంటే పట్టించుకునే దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుణదల ఈఎస్ఐ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలన్నారు. సీపీఎం పశ్చిమ కృష్ణా కార్యదర్శి డివై కృష్ణ మాట్లాడుతూ ఈఎస్ఐ కుంభకోణంలో దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎన్సీహెచ్ శ్రీనివాస్, బి.నాగేశ్వరరావు, బి.రమణ, బి.సత్యబాబు, సుధాకర్, కాజ సరోజ తదితరులు పాల్గొన్నారు. -
రోగుల అందం.. అదిరిందయ్యా చంద్రం!
సాక్షి, అమరావతి: ఆసుపత్రిలో చేరిన కార్మికులకు నాలుగు మందు బిళ్లలివ్వండి మహాప్రభో అని మొత్తుకుంటే.. నిర్దాక్షిణ్యంగా నిధుల్లేవని చెప్పిన గత పాలకులు తైల సంస్కారం పేరుతో కోట్ల రూపాయలు నొక్కేసిన వైనం నివ్వెరపరుస్తోంది. జబ్బు చేస్తే మందులు కొనడానికి డబ్బుల్లేక నానా అవస్థలు పడుతున్న కార్మికులను కనీసం పట్టించుకోకుండా వారి జుట్టుకు, ఒంటికి నూనె రాయాలని కోట్లకు కోట్లు వెచ్చించి రకరకాల నూనెలు కాగితాలపై మాత్రమే కొనుగోలు చేసి, సరికొత్త కుంభకోణానికి పాల్పడటం వారికే చెల్లింది. ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో స్పెషాలిటీ వైద్యం లేక కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుని బిలులు పెడితే ఏళ్లతరబడి చెల్లించకుండా, వచ్చిన నిధులను ఇలా దిగమింగిన ఘటన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికతో బట్టబయలైంది. రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఈఎస్ఐ అవినీతి అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. జుట్టు నూనెలకు రూ. 54 కోట్లు పైనే .. ‘మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె’అన్నట్లు ఓవైపు ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందులు లేకపోయినా మరోవైపు రకరకాల క్రీములు, నూనెల పేరిట నాలుగేళ్లలో రూ.54 కోట్ల విలువైనవి కొన్నారు. హెయిర్ సొల్యూషన్, స్కిన్ క్రీమ్స్, ఫేస్ క్రీమ్స్, టూత్ పేస్ట్‌లు ఇలా ఒకటేమిటి రకరకాల తైలాలు, క్రీముల పేరిట కోట్లాది రూపాయలు వ్యయం చేశారు. పోనీ ఆ నూనెలు, క్రీములు వాడారా అంటే అదీ లేదు. ఏ ఆస్పత్రి నుంచి కూడా తమకు నూనెలు, క్రీములు కావాలని ఒక్క చిన్న లెటర్ కూడా లేదు. ఈఎస్ఐ కార్యాలయం నుంచే ఇండెంట్లు సృష్టించి తమకు కావాల్సిన కంపెనీకి ఆర్డరు ఇచ్చారు. ఒక్క జుట్టుకు రాసుకునే నూనెకు రూ.42 కోట్లు చెల్లించినట్టు తేలింది. టూత్‌పేస్ట్‌కు రూ.2 కోట్లు, షాంపూలకు రూ.2.5 కోట్లు చెల్లించారు. ఒంటికి రాసుకునే క్రీములకు రూ.8 కోట్లు పైనే వ్యయం చేశారు. ఓవైపు క్యాన్సర్, కిడ్నీ జబ్బులకు మందులు లేవంటూ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకోకుండా కమీషన్ల కోసం అమాత్యుల నుంచి అధికారుల వరకు అందరూ ఈ అవినీతి సొమ్ముకు ఎగబడినట్టు విజిలెన్స్ నివేదిక బట్టబయలు చేసింది. ఇలా ఇండెంట్లు పెట్టిన అధికారుల్లో డా.చంద్రశేఖర్, డా.జగదీప్గాంధీలు ప్రధానంగా ఉన్నారు. వీరిద్దరూ లెజెండ్, ఓమినిమెడి కంపెనీలకు ఈ ఆర్డర్లు ఇచ్చినట్టు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. మందులు మురిగిపోతున్నా .. ఓవైపు మందులు మురిగిపోయాతున్నా, మరోవైపు కమీషన్ల కోసం మందులకు ఆర్డర్లే ఆర్డర్లు. ఒక్క కడప రీజియన్‌లోనే రూ.15 కోట్ల విలువైన మందులు మురిగిపోయాయి. ఆయా ఆస్పత్రుల నుంచి పదే పదే మందులు మాకొద్దు అన్నా కూడా ఈఎస్ఐ కార్యాలయంలో పనిచేస్తున్న సంయుక్త సంచాలకులు కమీషన్ల కోసం ఆర్డర్లు పెట్టారు. 2019 అక్టోబర్ 1న కడప జేడీగా పనిచేస్తున్న డా.రవికుమార్ మందులు మురిగిపోతున్నాయని, వీటిని ఇతర ఆస్పత్రులకైనా తరలించి వాడుకోవాలని లేఖ రాశారు. ఇలా వరుసపెట్టి నాలుగైదు దఫాలుగా లేఖలు రాసినా పట్టించుకోలేదు. ఇలాంటి లేఖలు పలు జిల్లాల నుంచి వచ్చినా పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా మందులు సరఫరా చేయడంతో ఇప్పుడా మందులన్నీ మురిగిపోయాయి. ఆ మందుల విలువ కనీసం రూ.40కోట్ల వరకు ఉంటుందని అంచనా. విజయవాడ గుణదలలోని కార్మిక ప్రభుత్వ భీమా వైద్యశాల ఆ రెండు ఏజెన్సీల హవా అధికారులను, కొంతమంది నేతలను అడ్డుపెట్టుకుని ఇప్పటికీ తిరుమల ఏజెన్సీ, సాయి సుదర్శన ఏజెన్సీ ప్రతినిధులు హవా కొనసాగిస్తున్నట్టు తేలింది. తాజాగా ఓడీసీఎస్ (ఒరిస్సా డ్రగ్స్ అండ్ కెమికల్స్) నుంచి కొనుగోలు చేసిన పారాసెటిమాల్ మాత్రలు నాసిరకం అని తేలినా ఇప్పటికీ చర్యలు లేవు. ఈ రెండు ఏజెన్సీలకు సంబంధించిన ప్రతినిధులకు అటు అధికారుల్లో, ఇటు నేతల్లో బాగా లాబీ ఉండటంతో కింది స్థాయి సిబ్బంది భయపడుతున్నారు. అందుకే నాసిరకం అని తేలినా చర్యలకు వెనుకాడుతున్నట్టు తేలింది. ల్యాబ్ కిట్ల పేరుతో భారీ దోపిడీ షుగర్, థైరాయిడ్ పరీక్షలకు వాడే ల్యాబొరేటరీ కిట్ల పేరిట భారీ దోపిడీకి పాల్పడినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వీటి సరఫరా బాధ్యత ఓమినీ మెడీ, ఎవెంటార్, లెజెండ్ కంపెనీలకు ఇచ్చారు. వీటి కోసం ఏకంగా రూ.237 కోట్లు ఈ మూడు కంపెనీలకు చెల్లించారు. హద్దూ పద్దూ లేకుండా వీటిని పదిరెట్లు ఎక్కువ పెట్టి కొనుగోలు చేసినట్టు విజిలెన్స్ అధికారుల పరిశీలనలో వెల్లడైంది. అంతేకాకుండా కొన్ని వస్తువులు ఆస్పత్రులకు వెళ్లకుండానే బిల్లులు చెల్లించారు. ఎక్స్‌పెయిరీ తేదీ దగ్గరకు వచ్చిన వాటిని సరఫరా చేసినా కూడా కిమ్మనకుండా నిధులు చెల్లించినట్టు తేలింది. రకరకాల ల్యాబ్ కిట్ల వాస్తవ ధర, ఈఎస్ఐ కొనుగోలు చేసిన ధర ఇలా ఉంది. రికార్డులు తారుమారు చేసే అవకాశం ఈఎస్ఐలో జరిగిన అక్రమాల్లో ఎవరైతే అధికారులు బాధ్యులుగా ఉన్నారో వారిని అలాగే కొనసాగిస్తే రికార్డులు తారుమారు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇందులో మాజీ మంత్రులు, కొంత మంది రాజకీయ నేతలు ఉండటంతో అధికారులపై ఒత్తిళ్లు పెరిగాయి. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వారిని తక్షణమే సస్పెండ్ చేస్తేనే రికార్డులు తారుమారు చేసే అవకాశం ఉండదని, లేదంటే ఇప్పటికే దీనిపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈఎస్ఐ కార్యాలయంలో కొంత మంది కింది స్థాయి సిబ్బంది ఇప్పటికే ఇదే పనిలో ఉన్నట్టు సమాచారం. -
ఈఎస్ఐ మందుల స్కామ్‌లో కదులుతున్న డొంక
-
3 ఈఎస్ఐ ఆస్పత్రులు
కార్మిక వైద్య సేవలు మరింత విస్తృతం ఒక్కో ఆస్పత్రికి రూ.100 కోట్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆస్పత్రులకు స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి కార్మిక శాఖ లేఖ సాక్షి, హైదరాబాద్: కార్మికులకు ఈఎస్ఐ (కార్మిక రాజ్య బీమా సంస్థ) ద్వారా అందే వైద్య సేవలు మరింత మెరుగుపడనున్నాయి. అత్యాధునిక సదుపా యాలతో వైద్య సేవల్ని విస్తృత పర్చాలని కార్మిక శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్త ఆస్పత్రుల ఏర్పాటుకు ఉపక్రమించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈఎస్ఐ పరిధిలో 10.57లక్షల మంది ఉన్నారు. వీరికి 4 ప్రధాన ఆస్పత్రులు, 70 డిస్పెన్స రీల ద్వారా వైద్య సేవలందుతున్నాయి. తాజాగా ఈఎస్ఐ పరిధిని పెంచుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటివరకు రూ.15వేల లోపు వేతనమున్న కార్మికులకు మాత్రమే సేవలందుతుండగా... ఇకపై రూ..21వేల లోపు వేతనమున్న కార్మికులందరికీ ఈఎస్ఐ ద్వారా వైద్య సేవలు అందనున్నాయి. దీంతో ఆస్పత్రుల సంఖ్యను పెంచాల్సి ఉండడంతో కార్మిక శాఖ ఈమేరకు అడుగులు వేస్తోంది. కొత్తగా మూడు పెద్దాసుపత్రులు... రాష్ట్రంలో కొత్తగా మూడు చోట్ల ప్రధాన ఆస్పత్రులను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. హైదరాబాద్‌లోని గోషామహల్, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, వరంగల్ కేంద్రంలో ఈ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ఆస్పత్రి వంద పడకల సామర్థ్యంతో నిర్మాణం కానుంది. ఇందుకోసం ఒక్కో ఆస్పత్రికి రూ.100 కోట్ల చొప్పున మొత్తంగా రూ.300 కోట్లు మంజూరు చేసింది. ఒక్కో ఆస్పత్రిని ఐదెకరాల విస్తీర్ణంలో నిర్మించాల్సి ఉంది. ఇందుకుగాను స్థలాన్ని కేటాయిం చాలని కార్మికశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎనిమిది డిస్పెన్సరీల స్థాయి పెంపు కొత్త ఆస్పత్రుల ఏర్పాటుతో పాటు మరో ఎనిమిది డిస్పెన్సరీలను అప్‌గ్రేడ్ చేయాలని కార్మిక రాజ్య బీమా సంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. తాజాగా ఈఎస్ఐ పరిధి పెంపు నేపథ్యంలో డిస్పెన్సరీల అప్‌గ్రెడేషన్‌కు సర్కారు పచ్చజెండా ఊపింది. వీటిలో వికారాబాద్ జిల్లా తాండూరు, మెదక్ జిల్లాలోని దౌల్తాబాద్, నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి, సిద్దిపేట్, ఖమ్మం, సూర్యాపేట్ డిస్పెన్సరీలున్నాయి. త్వరలో ఇవి ఆరుపడకల ఆస్పత్రులుగా మారనున్నాయి. ఒక్కో ఆస్పత్రికి రూ.10 కోట్ల చొప్పున కార్మిక శాఖ నిధులిస్తోంది. మిగతా మొత్తాన్ని స్థానిక ప్రజా ప్రతినిధుల నిధుల నుంచి వినియోగిం చుకునేలా ఆ శాఖ ప్రణాళికలు తయారు చేస్తోంది. విడతల వారీగా రాష్ట్రంలోని అన్ని డిస్పెన్సరీలను అప్‌గ్రేడ్ చేయ నున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గతవారం ప్రకటించారు. -
ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఎల్ఈడీ టీవీలు
► వాటి ద్వారా ఆరోగ్య సూత్రాలు, సలహాలు ప్రసారం ► ఈఎస్ఐసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయం సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కార్మిక రాజ్య బీమా ఆస్పత్రుల్లో ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేయను న్నారు. ఈ మేరకు ఈఎస్ఐ కార్పొ రేషన్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈఎస్ఐ స్పెషాలిటీ ఆస్పత్రులతో పాటు జిల్లా కేంద్రాలు, తాలూకా కేంద్రాల్లో ఉన్న డిస్పెన్సరీల్లోనూ ఎల్ఈడీ తెరలు ఏర్పా టు చేయనున్నారు. తెలంగాణ, ఏపీల్లోనే 170కి పైగా డిస్పెన్సరీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 3 వేలకు పైగా డిస్పెన్సరీలున్నట్టు అంచనా. ప్రతి డిస్పెన్సరీలోనూ స్థాయిని బట్టి ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేస్తారు. ఆరోగ్య సలహాలు, సూచ నలు, తీసుకోవాల్సిన జాగ్ర త్తలు గంటకు రెండుసార్లు ఆరోగ్యానికి సంబంధించిన వాణిజ్య ప్రకటన లు ప్రసారమవుతాయి. టీవీలను ఉచితంగా ఏర్పాటు చేసేందుకు పూజారి సర్వీసెస్ అనే సంస్థ కేంద్రంతో ఒప్పందం కుదు ర్చుకుంది. మరోనెల రోజుల్లో ఈఎస్ఐ ఆస్ప త్రుల్లో టీవీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు పూర్తవుతుందని ఈఎస్ఐ కార్పొరేషన్ అధికారి ఒకరు పేర్కొన్నారు. -
ఈఎస్ఐ హాస్పిటళ్ల పరిధిని విస్తరించండి
– కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు ఎంపీ బుట్టా వినతి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కర్నూలులోని ఈఎస్ఐ హాస్పిటళ్ల పరిధిని విస్తరించి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర కార్మిక ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు ఎంపీ బుట్టారేణుక విన్నవించారు. బుధవారం ఎంపీ మంత్రిని ఆయన కార్యాలయంలో కలసి తన నియోజకవర్గంలోని పలు సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని వివిధ పరిశ్రమలు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు బీమా, ఆరోగ్య సేవలు, కనీస వేతనాలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. జిల్లాలోని ఉపాధి కల్పన కార్యాలయాలు, ఐఐటీ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించి నైపుణ్యాభివృద్ధికి చర్యలు చేపట్టాలనా్నరు. అంతేగాక నిరుద్యోగులకు వారికి ఇష్టమైన రంగంలో శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని, కర్నూలుకు మంజూరు చేసిన రీజినల్ ప్రావిడెండ్ ఫండ్ కార్యాలయాన్ని త్వరగా ప్రారంభించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ ఓ ప్రకటనలో తెలిపారు. -
ఆశా, అంగన్వాడీలకూ ఈఎస్ఐ సేవలు
♦ కేంద్ర మంత్రి దత్తాత్రేయ ♦ రూ.250 నెలసరి మొత్తంతో కుటుంబం మొత్తానికి వైద్య సదుపాయం ♦ ఈఎస్ఐ ఆసుపత్రుల్లోని అన్ని సేవలూ అందేలా కొత్త పథకం సాక్షి, హైదరాబాద్: అసంఘటిత రంగంలోని కార్మికులకూ వైద్యసేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, ఇందులో భాగంగా ఆశా, అంగన్వాడీ వర్కర్ల కుటుంబాలకు ఈఎస్ఐ సేవలను విస్తరించేందుకు ఒక పథకాన్ని రూపొందిస్తున్నామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. నిర్మాణ రంగ కూలీల కోసం వైద్యబీమా పథకాన్ని ఇప్పటికే ప్రారంభించగా, రిక్షా కార్మికులు, ఆటోడ్రైవర్లకు ఢిల్లీ, హైదరాబాద్‌లలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ సేవలు అందిస్తామని శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) 168వ వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి ఆ సమావేశం వివరాలను విలేకరులకు వివరించారు. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నెలకు రూ.250 చెల్లించడం ద్వారా ఈఎస్ఐ పథకంలో భాగస్వాములు కావచ్చునని, దీని ద్వారా ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని వైద్య సేవలను పొందడానికి కార్మికుడి కుటుంబానికి అర్హత లభిస్తుందని మంత్రి వివరించారు. ఈఎస్ఐ సేవలు పొందడానికి ఉన్న గరిష్ట వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచే ఆలోచన చేస్తున్నామని, త్వరలో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విజయవాడలో ప్రాంతీయ కేంద్రం ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో విజయవాడ కేంద్రంగా ఈఎస్ఐ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించిందని మంత్రి దత్తాత్రేయ తెలిపారు. దీంతో ఇప్పటివరకూ విజయవాడలో ఉన్న ఉప ప్రాంతీయ కేంద్రం ఆ రాష్ట్రానికి ప్రధాన కేంద్రమవుతుందని, తిరుపతిలో కొత్తగా ఒక ఉప ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. విజయవాడ కేంద్రానికి డెరైక్టర్‌గా పి.శివప్రసాద్‌ను నియమించినట్లు మంత్రి తెలిపారు. సనత్‌నగర్ ఆసుపత్రి స్థాయి పెంపు.. సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆసుపత్రిని 500 పడకల స్థాయికి పెంచనున్నామని, ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని దత్తాత్రేయ తెలిపారు. ప్రస్తుతం అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రి ఉందని, దాన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలకు మార్చి.. ఖాళీ అయ్యే స్థలంలో అధునాతన హంగులతో 500 పడకల ఆసుపత్రిని నిర్మించాలన్నది తమ ప్రణాళిక అని వివరించారు. సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ వైద్యకళాశాల ఈ విద్యా సంవత్సరం నుంచి పనిచేయడం మొదలుపెడుతుందన్నారు. ఈఎస్ఐ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన వీడియో ప్రకటనను మంత్రి విడుదల చేశారు. 15వ తేదీ నుంచి టీవీ చానళ్లు, సినిమాహాళ్లలో ఈ ప్రకటన ప్రసారమవుతుందన్నారు. -
30 కోట్ల మందికి ఈఎస్ఐ సేవల విస్తరణ
♦ ఈఎస్ఐ ఆసుపత్రుల్లో 8,300 పోస్టుల భర్తీకి చర్యలు: దత్తాత్రేయ ♦ ఈఎస్ఐసీ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ వర్కింగ్ జర్నలిస్టు చట్టం పరిధిలోకి ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను వర్కింగ్ జర్నలిస్టు చట్టం పరిధిలోకి తెచ్చేందుకు త్వరలోనే త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు మంత్రి దత్తాత్రేయ చెప్పారు. త్రైపాక్షిక సమావేశంలో ఏకగ్రీవానికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఎలక్ట్రానిక్స్ మీడియా జర్నలిస్టులకు సామాజిక భద్రత, సంక్షేమ ప థకాలను అందజేస్తామని భరోసా ఇచ్చారు. సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన 30 కోట్ల మంది కార్మికులకు ఈఎస్ఐసీ సేవలను విస్తరించడం భవిష్యత్ లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ప్రస్తుతం బీమా వ్యక్తులు (ఇన్స్యూర్డ్ పర్సన్) 2 కోట్ల మంది, కుటుంబసభ్యులు 8 కోట్ల మంది ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో 5 కోట్ల మంది బీమా వ్యక్తులకు ఈఎస్ఐ సేవలు విస్తరించనున్నామన్నారు. ఢిల్లీలో మంగళవారం ఈఎస్ఐసీ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని దత్తాత్రేయ ఆవిష్కరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ, హైదరాబాద్‌లలో లక్ష మంది ఆటోరిక్షావాలాలకు ప్రయోగాత్మకంగా ఈఎస్ఐని అమలు చేయనున్నామన్నారు. సనత్‌నగర్ వైద్యకళాశాలను త్వరలో ప్రారంభించనున్నామని, ఈ వైద్యకళాశాలలో 40 శాతం సీట్లను కార్మికుల పిల్లలకు కేటాయించనున్నామని దత్తాత్రేయ చెప్పారు. దేశంలోని 650 జిల్లాల్లో సేవలందిస్తున్న ఈఎస్ఐ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, సిబ్బంది పోస్టుల్లో 8,300 ఖాళీలను భర్తీ చేయనున్నామన్నారు. సనత్‌నగర్ ఈఎస్ఐసీ వైద్యకళాశాలలో ఏపీ, తెలంగాణ విద్యార్థులకు అవకాశం లేకపోవడంపై ప్రశ్నించగా, అఖిలభారత ప్రిమెడికల్ పరీక్షను గుర్తిస్తున్నట్టు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు. నిధులను ఓట్లతో ముడిపెట్టొద్దు నిధులను ఓట్లతో ముడిపెట్టవద్దని టీఆర్ఎస్ ఎంపీ కవితకు మంత్రి దత్తాత్రేయ హితబోధ చేశారు. ‘మంత్రి దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిలు హైదరాబాద్‌కు 20 వేల కోట్లు తెస్తే, బీజేపీకి ఓటు వేస్తామని’ టీఆర్ఎస్ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి దత్తాత్రేయ స్పందించారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రి గడ్కారీ రూ. 41 వేల కోట్లు కేటాయించారని, డబుల్ బెడ్రూం పథకానికి కేంద్రం హడ్కో నుంచి రూ. 3 వేల కోట్ల రుణం ఇప్పించిందని, గృహనిర్మాణ పథకం కింద 48 వేల ఇళ్లను మంజూరు చేసిందని ఉదహరించారు. రాజకీయాలు ప్రజల సంక్షేమం కోసమే తప్ప, ఓట్ల కోసమే కాదని కవితకు చురక వేశారు. హైదరాబాద్ మెట్రోరైలు ప్రారంభానికి ఆహ్వానిస్తే ప్రధాని నరేంద్ర మోదీ వస్తారని చెప్పారు. -
రెండేళ్లలో కోటి ఉద్యోగాలు: దత్తాత్రేయ
పటాన్చెరు: రెండేళ్లలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. 25 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామన్నారు. మంగళవారం మెదక్ జిల్లా పటాన్చెరులో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ దేశంలోని 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు యూవిన్ స్మార్ట్ కార్డును ఇవ్వనున్నామని చెప్పారు. జాతీయస్థాయిలో ఒకే విధ మైన వేతనాలు అమలు చేసే విధంగా త్వరలో పార్లమెంటులో బిల్లు పెడతామని వెల్లడించారు. ఈఎస్ఐ ఆసుపత్రులను మరింతగా విస్తరిస్తామని, ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్లను కెరీర్ కౌన్సెలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామన్నారు. నిరుద్యోగుల కోసం ప్రత్యేక పోర్టల్ తీసుకువస్తున్నామని, అందులో దేశవ్యాప్తంగా ఉన్న ఆయా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల వివరాలు ఉంటాయని తెలిపారు. హోంమంత్రి నాయిని నర్సిం హారెడ్డి మాట్లాడుతూ రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని కేంద్రమంత్రికి విజప్తి చేశారు. దత్తాత్రేయ స్పందిస్తూ రామచంద్రాపురంలో ఇప్పుడున్న ఈఎస్ఐ ఆసుపత్రిని 200 పడకలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మేయర్ పీఠం బీజేపీదే.. హైదరాబాద్ మేయర్ స్థానం బీజేపీదేనని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. మంగళవారం ఆయన పటాన్చెరులో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మిత్ర పక్షమైన టీడీపీతో హైదరాబాద్‌లో మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు కార్యకర్తలు కష్టపడి పని చేయాలన్నారు. -
రాష్ట్రంలో మూడు ఈఎస్ఐ వైద్యశాలల ఏర్పాటు
మార్కాపురం(ప్రకాశం జిల్లా): త్వరలో రాష్ట్రంలో ఈఎస్ఐ వైద్యశాలలను విజయనగరం, గుంటూరు, కాకినాడల్లో ఏర్పాటు చేస్తున్నామని ఈఎస్ఐ వైద్యశాలల జాయింట్ డైరెక్టర్ జి.రవికుమార్ తెలిపారు. స్థానిక ఈఎస్ఐ వైద్యశాలను మంగళవారం తనిఖీ చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. విజయనగరంలో 200 పడకలు, కాకినాడ, గుంటూరుల్లో వంద పడకల వైద్యశాలలు కార్మికుల కోసం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఏపీలో 75 ఈఎస్ఐ వైద్యశాలలున్నాయని, వీటిల్లో 50 వైద్యశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, రెవెన్యూ అధికారులు స్థలాలు కేటాయిస్తే వెంటనే భవనాలు నిర్మించుకుంటామని చెప్పారు. కర్నూలు జిల్లా ఆదోని, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో డయాగ్నోసిస్ సెంటర్లు ఉన్నాయని, 10 పడకలు మాత్రమే ఇక్కడ ఉంటాయన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రిలలో ప్రాంతీయ వైద్యశాలలు ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 10 మంది సభ్యులకు గాను ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉంటారని తెలిపారు. -
‘ఈఎస్ఐ’ వ్యవహారంపై వివరణ ఇవ్వండి
* సాక్షి కథనంపై స్పందించిన హెచ్ఆర్సీ * సుమోటోగా కేసు నమోదు సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ ఆస్పత్రుల్లో వైద్యం అందక రోగులు పడుతున్న నరకయాతనపై సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఈఎస్ఐ రోగుల నరకయాతన’పై మానవహక్కుల కమిషన్ స్పందిం చింది. ఈ మేరకు మానవహక్కుల కమిషన్ ఇన్చార్జి చైర్మన్ పెదపేరిరెడ్డి సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేశారు. రీయింబర్స్మెంట్, మందుల సరఫరాదారుల అక్రమాలపై ఆగస్టు 19లోగా వివరణ ఇవ్వాలని ఈఎస్ఐ డెరైక్టర్, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీచేశారు. కాగా, ఈ వ్యవహారంపై ఈఎస్ఐ డెరైక్టర్ కె.మల్లేశ్వరరావు వివరణ ఇచ్చారు. ఈఎస్ఐ రోగులకు వైద్యబిల్లులు చెల్లించే విధానం మారినందు వల్ల చెల్లింపుల్లో జాప్యం జరిగిందని, జూలై 1 నుంచి క్రమం తప్పకుండా చెల్లింపులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. గతంలో రోగుల వైద్య బిల్లులు ఈఎస్ఐ కార్పొరేషన్ చెల్లించేదని, 2015 ఏప్రిల్ 1 నుంచి కేంద్ర పరిధిలో ఉండే ఈఎస్ఐ కార్పొరేషన్, రాష్ట్ర పరిధిలో ఉండే డెరైక్టరేట్లకు బదిలీ అయిందని చెప్పారు. ఈ నిధులను సాధారణ ఖాతాల్లోకి మార్చి, చెల్లింపులు జరిపేందుకు కొద్దిగా సమయం పట్టిందని పేర్కొన్నారు. అయితే 2015 ఏప్రిల్ 1 నుంచి సమస్య ఉందని డెరైక్టర్ చెబుతుండగా.. గతేడాది జూలై, ఆగస్టు బిల్లులు కూడా ఇప్పటి వరకు చెల్లింపులు జరగకపోవడం గమనార్హం. -
ఈఎస్ఐ రోగుల నరకయాతన
* రీయింబర్స్మెంట్ కోసం వేలాది మంది ఎదురుచూపులు * నిధులను తన్నుకుపోతున్న మందుల సరఫరాదారులు సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్) పరిధిలోని రోగులు పడుతున్న నరకయాతన అంతాఇంతా కాదు. కావాల్సిన వైద్యం ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అందక, తీరా ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటే.. ఈఎస్ఐ ఆ డబ్బులివ్వక వారి పరిస్థితి ఘోరంగా తయారైంది. రీయింబర్స్మెంట్ కోసం రోగులు ఈఎస్ఐ చుట్టూ నెలలతరబడి తిరుగుతున్నా పట్టించుకునే దిక్కు లేదు. గతేడాదిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. సుమారు నాలుగు వేల మంది రోగులు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకుని ఏడాది గడిచినా బిల్లులు రాలేదు. వీళ్లలో ఎక్కువ మంది గుండె సంబంధిత సమస్యలు, న్యూరో, గ్యాస్ట్రిక్ జబ్బులకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుని అప్పులు చేసి మరీ బిల్లులు చెల్లించిన వారే. చిరుద్యోగులకు ఈఎస్ఐ దెబ్బ నెలకు రూ. 15 వేల లోపు వేతనం వచ్చే చిరుద్యోగులే ఈఎస్ఐ ఆస్పత్రులకు వస్తారు. వీళ్లలో సుమారు 7 లక్షల మంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. మరో 5 లక్షలు ఏపీలోనూ, 2 లక్షల మంది తెలంగాణ జిల్లాల్లోనూ ఉన్నారు. వీళ్లతో పాటు వీరి కుటుంబ సభ్యులకూ ఈఎస్ఐ ఉచితంగా వైద్యమందించాలి. ఒకవేళ ఈఎస్ఐ ఆస్పత్రిలో సరైన వైద్యసేవలు లేకపోతే ప్రైవేటుకు వెళ్లేందుకు అనుమతిస్తారు. ఆ డబ్బు ఈఎస్ఐ చెల్లించాల్సి ఉంటుంది. కానీ వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అప్పులు చేసి వైద్యం చేయించుకున్నారు. వాటికి సంబంధించిన బిల్లులు చెల్లించడానికి మాత్రం ఈఎస్ఐ తాత్సారం చేస్తోంది. కాగా, ఈఎస్ఐ డెరైక్టరేట్లకు వచ్చే నిధులను ఆయా ఆస్పత్రులకు మందులు సరఫరా చేసే బడా డిస్ట్రిబ్యూటర్లు గద్దల్లా తన్నుకుపోతున్నారు. రోగుల శాతాన్ని బట్టి 65 శాతం నిధులు తెలంగాణకు, 35 శాతం ఏపీకి కేటాయించారు. ఈ నిధులను ఎప్పటికప్పుడు సరఫరాదారులు తన్నుకుపోతుండటంతో రోగులకు ఈఎస్ఐ రీయింబర్స్మెంట్ చెల్లించలేకపోతుంది. తాజాగా తెలంగాణలో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఫోన్ చేసి రెండు ఫార్మా కంపెనీలకు ఆర్డరు ఇప్పించుకోగలిగారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. అధికారులు కూడా కమీషన్లకు కక్కుర్తిపడి ఆస్పత్రుల శ్రేయస్సును కూడా గాలికొదిలేసి సరఫరాదారుల సేవలో తరిస్తున్నారు. ఈఎస్ఐ పరిధిలో ఉద్యోగుల వివరాలు ఈఎస్ఐ పరిధిలో ఉన్న తెలంగాణ ఉద్యోగులు : 9 లక్షలు వారి కుటుంబ సభ్యులు : 27 లక్షలు ఈఎస్ఐ పరిధిలో ఉన్న ఆంధ్ర ఉద్యోగులు : 5 లక్షలు వారి కుటుంబ సభ్యులు : 16 లక్షలు -
'కార్మిక దోపిడీని అడ్డుకోవడానికి సమగ్ర చర్యలు'
హైదరాబాద్: కార్మిక దోపిడీని అడ్డుకోవడానికి కేంద్రం సమగ్ర చర్యలు చేపడుతోందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మోడల్ ఐటీఐ కాలేజీలు మంజూరు చేసినట్టు చెప్పారు. తెలంగాణలో హైదరాబాద్, బోయిగూడ, రామగుండం, వరంగల్ ఈఎస్ఐ ఆస్పత్రులను ఆధునీకరిస్తామన్నారు. కార్మికుల భద్రత, ఆరోగ్యానికి పెద్దపీట వేస్తామని హామీయిచ్చారు. నాచారంలో డెంటల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉందన్నారు. శ్రమసువిధ పథకంలో భాగంగా కార్మికులకు యూనిట్ గుర్తింపు కార్డులు ఇస్తామని దత్తాత్రేయ తెలిపారు.